Venky Kudumula About Itlu Arjuna
‘ఇట్లు అర్జున’ నాగార్జున గారికి చాలా నచ్చింది. ఎన్టీఆర్ గారు అనీష్ పర్ఫార్మెన్స్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ఇది కచ్చితంగా ఆడియన్స్ అందరూ థియేటర్స్‌లో హ్యాపీగా ఎంజాయ్ చేసే ఎంటర్‌టైనర్. చాలా కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది: నిర్మాత వెంకీ కుడుముల
‘ఇట్లు అర్జున’ నాగార్జున గారికి చాలా నచ్చింది. ఎన్టీఆర్ గారు అనీష్ పర్ఫార్మెన్స్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ఇది కచ్చితంగా ఆడియన్స్ అందరూ థియేటర్స్‌లో హ్యాపీగా ఎంజాయ్ చేసే ఎంటర్‌టైనర్. చాలా కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది: నిర్మాత వెంకీ కుడుముల
కింగ్ నాగార్జున సమర్పణలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇట్లు అర్జున’. అనీష్ హీరోగా పరిచయం అవుతుండగా, అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తున్నారు. మహేష్ ఉప్పల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దర్శకుడు వెంకీ కుడుముల ఈ సినిమాతో నిర్మాతగా కూడా పరిచయం అవుతున్నారు. ఆయన కొత్తగా ప్రారంభించిన వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలని పెంచంది. ‘ఇట్లు అర్జున’ నవంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత వెంకీ కుడుముల విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
నిర్మాతగా మీ మొదటి సినిమాగా ‘ఇట్లు అర్జున’ కథను ఎంచుకోవడానికి కారణమేమిటి? -ఒక మంచి కథతో నిర్మాణ రంగంలోకి రావాలని ఎప్పటి నుంచో ఉండేది. డైరెక్టర్ మహేష్ చెప్పిన ఈ కథ నాకు చాలా నచ్చింది. చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇది. నా తొలి నిర్మాణానికి బాగుంటుందనిపించింది.
అనీష్ మీకు ఎలా పరిచయమయ్యారు? -అనీష్ నాకు ఎప్పటి నుంచో పరిచయం. తనకి నా సినిమాలంటే ఇష్టం. నా ఆఫీస్‌కి తరచూ వస్తుండేవారు. మేము సినిమాల గురించి మాట్లాడుకుంటూ ఉండేవాళ్లం.
-తను సినిమా కోసం చాలా కష్టపడతాడు. ఒక రోజులో దాదాపు నటన కోసం, డ్యాన్స్ కోసం, యాక్షన్ కోసం చాలా సమయం కేటాయిస్తాడు. ఈ కథకు ఫ్రెష్ హీరో అయితే బాగుంటుందనిపించింది. ఇది మూగవాడి క్యారెక్టర్. సో, ఇదివరకు తెలిసిన క్యారెక్టర్ అయితే ఆడియన్స్ కన్విన్స్ అవుతారో లేదో తెలియదు. అందుకే ఫ్రెష్‌గా ఉంటుందని అనీష్‌ను తీసుకోవడం జరిగింది. అలాగే అనస్వరాకి కథ చెప్పాం. తనకి కూడా చాలా నచ్చింది.
-అనీష్ యాక్షన్ చాలా అద్భుతంగా చేశాడు. ఎక్కడా మేము డూప్‌ను ఉపయోగించలేదు. యాక్షన్ అంతా తనే స్వయంగా చేశాడు. అనీష్ కోసం నా డైరెక్షన్‌లో ఒక సినిమా చేసే ఆలోచన కూడా ఉంది.
-ఈ సినిమాకు నేను నిర్మాతగా కొత్త, డైరెక్టర్ కొత్త, హీరో కొత్త. ఇలా అందరం కొత్తవాళ్లం కాబట్టి ఒక టీమ్ వర్క్‌లాగా ఈ సినిమా చేశాం.
