pizza
Varun Tej interview (Telugu) about Tholi Prema
రెండు సినిమాలకు పోలిక లేదు - వరుణ్‌ తేజ్‌
You are at idlebrain.com > news today >
Follow Us

9 February 2018
Hyderabad

వరుణ్‌తేజ్‌, రాశీ ఖన్నా జంటగా నటించిన చిత్రం 'తొలిప్రేమ'. వెంకీ అట్లూరి దర్శకుడు. బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మాత. ఫిబ్రవరి 10న సినిమా విడుదలవుతున్న సందర్భంగా హీరో వరుణ్‌ తేజ్‌ పాత్రికేయులతో సినిమా గురించి ముచ్చటించారు..

మీ బాబాయ్‌(పవన్‌ కల్యాణ్‌) 'తొలి ప్రేమ'కు..మీ 'తొలిప్రేమ' సంబంధమేంటి?
- మా 'తొలిప్రేమ'ను కల్యాణ్‌ బాబాయ్‌ తొలిప్రేమతో పోల్చలేం. ఎందుకంటే అప్పటి జనరేషన్‌కు తగినట్లు ఆ తొలిప్రేమను తెరకెక్కించారు. ఆ సినిమా విడుదలైన 20 సంవత్సరాలవుతుంది. ఇప్పటి తరానికి నచ్చేలా మా 'తొలిప్రేమ'ను తెరకెక్కించాం.

- పాత తొలి ప్రేమలో హీరో దగ్గర మొబైల్‌ ఉండదు. తన ప్రేమను చెప్పడానికి రక్తంతో లవ్‌ లెటర్‌ రాసిస్తాడు. జనరేషన్‌ గ్యాప్‌, ప్రవర్తన ఎలా ఉంటుందో సినిమాలో చూపిస్తున్నాం.

'తొలిప్రేమ' అనే టైటిల్‌ను ఎందుకు పెట్టాలనుకున్నారు?
- సినిమా 70 శాతం చిత్రీకరణ పూర్తయ్యేంత వరకు టైటిల్‌ విషయంలో క్లారిటీ రాలేదు. వెంకీ అట్లూరి రెండు మూడు టైటిల్స్‌ అనుకున్నారు. ఇంగ్లీష్‌ టైటిల్స్‌ వచ్చాయి. తెలుగు టైటిల్‌ అయితే క్యాచీగా ఉంటుందనిపించింది. సినిమాలో కథకు రిలేటెడ్‌గా ఉండాలని బాపిగారు.. తొలిప్రేమ టైటిల్‌ను సూచించారు. అయితే ఈ టైటిల్‌ను పెట్టాలా లేదా? అనే దానిపై చాలా ఆలోచించాం. కథేంటో తెలుసు కాబట్టి. కథను యాప్ట్‌ అయ్యే టైటిల్‌ ఇదేనని యూనిట్‌ అందరికీ అనిపించి ఈ టైటిల్‌నే ఫిక్స్‌ అయ్యాం.

టైటిల్‌ అనౌన్స్‌ తర్వాత పవన్‌కల్యాణ్‌తో టైటిల్‌ గురించి డిస్కస్‌ చేశారా?
వన్‌కల్యాణ్‌ కల్యాణ్‌ బాబాయ్‌తో ఈ టైటిల్‌ గురించి డిస్కషన్‌ రాలేదు. అయితే ఉషాకిరణ్‌ మూవీస్‌ వారి దగ్గర ఈ టైటిల్‌ ఉందని తెలిసి.. నిర్మాతలు వారిని సంప్రదించి మాట్లాడారు. వారు తొలిప్రేమ టైటిల్‌ను మాకు ఇచ్చారు.

'ఫిదా'లో మీ క్యారెక్టర్‌కు..'తొలిప్రేమ'లోని క్యారెక్టర్‌కు తేడా ఏంటి?
- క్యారెక్టరైజేషన్‌ పరంగా ఫిదాకు ఈ సినిమాకు చాలా తేడా ఉంటుంది. ఫిదాలో నేను ఎన్నారై యువకుడిగా, సాఫ్ట్‌గా కనపడతాను. కానీ తొలిప్రేమలో నా పాత్ర చాలా ఎగ్రెసివ్‌గా ఉంటుంది. 'ఫిదా' విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటే.. 'తొలిప్రేమ' న్యూ ఏజ్‌ మూవీ.

మీకేమైనా తొలి ప్రేమ అనుభవాలున్నాయా?
- నేను ప్రేమకు చాలా తక్కువగా సమయం కేటాయించాను. సాధారణంగా తొలిప్రేమ అనేది ఏ వ్యక్తికైనా చాలా టఫ్‌గా ఉంటుంది. దాన్ని మిస్‌ చేసుకుంటే.. దాని నుండి బయటకు రావడం చాలా కష్టం. నా స్నేహితుల్లో చాలా మంది దాన్ని ఎక్స్‌పీరియెన్స్‌ చేశారు. ఓ అబ్బాయి, అమ్మాయి మధ్య తొలిప్రేమ పుట్టిన తర్వాత దాన్నుండి బయటకు రావడం అంత సులభం కాదు. అదే విషయాన్ని మేం ఎనిమిది సంవత్సరాల టైమ్‌ పీరియడ్‌లో మూడు ఫ్రేమ్స్‌లో చూపించాం.

