Aniesh about Itlu Arjuna
‘ఇట్లు అర్జున’ లాంటి ఛాలెంజింగ్ క్యారెక్టర్‌తో నటుడిగా పరిచయం కావడం ఆనందంగా ఉంది. ఇందులోని లవ్ స్టోరీ, యాక్షన్ ఆడియన్స్‌కు కొత్త ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తాయి. నాగార్జున గారికి, తారక్ గారికి సినిమా చాలా నచ్చింది. ఖచ్చితంగా ఆడియన్స్ అందరికీ కనెక్ట్ అవుతుందనే నమ్మకం ఉంది: హీరో అనీష్
కింగ్ నాగార్జున సమర్పణలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇట్లు అర్జున’. అనీష్ హీరోగా పరిచయం అవుతుండగా, అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తున్నారు. మహేష్ ఉప్పల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దర్శకుడు వెంకీ కుడుముల ఈ సినిమాతో నిర్మాతగా కూడా పరిచయం అవుతున్నారు. ఆయన కొత్తగా ప్రారంభించిన వాట్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలని పెంచంది. ఎస్ తమన్ అందించిన పాటలన్నీ చార్ట్ బస్టర్ అయ్యాయి. ‘ఇట్లు అర్జున’ నవంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో అనీష్ విలేకరలు సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
ఇట్లు అర్జున్ కథ విన్నప్పుడు మిమ్మల్ని ఆకట్టుకున్న అంశాలు ఏమిటి? ఈ కథతోనే మీ తొలి సినిమా చేయడానికి కారణమేంటి?
-ఈ కథ విన్నప్పుడు నాకు బాగా నచ్చిన అంశం ఒక మూగవాడి ప్రేమకథ. తన భావాలను మాటల్లో వ్యక్తపరచలేని వ్యక్తి ప్రేమను ఎలా చూపిస్తాడనేది నాకు చాలా నచ్చింది. అలాగే కథ నడిచే విధానం, హీరో, హీరోయిన్ ప్రయాణం, యాక్షన్, ఎమోషన్ చాలా ఆర్గానిక్‌గా అనిపించాయి. ఇందులో చాలా ఆసక్తికరమైన సన్నివేశాలు ఉన్నాయి. అలాంటి సందర్భాలను ఒక మూగవాడు ఎలా ఎదుర్కొంటాడు, వాటిని ఎలా హ్యాండిల్ చేస్తాడు అనేది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది.
ఈ పాత్ర కోసం ఎలాంటి హోమ్ వర్క్ చేశారు ?
-ఈ సినిమా కోసం దాదాపు ఆరు నెలల పాటు వర్క్‌షాప్ చేశాం. బాడీ లాంగ్వేజ్, రియాక్షన్స్, ఎక్స్ప్రెషన్స్ .. విషయాలపై డైరెక్టర్ గారికి చాలా క్లారిటీ ఉంది. కొంత సైన్ లాంగ్వేజ్ కూడా ఉపయోగించాం. అయితే అది అందరికీ అర్థమయ్యేలా ఉంటుంది. ప్రతి సీన్‌ను ముందుగానే రిహార్సల్స్ చేసేవాళ్లం. దాంతో పాత్రలోకి వెళ్లడానికి చాలా ఉపయోగపడింది.
ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి పెద్ద స్టార్స్ మీకు సపోర్ట్ చేశారు. ఈ విషయంలో మీపై ఎంత బాధ్యత ఉందని భావిస్తున్నారు?
-అంత పెద్ద స్టార్స్ వచ్చి మా సినిమా గురించి మాట్లాడటం ఇప్పటికీ నాకు ఒక కలలాగే అనిపిస్తోంది. అంత మంచి సపోర్ట్ లభించడం చాలా ఆనందంగా ఉంది. మేము ఎంచుకున్న కాన్సెప్ట్, మా కంటెంట్ నచ్చడం వల్లే ఈ స్థాయిలో సపోర్ట్ వచ్చిందని భావిస్తున్నాను. ఒక కొత్త నటుడికి ఇంత పెద్ద సపోర్ట్ లభించడం నిజంగా సంతోషంగా ఉంది. అదే సమయంలో ఇది నా మీద మరింత బాధ్యతను పెంచింది. సినిమా మీద మాకు చాలా నమ్మకం ఉంది. ఆడియన్స్ హ్యాపీగా థియేటర్లో ఎంజాయ్ చేసే సినిమా. కచ్చితంగా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది.
సినిమాలో యాక్షన్ ఎలా ఉండబోతోంది?
-యాక్షన్‌ను ఇందులో చాలా కొత్తగా డీల్ చేశాం. ఇది ఒక అండర్డాగ్ క్యారెక్టర్‌కు తగ్గట్టుగానే యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి. మాస్ కమర్షియల్ సినిమాల్లో ఉండే యాక్షన్‌లా కాకుండా ఆ పాత్ర స్వభావానికి అనుగుణంగా ఉంటుంది. యాక్షన్ లో సహజంగా వచ్చే సౌండ్స్ ను మ్యాచ్ చేయడానికి డబ్బింగ్ కూడా చెప్పాను. మాటలు లేకుండా కేవలం బాడీ కదలికలు, 'హమ్ ..హ' లాంటి ఎక్స్ ప్రెస్ ప్రెషన్ కు డబ్బింగ్ చెప్పడం కూడా చాలా కొత్త ఎక్స్ పీరియన్స్. తనది చాలా జెన్యూన్ క్యారెక్టర్. ఆ ఎమోషన్ ఆడియన్స్ ఫీల్ అవుతారు.
మీకు నటనపై ఆసక్తి ఎప్పుడు ఏర్పడింది? ఎలాంటి శిక్షణ తీసుకున్నారు?
-నాకు చిన్నప్పటి నుంచీ నటనపై ఆసక్తి ఉండేది. వైజాగ్‌లో సత్యానంద్ గారి దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నాను. అలాగే ఒక ఏడాది పాటు యూఎస్‌లో కూడా నేర్చుకున్నాను. మరికొన్ని చోట్ల కూడా నటనకు సంబంధించిన విషయాలు నేర్చుకున్నాను.
తొలి సినిమా చేయడానికి ముందు దాదాపు ఏడాది పాటు కథలు విన్నారట కదా?
అవును. తొలి సినిమా చేయడానికి ముందు దాదాపు ఏడాది పాటు కథలు విన్నాను. ఆ సమయంలో మహేష్ గారు ఈ కథ తీసుకొచ్చారు. నాకు చాలా నచ్చింది. కథ ఓకే చేసిన తర్వాత కూడా మరో ఏడాది పాటు వర్క్‌షాప్స్, ప్రీ-ప్రొడక్షన్ వర్క్ చేశాం. నటుడిగా నా ప్రయాణం ప్రారంభించాలనే ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. లక్కీగా అందరికీ కనెక్ట్ అయ్యే మంచి ఎమోషన్ ఉన్న కథ దొరికింది.
మూగవాడి పాత్ర చేయడంలో మీకు ఎదురైన సవాళ్లు ఏమిటి?
-కొన్ని సన్నివేశాల్లో రియాక్ట్ అవ్వడం చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది. సాధారణంగా ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు మనం డైలాగ్‌తో సమాధానం చెబుతాం. కానీ ఈ పాత్రలో మాట్లాడటానికి అవకాశం ఉండదు. ఎదుటివారు మాట్లాడుతున్నప్పుడు మన ఎక్స్‌ప్రెషన్స్‌తోనే స్పందించాలి. అది కొంచెం కష్టంగా అనిపించింది. అలాగే లిప్ సింక్ లేకుండా డ్యాన్స్ చేయడం కూడా ఛాలెంజింగ్‌గా అనిపించింది.
మీ తొలి సినిమాకే రిలీజ్ డేట్ వాయిదా పడింది. ఆ సమయంలో ఒత్తిడికి గురయ్యారా?
చిన్నప్పటి నుంచి నటుడు కావాలనేది నా కల. తొలి సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన తర్వాత అనుకున్న సమయానికి సినిమా విడుదల కాకపోవడంతో కొంత నిరాశ అనిపించింది. అయితే మేము మంచి సినిమా చేశామని నమ్మకం ఉంది. ఎప్పుడు విడుదలైనా ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో మళ్లీ ఉత్సాహంగా పని చేశాం.
మీ తొలి సినిమాకే తమన్ లాంటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ పనిచేయడం ఎలా అనిపించింది?
-ఈ సినిమాకు మ్యూజిక్ మెయిన్ హీరో. ముఖ్యంగా ఇది మూగవాడి కథ కావడంతో సంగీతానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. తమన్ గారు ఈ జర్నీలో నాకు ఒక బ్రదర్‌లా అయిపోయారు. ఆయన సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేశారు. పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అందరినీ ఆకట్టుకుంటుంది.
రామ్ చరణ్ , అఖిల్ కెరీర్లో ఒక దశ తర్వాతే ఇలాంటి సవాళ్ళుతో కూడిన పాత్రలు చేశారని నాగార్జున గారు చెప్పారు కదా.. మీరు తొలి సినిమాతోనే మూగవాడి పాత్ర చేయడం ఎలా అనిపించింది?
-అంత పెద్ద స్టార్స్‌తో నన్ను పోల్చుకోను. ఏదైనా కథ దొరికిన దాని ప్రకారమే ఉంటుందని భావిస్తున్నాను. నా తొలి సినిమాకే ఇలాంటి కథ దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నాగార్జున గారు మా సినిమాను ప్రజెంట్ చేయడం మాకు మరింత బలాన్ని ఇచ్చింది. అదే సమయంలో బాధ్యతను కూడా పెంచింది. అందుకే మేము మరింత కష్టపడి పనిచేశాం. ప్రేక్షకులు కూడా సినిమాను గొప్పగా ఆదరిస్తారని నమ్ముతున్నాను.
ఇందులో ఇతర పాత్రలు ఎలా ఉండబోతున్నాయి?
బ్రహ్మాజీ గారు, వెన్నెల కిషోర్ గారు ఇలా మంచి నటులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. ప్రతి పాత్రకు కథలో ఒక ప్రాధాన్యత ఉంటుంది. సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు ప్రతి పాత్రను ఎంజాయ్ చేస్తారు.
మీకు వెంకీ కుడుముల గారితో పరిచయం ఎలా ఏర్పడింది?
వెంకీ గారికి మా నాన్నగారితో పరిచయం ఉంది. భీష్మా తర్వాత ఆయనను కొన్ని సజెషన్స్ అడిగేవాడిని. అలా ఒకసారి ఆయన ఈ కథ గురించి చెప్పారు. అప్పటి నుంచి ఈ సినిమా జర్నీ ప్రారంభమైంది.
అనస్వర రాజన్ గురించి చెప్పండి?
తనకు ఇప్పటికే మంచి అనుభవం ఉంది. తను అద్భుతమైన పెర్ఫార్మర్. చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఈ సినిమాలో తనతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా అనిపించింది.
నాగార్జున గారు సినిమా చూసిన తర్వాతే ప్రెజెంట్ చేయడానికి ముందుకొచ్చారా?
అవును. నాగార్జున గారు మా సినిమా చూశారు. ఆయనకు సినిమా చాలా నచ్చింది. ఆయన రావడం మాకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది.
మీకు ఇన్స్పిరేషన్ ఇచ్చే హీరో ఎవరు ?
నేను అందరు హీరోల సినిమాలు చూస్తూ పెరిగాను. రామ్ చరణ్ గారు, తారక్ గారు, అల్లు అర్జున్ గారు సహా చాలామంది హీరోలు నాకు ఇన్స్పిరేషన్. తారక్ గారికి ఈ సినిమా చాలా నచ్చింది. చాలా పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యారు. అది నాకు చాలా సంతోషాన్నిచ్చింది.
మీ నాన్నగారు కూడా సినిమాలు నిర్మించారు కదా? మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది?
-మా నాన్నగారికి భక్తి భావం ఎక్కువ. భక్తి కథలను ప్రేక్షకులకు చెప్పాలనే ఉద్దేశంతో నాగార్జున గారితో రెండు సినిమాలు నిర్మించారు. నాకు సినిమాలపై ఆసక్తి ఉందని చెప్పినప్పుడు నన్ను చాలా ప్రోత్సహించారు.
-నేను లండన్‌లో బిజినెస్ మేనేజ్మెంట్ చదువుకున్నాను. మా పేరెంట్స్ నుంచి నాకు చాలా సపోర్ట్ ఉంది. నచ్చిన పని చేసుకోమని ప్రోత్సహించే తల్లిదండ్రులు ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను.
సినిమాలో యాక్షన్ సీక్వెన్స్‌లు చేయడం ఎలా అనిపించింది?
-ఈ సినిమాలో యాక్షన్‌ను చాలా ఎంజాయ్ చేశాను. దినేష్ మాస్టర్ అద్భుతమైన యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు. మాస్ కమర్షియల్ సినిమాల్లో ఉండే యాక్షన్‌లా కాకుండా, ఒక సాధారణ వ్యక్తి తన పరిస్థితులకు తగ్గట్టుగా చేసే యాక్షన్‌లా ఉంటుంది. దాదాపు అన్ని యాక్షన్ సీక్వెన్స్‌లను నేనే చేశాను. డూప్ ఎక్కడా ఉపయోగించలేదు. యాక్షన్ చేయడం నాకు చాలా కొత్త అనుభవం. దాన్ని బాగా ఎంజాయ్ చేశాను. ఇందులో అర్జున క్యారెక్టర్ కి మాటలు రాకపోయినా చాలా స్మార్ట్.
తొలి సినిమాతో నటుడిగా మీరు నేర్చుకున్న విషయాలు ఏమిటి?
-యాక్టర్ కావాలని అనుకునప్పుడు మనం సినిమాను స్క్రీన్ మీద చూస్తాం. కానీ తెర వెనుక ఎంత కష్టం ఉంటుందనేది ప్రత్యక్షంగా చూస్తేనే తెలుస్తుంది. ఒక సినిమా చేయడానికి ఎంత ఎఫర్ట్ పెట్టాలి, ఎంతమంది కష్టపడతారు అనేది ఈ ప్రయాణంలో అర్థమైంది. సినిమా చేయడం అంత ఈజీ కాదు. ఈ జర్నీలో చాలా విషయాలు నేర్చుకున్నాను. సినిమా పట్ల నాకు మరింత గౌరవం పెరిగింది.
ఈ వారం చాలా సినిమాలు విడుదలవుతున్నప్పటికీ ‘ఇట్లు అర్జున్’పై ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి కనిపిస్తోంది. దీనిపై మీ స్పందన?
-ప్రేక్షకుల్లో సినిమాపై మంచి ఆసక్తి ఉండటం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. తొలి సినిమా నటుడికి ఇది మరింత గొప్ప ఆనందం. ఈ జర్నీలో ఎంతోమంది సపోర్ట్ చేశారు. అందరికీ కృతజ్ఞతలు.
భవిష్యత్తులో ఎలాంటి కథలు చేయాలని అనుకుంటున్నారు?
ఏ సినిమా చేసినా ప్రేక్షకులు దాన్ని ఆస్వాదించి, మంచి ఎమోషన్‌తో ఇంటికి వెళ్లాలనేది నా కోరిక. అలాంటి మంచి భావోద్వేగాలు ఉన్న కథలు చేయాలని ఉంది.
తదుపరి ఏ జోనర్లో సినిమా చేయబోతున్నారు?
ఇప్పుడే ఏదో ఒక జోనర్ అని నిర్ణయించుకోలేదు.రెండు మూడు కథలు విన్నాను. బలంగా నచ్చి, నాకు సరిపోయే కథతో ముందుకు వెళ్లాలని అనుకుంటున్నాను.