pizza
Venkatesh interview (Telugu) about F2
వెన‌క్కి తిరిగి చూసుకుంటే అవి ఉంటాయి - వెంక‌టేష్‌
You are at idlebrain.com > news today >
Follow Us

9 January 2018
Hyderabad

విక్ట‌రీ వెంక‌టేష్ దాదాపు ఐదారేళ్ల త‌ర్వాత సంక్రాంతికి వ‌స్తున్న సినిమా `ఎఫ్‌2`. ఫ‌న్ అండ్ ప్ర‌స్ట్రేష‌న్ అనే ట్యాగ్‌లైన్‌తో వ‌స్తున్న చిత్ర‌మిది. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. వ‌రుణ్ సందేశ్ మ‌రో క‌థానాయ‌కుడు. దిల్‌రాజు నిర్మించారు. శనివారం విడుద‌ల కానున్న ఈ సినిమా గురించి వెంక‌టేష్ బుధ‌వారం మ‌ధ్యాహ్నం విలేక‌రుల‌తో మాట్లాడారు. ఆ విశేషాలు...

* వైవిధ్య‌మైన సినిమాలే చేయాల‌ని కంక‌ణం క‌ట్టుకున్న‌ట్టున్నారు?
- గురు త‌ర్వాత చేస్తున్న సినిమా ఇది. ఆ త‌ర్వాత చాలా స్క్రిప్ట్ లు విన్నాను. కానీ కుద‌ర‌లేదు. ఈ స్క్రిప్ట్ న‌చ్చింది. నా కైండ్ స్టోరీ ఉంటూనే కొత్త‌గా ఉంది. యువ‌కుడితో క‌లిసి ప‌నిచేయ‌డంలో ఒక‌ర క‌మైన ఆనందం ఉంటుంది. వారి నుంచి మ‌నం నేర్చుకోవ‌చ్చు. మ‌న నుంచి వారు తెలుసుకుంటారు. అందులోనూ ఇందులో నేనూ, వ‌రుణ్ తోడ‌ళ్లుళ్లుగా న‌టించాం. బిఫోర్ మేరేజ్‌, ఆఫ్ట‌ర్ మేరేజ్ వంటివ‌న్నీ ఫ‌న్నీగా ఉంటాయి.

* ఒన్లీ ఫ‌న్నీగానే ఉంటాయా.. లేకుంటే ఏమైనా సందేశాలుంటాయా?
- పెళ్లి గురించి, భార్య‌ల గురించి ఎంత స‌ర‌దాగా మాట్లాడుకున్నా, ఆడ‌వాళ్లు లేనిదే సృష్టిలేదు. ఆడ‌వాళ్ల గొప్ప‌ద‌నాన్ని మ‌నం గుర్తించాలి.

* ఈ మ‌ధ్య మీటూ అంటూ ముందుకొస్తున్నారు. దాని మీద పంచ్‌లుంటాయా?
- దాన్ని గురించి కామెంట్ ఎందుకు? ప‌ంచ్‌లు ఎందుకు? అలా వ‌చ్చి చెప్పిన వారిని మ‌నం గౌర‌వించాలి.

* ఐదేళ్ల త‌ర్వాత సంక్రాంతికి రావ‌డం గురించి?
- చాలా హ్యాపీగా ఉంది. ఎఫ్‌2 ప‌క్కా ఫ్యామిలీ సినిమా. గ‌త నాలుగైదేళ్లుగా సినిమాలు బావుంటే ఫ్యామిలీ ఫ్యామిలీలు థియేట‌ర్ల‌కు రావ‌డాన్ని చూస్తూనే ఉన్నాం. ఈ సినిమాలో నాకు తెలియ‌కుండానే, ఎన్నో ఇంప్రూవైజ్‌లు మేన‌రిజ‌మ్స్ ప‌రంగా జ‌రిగిపోయాయి. సినిమాలో, పాత్ర‌లో లీన‌మైన‌ప్పుడే అలాంటివ‌న్నీ జ‌రుగుతాయి.

* అనిల్ రావిపూడి గురించి చెప్పండి?
- చాలా మంచి కుర్రాడు. స్వ‌యంగా రైట‌ర్ కావ‌డంతో ఎక్క‌డైనా, ఏదైనా పంచ్ కావాల‌నిపించినా వెంట‌నే ప‌క్కకెళ్లి రాసుకునేవాడు. నా గ‌త చిత్రాల‌న్నిటినీ స్ట‌డీ చేసిన‌ట్టు అనిపించింది.

* వ‌రుణ్ తో చేయండి?
- చాలా త‌క్కువ కాలంలోనే క‌లిసిపోయాడు. ఇమేజ్ చ‌ట్రంలో ఇరుక్కోకుండా త‌న‌దైన శైలితో ముందుకు సాగుతున్నాడు. తెలంగాణ యాస‌లో మాట్లాడాడు. ప‌ర్స‌నాలిటీ కూడా చాలా బావుంటుంది. బాగా చేశాడు. త‌న‌కీ, మెహ్రీన్‌కి మ‌ధ్య స‌న్నివేశాలు కూడా బావుంటాయి.

* ఫ‌లానా పాత్ర చేయ‌లేక‌పోయాన‌నే ఫీలింగ్ ఉంటుందా?
- ఫీలింగ్ అని కాదు కానీ, వెన‌క్కి తిరిగి చూసుకుంటే అలాంటి సినిమాలు డాట్స్ రూపంలో క‌నిపిస్తుంటాయి. నాకే కాదు. ఇంకా చాలా మందిదీ అదే ప‌రిస్థితి.