ప్రారంభం నుండి కొత్త కాన్సెప్ట్‌ మూవీస్‌ చేస్తూనే ఉన్నారు కదా?
- పెద్దనాన్న, నాన్న, బాబాయ్‌ హాలీవుడ్‌ సినిమాలు బాగా చూస్తారు. నేను కూడా మూవీ లవర్‌ని కావడంతో.. చిన్నప్పట్నుంచి సినిమాలు బాగా చూసేవాడిని. హాలీవుడ్‌ తరహాలో కొత్త జోనర్‌ సినిమాలెందుకు చేయలేమనే ఆలోచన మదిలో ఉండేది. నేను హీరో అయ్యాక .. నేను ఆ విషయంలో ముందు అడుగు వేస్తే తప్పేంటి అని ఆలోచించి నా వంతుగా ప్రయత్నాలు చేస్తున్నాను.

మీ 'తొలిప్రేమ' చిత్రంలో మీకు నచ్చిన సన్నివేశం ఏది?
- ఈ సినిమాలో క్లైమాక్స్‌ సీన్‌ నాకు చాలా బాగా ఇష్టమైన సీన్‌. ప్రేమికుల మధ్య బ్రేకప్స్‌ జరిగేటప్పుడు దానికి పెద్ద కారణాలుండవు. పరిణితితో ఆలోచించకపోవడం వల్ల కూడా బ్రేకప్స్‌ జరుగుతుంటాయి. ఈ సినిమాలో కూడా అలాగే చూపించాం. చాలా మంది ఈ సినిమా చూసినప్పుడు ఇలాంటి ఎలిమెంట్స్‌కు బాగా కనెక్ట్‌ అవుతారు. యు.ఎస్‌.లో ప్రీమియర్స్‌ చూసినవారు నాకు 'సినిమా చూడగానే ఒకసారి మేం గతంలోకి వెళ్లాం' అంటూ మెసేజ్‌లు పంపుతున్నారు.

interview gallery



దర్శకుడు వెంకీ గురించి...?
- ఏ సినిమాకైనా కథే హీరో అని నేను బాగా నమ్ముతాను. వెంకీతో ఐదారేళ్లుగా పరిచయం ఉంది. అయితే తను దర్శకుడు కావాలనుకుంటున్నట్లు తెలియదు. కలిసినప్పుడు సాధారణంగా మాట్లాడుకునేవాళ్లం కానీ వెంకీ ఎప్పుడూ చెప్పలేదు. అలాగే మా నిహారిక చేసిన 'ముద్దపప్పు అవకాయ్‌' వెబ్‌ సిరీస్‌కు తను రైటింగ్‌ సైడ్‌ సహాయం చేశాడు. ఒకసారి కలిసి కథ చెబుతానన్నాడు. ఏ సినిమాకైనా కథే హీరో అని నేను బాగా నమ్ముతాను. కథ వినగానే బాగా నచ్చింది. వెంకీ ఆల్‌రెడీ రైటింగ్‌ డిపార్ట్‌మెంట్‌లో వర్క్‌చేశాడు కాబట్టి నాకు వెంకీపై నమ్మకం ఉండేది.

నిర్మాతలు గురించి..?
- సినిమా మేకింగ్‌లో నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదు. బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌గారు ప్రొడక్షన్‌ వ్యవహారాలు చూసుకుంటే.. బాపినీడు స్టోరీ డిస్కషన్స్‌ నుండి యూనిట్‌తో ట్రావెల్‌ అవుతూ వచ్చారు. మరుసటి రోజు ఏం చేయాలని కూడా మా అందరితో బాపినీడు డిస్కస్‌ చేసేవాడు.

హీరోయిన్‌గా రాశీ ఖన్నాకు ఎందుకు ఎంపిక చేశారు?
- లవ్‌స్టోరీ అనగానే హీరోయిన్‌గా కొత్త అమ్మాయిని తీసుకోమని చాలా మంది సలహా ఇచ్చారు. అయితే ఆల్‌రెడీ ఇండస్ట్రీలో ఉన్న అమ్మాయినే హీరోయిన్‌గా తీసుకుందామని అనుకుని రాశీ ఖన్నాను సెలక్ట్‌ చేశారు. 'ఊహలు గుసగుసలాడే' సినిమాలో రాశి నటన అందరికీ నచ్చడంతో తనైతే ఈ సినిమాకు సరిపోతుందనిపించింది. తను కూడా మంచి లవ్‌స్టోరీ కోసం వెయిట్‌ చేస్తున్నానని చెప్పింది. పాత్ర కోసం బరువు తగ్గింది.

తదుపరి చిత్రాలు?
- సంకల్ప్‌ రెడ్డి దర్శకత్వంలో ఓ సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ చేయబోతున్నాను. అంతరిక్షానికి సంబంధించిన కథాశంతో నడిచే సినిమా. కంచె సినిమాను నిర్మించిన రాజీవ్‌రెడ్డిగారు ఈ సినిమాను నిర్మించబోతున్నారు. కథ మాత్రమే విన్నాను. నాకు ఇది కచ్చితంగా ప్రెస్టీజియస్‌ ప్రాజెక్ట్‌ అవుతుంది. తెలుగులో ఈ సినిమాను నిర్మించబోతున్నారు. నిజ ఘటనను ఆధారంగా చేసుకుని కథను తయారు చేస్తున్నారు. అనిల్‌ రావిపూడి సినిమా స్టార్ట్‌ కావడానికి సమయం పడుతుంది. దిల్‌రాజుగారితో నాకు మంచి అనుబంధం ఉంది. నాతో దిల్‌రాజుగారు ఓ స్నేహితుడిలా ఉంటారు. అనిల్‌ ఓ పాయింట్‌లాగానే చెప్పారు. కథ అంతా రెడీ అయిన తర్వాతే వివరాలు తెలుస్తాయి.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved