Irumudi 50% complete
మాస్ మహారాజా రవి తేజ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో శివ నిర్మాణ తెరకెక్కిస్తున్న ‘ఇరుముడి’ షూటింగ్ 50 శాతం పూర్తి.. ప్రస్తుతం హైదరాబాద్‌లో హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ
మాస్ మహారాజా రవి తేజ ప్రస్తుతం తన ‘ఇరుముడి’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తుండగా.. ప్రతిష్టాత్మక పాన్-ఇండియన్ పవర్‌హౌస్ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ భారీ ఎత్తున నిర్మిస్తోంది. మేకర్స్ ఇప్పటికే రవి తేజ, ప్రియా భవానీ శంకర్‌ల ఫస్ట్ లుక్‌ను పోస్టర్‌ను విడుదల చేసి అందరిలోనూ క్యూరియాసిటీని పెంచేసిన సంగతి తెలిసిందే.
ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోండగా ఇప్పటికే 50% షూటింగ్ పూర్తయిందని మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం చిత్ర బృందం హైదరాబాద్‌లో హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలను షూట్ చేస్తోంది. అనల్ అరసు, రియల్ సతీష్ స్టంట్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ అందిస్తున్నారు. ఇటీవలి కాలంలో చూడనటువంటి అత్యంత అద్భుతమైన ఫైట్‌లను ప్రేక్షకులు చూడబోతున్నారని టీం చెబుతోంది.
యాక్షన్ ప్రధాన ఆకర్షణగా ఉన్నప్పటికీ ‘ఇరుముడి’లో అద్భుతమైన కథ, కాన్సెప్ట్ ఉంటుంది. అయ్యప్ప స్వామి, అయ్యప్ప మాల నేపథ్యంలో సాగే ఈ కథలో ఓ అందమైన కుటుంబం, ఫ్యామిలీ ఎమోషన్స్ అద్భుతంగా ఉండబోతోన్నాయని మేకర్స్ వదిలిన పోస్టర్స్, కంటెంట్ చెబుతోంది. దర్శకుడు శివ నిర్వాణ ఒక కమర్షియల్ ఎంటర్‌టైనర్‌కు అవసరమైన అన్ని అంశాలను, బలమైన భావోద్వేగ ప్రధానాంశంతో సమతుల్యం చేస్తూ ఒక అద్భుతమైన స్క్రిప్ట్‌ను రూపొందించారు.
రవి తేజ తాను ఇంతకు ముందు పోషించిన పాత్రల్లన్నింటిలోనూ భిన్నమైన పాత్రను ‘ఇరుముడి’లో పోషిస్తున్నారు. ఈ చిత్రంలో తన కుమార్తెగా నటించిన బేబీ నక్షత్రతో రవి తేజకు ఉన్న బంధాన్ని చూపిస్తూ, చిత్ర బృందం ఒక అందమైన, ఆకట్టుకునే పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో రవి తేజ వింటేజ్, విలేజ్, మాస్ లుక్‌లో కనిపిస్తున్నారు. సాధారణ చెక్డ్ షర్ట్, లుంగీ ధరించి తన కుమార్తెతో కలిసి నడుస్తూ ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. ఈ పోస్టర్‌ను చూస్తుంటే తండ్రీకూతుళ్లు మధ్య మంచి ఎమోషనల్ సీన్లను సినిమాలో చూపించేలా ఉన్నారనిపిస్తోంది.
సాయి కుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక వంటి అద్భుతమైన ఆర్టిస్టులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. నిర్మాతలైన నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ ప్రాజెక్ట్‌ను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలలో ఒకటిగా నిలవనుంది. ఈ మూవీకి విష్ణు శర్మ సినిమాటోగ్రఫర్‌గా, సాహి సురేష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, ప్రవీణ్ పూడి ఎడిటర్‌గా పని చేస్తున్నారు. శివ నిర్వాణ కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించగా, నరేష్ బాబు పి స్క్రిప్ట్ కో ఆర్డినేటర్‌గా వర్క్ చేస్తున్నారు.
నటీనటులు: మాస్ మహారాజా రవితేజ, ప్రియా భవానీ శంకర్, సాయి కుమార్, బేబీ నక్షత్ర, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక, మీసాల లక్ష్మణ్, రాజ్ కుమార్ కసిరెడ్డి, రమణ భార్గవ్, కిషోర్ కంచెరపాలెం, కార్తీక్ అడుసుమల్లి, మహేష్ తదితరులు
సాంకేతిక సిబ్బంది:
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: శివ నిర్వాణ
నిర్మాతలు: నవీన్ యెర్నేని మరియు వై రవిశంకర్
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
DOP: విష్ణు శర్మ
ప్రొడక్షన్ డిజైనర్: సాహి సురేష్
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
స్క్రిప్ట్ కో-ఆర్డినేటర్: నరేష్ బాబు పి
కో-డైరెక్టర్: సురేష్
మేకప్: శ్రీనివాస్ రాజు
కాస్ట్యూమర్ డిజైనర్: రాజేష్
స్టంట్స్ : అనల్ అరసు, రియల్ సతీష్
పోస్టర్ డిజైనర్: ఎల్లో టూత్స్