* ఇంకా చేయాల‌నుకుంటున్నా పాత్ర‌లున్నాయా?
- ఎప్పుడూ ఫ‌లానా అని కోరుకోను. అయినా నాలోని న‌ట‌న‌ను పూర్తి స్థాయిలో చూపించ‌ద‌గ్గ పాత్ర‌ల కోసం వెయిట్ చేస్తున్నా. నాకు ఏం ఇవ్వాలో ప్ర‌కృతికి తెలుసు. నాకు కావ‌లిసిన‌న్ని పాత్ర‌లు వ‌స్తూనే ఉంటాయి. వాటిలో నుంచి నాకు న‌చ్చిన‌వి నేను సెల‌క్ట్ చేసుకోవ‌డ‌మే. నాకూ అమీర్‌ఖాన్ చేసే సినిమాలు, అమితాబ్ త‌ర‌హా వైవిధ్య‌మైన చిత్రాలు చేయాల‌ని ఉంటుంది. అంతెందుకు బాహుబ‌లి లాంటి సినిమాలు చేయాల‌ని కూడా ఉంటుంది.

* ఈ సినిమాలో మీ పాత్ర‌కు వెంకీ అనే పేరు పెడితే ముందు వ‌ద్ద‌న్నార‌ట?
- అలాగ‌నేం కాదు. ఆ మ‌ధ్య కూడా ఓ సినిమాలో నా పాత్ర‌కు వెంకీ అనే పేరు పెట్టారు. వ‌రుస‌గా వెంకీ పేరు ఎక్కువ‌గా వినిపిస్తోంద‌ని వ‌ద్ద‌న్నాను. మ‌ర‌లాఅదే కావాల‌న‌డంతో ఓకే చేశాం.

interview gallery* వెంకీ ఆస‌నాన్ని మీరే సూచించారా?
- లేదు. స్క్రిప్ట్ ఇంప్రువైజ్‌లో భాగంగా వ‌చ్చింది.

* ఇంత ఫిట్‌గా ఎలా ఉన్నారు?
- ప్ర‌తిరోజూ జీవితాన్ని ఆస్వాదిస్తా. క్ర‌మ‌శిక్ష‌ణ‌తో ఉంటా. అంత‌కు మించి మ‌రేమీ లేదు. బాహ్య ప్ర‌పంచం గురించి పెద్ద‌గా ప‌ట్టించుకోను. సూర్యోద‌యాన్ని చూస్తా. ప‌క్షులను గ‌మ‌నిస్తా. ప‌క్క‌వాళ్లు బావుండాల‌ని కోరుకుంటా.

* నెక్స్ట్ చేస్తున్న సినిమాలేంటి?
- వెంకీ మామ ఉంది. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఒక‌టి ఉంటుంది. అనిల్ మ‌ర‌లా ఇంకో స్క్రిప్ట్ ఏదో రెడీ చేస్తున్నాడు. ఏది ముంద‌వుతుందో చూడాలి. వెంకీ మామ‌లో చాలా మంచి రోల్ చేస్తున్నా. నా రోల్ ఎంత బావుంటుందో, చైతూ పాత్ర కూడా అంతే బావుంటుంది.

* ఇమేజ్ గురించి ఆలోచిస్తుంటారా?
- నాకు ఎప్పుడూ ఇమేజ్ అనేది అర్థం కాదు. నాకు సినిమా అనేది వ్యాపారం మాత్ర‌మే. ఇమేజ్ అనేది నేను ఆలోచిస్తేనో, నేను అనుకుంటేనో వ‌చ్చేది కాదు. అంత‌కు మించింది. ప్ర‌జ‌లు ఇవ్వాల్సింది. కాబ‌ట్టి నేను దాని గురించి ఆలోచించ‌ను. నాతో సినిమాలు తీసిన నిర్మాత బావుండాలి. పంపిణీదారులు బావుండాల‌నే అనుకుంటా. అంత‌కుమించి కంట్రోల్ చేయాల‌ని అనుకోను.

* మీతో పోలిస్తే ఇప్పుడొస్తున్న యంగ్‌స్ట‌ర్స్ కి ఎక్కువ సౌక‌ర్యాలు ఉన్న‌ట్టున్నాయి?
- ప్రపంచంలో అంద‌రికీ సౌక‌ర్యాలు పెరుగుతూనే ఉన్న‌యిగా. పాపం వీళ్ల‌కి ఉండ‌కూడ‌దా? ఉండాలి. ఎప్పుడూ మ‌న ప‌క్క‌నున్న వాళ్లు బావుండాలి. అలా వాళ్లు బావుంటే మ‌నం కూడా బావుంటాం. ఆ విష‌యాన్ని న‌మ్ముతా.

* సోష‌ల్ మీడియాలో ఈ మ‌ధ్య ఎంట‌ర్ అయ్యారు?
- మిగిలిన వేదిక‌ల‌తో పోలిస్తే నాకు ఇన్‌స్టాగ్రామ్ చాలా బావుంద‌నిపించింది. నేను వ్య‌క్తిగ‌తంగా ఫొటోగ్ర‌ఫీని ఇష్ట‌ప‌డ‌తా. ప్ర‌కృతిని తీసిన ఫొటోల‌ను ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తుంటా. మిగిలిన వేదిక‌ల‌ను నేను అంత తేలిగ్గా మేనేజ్ చేయ‌లేనేమోన‌ని అనిపిస్తుంది.అంతేకాదు ఫోర్స్ ఫుల్‌గా ఏం చేసినా, అది నాకు ఒత్తిడిని క‌లిగిస్తుంది.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved