pizza
Varun Tej interview (Telugu) about Antariksham
`అంతరిక్షం` నటుడిగా నాకొక కొత్త ఎక్స్‌పీరియెన్స్‌ - వరుణ్‌ తేజ్‌
You are at idlebrain.com > news today >
Follow Us

20 December
Hyderabad

వరుణ్‌ తేజ్‌, అదితి రావు హైదరి, లావణ్య త్రిపాఠి, సత్యదేవ్‌,రాజా, శ్రీనివాస్‌ అవసరాల ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం 'అంతరిక్షం 9000 కె.ఎం.పి.హెచ్‌'. క్రిష్‌ జాగర్లమూడి సమర్పణలో ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై సంకల్ప్‌ రెడ్డి దర్శకత్వంలో క్రిష్‌ జాగర్లమూడి, సాయి బాబు జాగర్లమూడి, రాజీవ్‌ రెడ్డి నిర్మాతగా ఈ చిత్రం రూపొందింది. డిసెంబర్‌ 21న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా హీరో వరుణ్‌తేజ్‌ సినిమా గురించి విశేషాలను తెలియజేశారు...

- 'అంతరిక్షం' వంటి సినిమా చేయడం నటుడిగా నాకొక కొత్త ఎక్స్‌పీరియెన్స్‌. ఇంతకు ముందు సినిమాలంటే ఎక్కడో ఎవరో చేసిన క్యారెక్టర్‌ను బేస్‌గా తీసుకునే చాన్స్‌ ఉండేది. ఈ సినిమా విషయానికి వస్తే అస్ట్రానాయిడ్‌ రోల్‌ అంటే తెలుగులో ఎక్కడా రెఫరెన్స్‌ పాయింట్‌ కూడా లేదు. హాలీవుడ్‌ సినిమాల నుండి రెఫరెన్స్‌ తీసుకున్నాను. ఈ సినిమా ప్రారంభానికి ముందు గ్రావిటీ, ఇంటర్‌ స్టెల్లర్‌ సినిమాలను చూశాను. ఈ జర్నీ దాదాపు రెండేళ్ల క్రితం మొదలైంది. ఘాజి తర్వాత సంకల్ప్‌ నన్ను కలిశాడు. తను ఏ కథ చెబుతాడనేది నాకు అప్పుడు ఐడియా లేదు. బ్యాగ్‌లో నుండి ల్యాప్‌టాప్‌, మూడు నాలుగు శాటిలైట్‌ బొమ్మలు తీసి.. తన ఐడియా చెప్పి, ఇస్రో బ్యాక్‌డ్రాప్‌లో మన నెటివిటీతో చేద్దామనుకుంటున్నానని చెప్పాడు. సాధారణంగా కొత్త కథలతో సినిమాలు చేయాలనుకునే నాకు తన ఐడియా చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. అయితే ఎక్కడో చిన్న భయమైతే ఉండింది. స్పేస్‌ మూవీ అంటున్నారు. అది కూడా సౌత్‌ ఇండస్ట్రీలో ఇది వర్కవుట్‌ అవుతుందా? అనిపించింది.

- ఐడియా చెప్పిన తర్వాత స్క్రిప్ట్‌ను డెవలప్‌ చేయడానికి చాలా సమయం పట్టింది. తను ఇస్రోలో పనిచేసిన ఎక్స్‌ సైంటిస్ట్‌లను కలిసి వివరాలను సేకరించి స్క్రిప్ట్‌ రాసుకున్నాడు.

- స్పేస్‌లో టెంపరేచర్‌లో చాలా తక్కువగా ఉంటుంది. మైనస్‌ డిగ్రీల్లో ఉంటుంది. అందువల్ల అస్ట్రానాయిడ్స్‌ డిఫరెంట్‌గా దుస్తులను ధరిస్తారనే సంగతి తెలిసిందే. వాళ్లు వాడే మెటీరియల్‌ కాకుండా అలాగే ఉండేటట్లు ఆర్ట్‌ డైరెక్టర్‌ రామకృష్ణ, మోనిక డ్రెస్‌ డిజైన్‌ చేశారు. ఆ డ్రెస్‌ బరువు 15-20 కిలోల వరకు ఉండేది. ఆ డ్రెస్‌ వేసుకోవాలంటే పదిహేను నిమిషాల సమయం పట్టేది.

- హాలీవుడ్‌ స్పేస్‌ మూవీస్‌ అంటే వందల కోట్లు ఖర్చు పెట్టి తెరకెక్కిస్తారు. కానీ మా బడ్జెట్‌ లిమిటేషన్స్‌ మాకున్నాయి. కుదిరినంత వరకు బెస్ట్‌ ఔట్‌పుట్‌ ఇచ్చాం. గ్రాఫిక్స్‌తో పాటు ఎమోషన్స్‌ కూడా మా సినిమా డ్రైవ్‌ చేశాయి.

- రోప్స్‌ కట్టుకున్నప్పుడు వెయిట్‌ వల్ల పెయిన్‌ వస్తుంది. అయితే ఆ ప్రెజర్‌ ముఖంలో తెలియనీయకూడదు. అందుకని సినిమా స్టార్ట్‌ కావడానికి మూడు వారాల ముందుగానే ట్రయినింగ్‌ తీసుకున్నాం. బల్గేరియా నుండి వచ్చిన యాక్షన్‌ టీం మమ్మల్ని ట్రెయిన్‌ చేసింది. మూడు రోజులు కాస్త కష్టంగానే అనిపించినా.. తర్వాత అలవాటైంది.

- హాలీవుడ్‌ సినిమాల్లో జీరో గ్రావిటీ సీన్స్‌ చేయాలంటే పెద్ద పెద్ద మిషన్స్‌ ఉంటాయి. వాటి సహకారంతో సన్నివేశాల్ని తెరకెక్కిస్తారు. దానికి చాలా ఖర్చు అవుతుంది. అయితే మన సినిమా విషయానికి వస్తే.. సాహో, థగ్స్‌ ఆఫ్‌ ఇండియా సినిమాలకు పనిచేసిన స్పెషల్‌ వి.ఎఫ్‌.ఎక్స్‌ టీం ముంభై నుండి వచ్చింది. వాళ్లు మా సైజ్‌కు తగ్గట్లు రిగ్స్‌ను తయారు చేశారు. రోప్స్‌ ఉపయోగించి చేశాం. ప్రీ ప్రొడక్షన్‌లో వీటిని ముందుగానే ప్లాన్‌ చేసుకుంటూ రావడంతో ఇంత పెద్ద మూవీని 70-80 డేస్‌లో పూర్తి చేశాం.

interview gallery



- ప్రతి ఒక్కరికీ జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే తపన ఉంటుంది. దేవ్‌ అనే ఓ అస్ట్రానాయిడ్‌ ఇండియా పేరుని ప్రపంచ స్థాయిలో నిలబెట్టడానికి ఏం చేయాలనే తపనతో ఉంటాడనేదే కథ. చాలా సినిమాల్లో చూసిన కథే అయినా, స్పేస్‌ బ్యాక్‌డ్రాప్‌లో చేయడం వల్ల డిఫరెంట్‌గా అనిపిస్తుంది.

- ఈ సినిమాలో విలన్‌ అంటూ ఎవరూ లేరు. సినిమాలో సైంటిస్ట్‌లకు ఓ సమస్య వస్తుంది. అది ఫిక్స్‌ చేస్తారు. అది రాంగ్‌ అవుతుంది. దాన్ని ఎలా సాల్వ్‌ చేస్తారనేది సినిమాలో కథాంశం.

- బి, సి సెంటర్స్‌ ప్రేక్షకులు అని ప్రేక్షకులను డివైడ్‌ చేసి చెప్పడమేంటో నాకు అర్థం కాదు. అన్ని సందర్భాల్లో ప్రేక్షకులు సాంగ్స్‌, ఫైట్స్‌ ఉండాలని ఎక్స్‌పెక్ట్‌ చేయరు. ఉదాహరణకు నేను ఇప్పుడు చేస్తున్న ఎఫ్‌2 సినిమాలో సాంగ్‌, ఫైట్‌ను ఎక్స్‌పెక్ట్‌ చేయొచ్చు. ఉదాహరణకు చాలా ఇంగ్లీష్‌ సినిమాలు తెలుగులో డబ్‌ అయ్యి పెద్ద విజయాన్ని సాధించాయి. వరల్డ్‌ సినిమాల ఎక్స్‌పోజర్‌ తక్కువగా ఉండే ప్రేక్షకులు ఉంటారేమో కానీ.. వాళ్లకి కూడా ఈ సినిమా కొత్తగా అనిపిస్తుందని నా నమ్మకం.

- నేను ఎక్స్‌పెరిమెంట్‌ మూవీస్‌ను చేయడం లేదు. నా సినిమాల్లో ఓ కొత్త పాయింట్‌ ఉండాలనుకుంటున్నాను. అలాగే కొత్తగా ప్రెజంట్‌ చేయాలనుకుంటున్నానంతే.

- రాజీవ్‌ రెడ్డి, క్రిష్‌లతో కంచె తర్వాత నేను చేసిన రెండో చిత్రమిది. సాధారణంగా మార్కెట్‌ ఉండే హీరో బడ్జెట్‌కి తగినట్టు ఓ కమర్షియల్‌ సినిమాను చేసుకుని లాభం సంపాదించుకోవచ్చు. కానీ తను అలా కాదు. అన్నీ బ్యానర్‌ సినిమాల్లా ఉండకూడదని డిఫరెంట్‌ సినిమాలను ఫ్యాషన్‌తో చేస్తున్నాడు.

- తదుపరి సంక్రాంతికి 'ఎఫ్‌ 2' విడుదలవుతుంది. కిరణ్‌ కొర్రపాటితో గీతాఆర్ట్స్‌ బ్యానర్‌పై స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌ మూవీ చేస్తున్నాను. ఇందులో బాక్సర్‌గా కనపడతాను. హరీశ్‌ శంకర్‌ జిగర్‌ తండా రీమేక్‌ ఇంకా ప్రారంభ దశ చర్చల్లోనే ఉంది. సాగర్‌ చంద్ర దర్శకత్వంలో 14 రీల్స్‌ బ్యానర్‌పై ఓ సినిమాలో నటించబోతున్నాను.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved