A Song That Feels Just Like Home- A Pleasant Number Yaalalo Yaalalo From Mass Maharaja Ravi Teja, Shiva Nirvana, Mythri Movie Makers' Irumudi Unveiled
మాస్ మహారాజా రవి తేజ, శివ నిర్వాణ, మైత్రి మూవీ మేకర్స్ 'ఇరుముడి' నుంచి బ్యూటీఫుల్ హోమ్లీ సాంగ్ 'యాలాలో యాలాలో' రిలీజ్
Mass Maharaja Ravi Teja's highly anticipated wholesome family entertainer Irumudi has been steadily raising enthusiasm with its refreshing promotional campaign. Directed by Shiva Nirvana and produced by Mythri Movie Makers, the film has already struck a chord with audiences through its devotional first single Irumudi Kattu. Keeping the momentum going, the makers have now unveiled the second track, Yaalalo Yaalalo, a soothing melody that beautifully celebrates the warmth of family.
Composed by GV Prakash Kumar, Yaalalo Yaalalo is a soulful and breezy number elevated by understated yet effective orchestration. The heartfelt lyrics by Anantha Sriram capture the essence of a middle-class household, emphasizing that love, togetherness, and relationships hold far greater value than material wealth. The emotionally rich vocals of Hesham Abdul Wahab and Sadhika KR further enhance the song's appeal, making it instantly relatable.
The song also offers a glimpse into the film's emotional core. Ravi Teja is introduced as a hardworking auto driver who loves his family unconditionally despite struggling with alcoholism. Priya Bhavani Shankar plays his strong-willed wife, who shoulders the family's responsibilities with determination, while their daughter shares an inseparable bond with her father and stands firmly by his side. The visuals seamlessly complement the lyrics, making the family dynamics feel genuine and deeply moving. Yaalalo Yaalalo has all the ingredients to become an instant favorite and dominate playlists in the days ahead.
It is refreshing to see Ravi Teja step into such a rooted and emotionally driven character, and he appears completely at ease in the role. Priya Bhavani Shankar delivers a convincing presence as the family's backbone, while Baby Nakshatra leaves a lasting impression with her natural performance. The emotions portrayed throughout the song feel authentic and universally relatable. What’s more, the choreography was done by the director himself. Shiva Nirvana deserves appreciation for beautifully capturing an entire spectrum of emotions within a single song, making it both emotionally engaging and deeply impactful.
Produced by Naveen Yerneni and Y. Ravi Shankar, Irumudi boasts a strong technical team featuring cinematographer Vishnu Sarma, production designer Sahi Suresh, editor Prawin Pudi, and music composer GV Prakash Kumar.
With every promotional update striking the right emotional chord, anticipation for Irumudi continues to soar ahead of its grand theatrical release on August 21.
Cast: Mass Maharaja Ravi Teja, Priya Bhavani Shankar, Sai Kumar, Baby Nakshathra, Ajay Ghosh, Ramesh Indira, Swasika, Meesala Lakshman, Rajkumar Kasireddy, Ramana Bhargav, Kishore Kancherapalem, Karthik Adusumalli, and Mahesh
Technical Crew:
Story, Screenplay, Dialogues, Direction: Shiva Nirvana
Producers: Naveen Yerneni and Y Ravi Shankar
Banner: Mythri Movie Makers
Music: GV Prakash Kumar
DOP: Vishnu Sarma
Production Designer: Sahi Suresh
Editing: Prawin Pudi
Script Co-Ordinator: Naresh babu P
Co-Director: Suresh
Make-Up: Srinivas Raju
Costumer Designer: Rajesh
Poster Designer: Yellow Tooths
మాస్ మహారాజా రవి తేజ, శివ నిర్వాణ, మైత్రి మూవీ మేకర్స్ 'ఇరుముడి' నుంచి బ్యూటీఫుల్ హోమ్లీ సాంగ్ 'యాలాలో యాలాలో' రిలీజ్
మాస్ మహారాజా మోస్ట్ ఎవైటెడ్ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఇరుముడి' ప్రమోషన్స్ తో ఉత్సాహాన్ని పెంచుతోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం, తన భక్తి గీతమైన మొదటి పాట 'ఇరుముడి కట్టు'తో ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంది. అదే జోరును కొనసాగిస్తూ, కుటుంబ బంధాలలోని ఆప్యాయతను అందంగా చాటిచెప్పే రెండవ పాట 'యాలాలో యాలాలో'ను చిత్ర బృందం విడుదల చేసింది.
జీవీ ప్రకాష్ కుమార్ స్వరపరిచిన ఈ పాటకు ఆయన అందించిన సాఫ్ట్ మెలోడీ, ఆర్కెస్ట్రేషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంత శ్రీరామ్ రాసిన సాహిత్యం మధ్యతరగతి కుటుంబంలోని ప్రేమ, అనుబంధాలు, ఆప్యాయతలే అసలైన సంపద అనే భావాన్ని హృదయానికి హత్తుకునేలా చెబుతుంది. హెషామ్ అబ్దుల్ వహాబ్, సాధికా కెఆర్ ఆలపించిన తీరు పాటకు మరింత భావోద్వేగాన్ని జోడించింది.
ఈ పాట ద్వారా సినిమా ఎమోషనల్ కోర్‌ను కూడా మేకర్స్ చూపించారు. రవితేజ కుటుంబాన్ని ప్రాణంగా ప్రేమించే ఓ ఆటో డ్రైవర్‌గా కనిపిస్తారు. మద్యానికి బానిసైనప్పటికీ కుటుంబం కోసం తపించే తండ్రి పాత్రలో ఆయన సహజమైన నటన ఆకట్టుకుంటోంది. ప్రియ భవాని శంకర్ కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకునే భార్య పాత్రలో మెప్పించగా, బేబీ నక్షత్ర తండ్రితో విడదీయలేని అనుబంధం ఉన్న కూతురిగా మనసుని తాకింది. పాటలోని ప్రతి విజువల్, ప్రతి ఎమోషన్ సాహిత్యానికి అద్భుతంగా తోడై కుటుంబ బంధాలను ఎంతో సహజంగా చూపించింది. ఈ పాట విడుదలైన వెంటనే ప్రేక్షకులకి ఫేవరేట్ గా మారింది
ఇప్పటివరకు మాస్, యాక్షన్ పాత్రలతో అలరించిన రవితేజ... ఈసారి పూర్తిగా భిన్నమైన భావోద్వేగ పాత్రలో కనిపిస్తున్నారు. ప్రియ భవాని శంకర్, బేబీ నక్షత్ర కూడా తమ సహజమైన నటనతో పాటకు మరింత బలం చేకూర్చారు. ముఖ్యంగా ఈ పాటకు దర్శకుడు శివ నిర్వాణ స్వయంగా కోరియోగ్రఫీ చేయడం విశేషం. ఒకే పాటలో కుటుంబ ప్రేమ, బాధ, ఆప్యాయత, అనుబంధాలను ఎంతో అందంగా ఆవిష్కరించిన ఆయన వర్క్ ప్రత్యేక ప్రశంసలు అందుకునేలా ఉంది.
నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, సాహి సురేష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, ప్రవీణ్ పూడి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం ఈ చిత్రానికి మరో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
ప్రతి ప్రమోషనల్ కంటెంట్‌తో ప్రేక్షకుల మనసులను తాకుతున్న 'ఇరుముడి' ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.
నటీనటులు: మాస్ మహారాజా రవితేజ, ప్రియా భవానీ శంకర్, సాయి కుమార్, బేబీ నక్షత్ర, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక, మీసాల లక్ష్మణ్, రాజ్ కుమార్ కసిరెడ్డి, రమణ భార్గవ్, కిషోర్ కంచెరపాలెం, కార్తీక్ అడుసుమల్లి, మహేష్
సాంకేతిక సిబ్బంది:
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: శివ నిర్వాణ
నిర్మాతలు: నవీన్ యెర్నేని మరియు వై రవిశంకర్
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
DOP: విష్ణు శర్మ
ప్రొడక్షన్ డిజైనర్: సాహి సురేష్
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
స్క్రిప్ట్ కో-ఆర్డినేటర్: నరేష్ బాబు పి
కో-డైరెక్టర్: సురేష్
మేకప్: శ్రీనివాస్ రాజు
కాస్ట్యూమర్ డిజైనర్: రాజేష్
పోస్టర్ డిజైనర్: ఎల్లో టూత్స్