సినిమా నిర్మించడం ఎలా అనిపించింది? -నాకు ఎప్పుడూ డైరెక్షన్ అనేది చాలా హ్యాపీ, కంఫర్టబుల్ స్పేస్. కాకపోతే, ప్రతి డైరెక్టర్‌ను ఒక సినిమా ప్రొడ్యూస్ చేయమని చెప్తాను. ఎందుకంటే ఎక్కడ వేస్టేజ్ ఉంటుంది, ఎక్కడ వర్క్ ఉంటుంది అన్నీ క్లియర్ గా తెలుస్తాయి. ఒక సినిమాకు ప్రతి యూనిట్ ఎంత పని చేస్తుందనేది నిర్మాతకే ఎక్కువగా తెలుస్తుంది.
నాగార్జున గారు ఈ సినిమాని ప్రజెంట్ చేయడం ఎలా అనిపిస్తుంది? -సినిమా కంటెంట్‌ను ఎంచుకోవడం, దాన్ని ప్రొడ్యూస్ చేయడం మీద నాకు ఒక ఆలోచన ఉంది. కాకపోతే, దాన్ని ఎలా రిలీజ్ చేయాలి, ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి అనేది ఎప్పుడూ ఒక ఒత్తిడిగా ఉండేది. నాగార్జున గారు రావడం వల్ల అది మాకు చాలా హెల్ప్ అయింది. ఆయన వచ్చిన తర్వాత మా వర్క్ అంతా చాలా ఈజీ అయింది.
-నాగార్జున గారికి ఈ సినిమా గ్లింప్స్ చూపించాను. నచ్చితేనే వాయిస్ ఓవర్ చెప్పమని అడిగాం. ఆయనకు గ్లింప్స్ చాలా నచ్చాయి. ఆయన వాయిస్ ఓవర్ చెప్పారు. ఆ గ్లింప్స్‌లోని విజువల్స్ నచ్చి, మా సినిమాకు పనిచేస్తున్న డీఓపీనే ఆయన ‘కింగ్ 100’ సినిమాకు డీఓపీగా పెట్టుకున్నారు.
-నాగార్జున గారు సినిమా చూశారు. అందరినీ చాలా మెచ్చుకున్నారు. అది మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. నేను తొలిసారిగా నిర్మిస్తున్న సినిమాని నాగార్జున గారి లాంటి స్టార్ చూసి అందరినీ మెచ్చుకోవడం నిర్మాతగా నాకు గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. ఆయన ప్రశంసల తర్వాత చాలా ప్రశాంతంగా ఉంది.
డైరెక్టర్ మహేష్ గారితో మీరు ఎలా కనెక్ట్ అయ్యారు? డైరెక్టర్ మహేష్ ఒక వెబ్ సిరీస్ చేశారు. అది బాగా ఆడింది కూడా. కాకపోతే, మరో సినిమా రావడం అనేది ప్రతి డైరెక్టర్‌కు ఛాలెంజింగ్. అలా తనకు గ్యాప్ వచ్చిన సమయంలో తను రాపిడో డ్రైవర్‌గా కూడా పనిచేశారు. అది నేను విన్నాను. చాలా జెన్యూన్‌గా అనిపించింది. తను చాలా టాలెంటెడ్. తన కోసం నిలబడాలనిపించింది. ఈ కథ చెప్పగానే నాకు చాలా నచ్చి ప్రొడ్యూస్ చేశాను.
-నాకు ఒకరు అవకాశం ఇవ్వడం వల్లే నేను డైరెక్టర్ అయ్యాను. నేను కూడా కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో నిర్మాణం మొదలుపెట్టాను. నిజంగా కొత్తవాళ్లు వచ్చి నాకు కథ చెప్తే, అది 100 శాతం కనెక్ట్ అనిపిస్తే కచ్చితంగా నిర్మాణం కొనసాగిస్తాను.
జూనియర్ ఎన్టీఆర్ గారు ట్రైలర్ లాంచ్ చేయడం ఎలా అనిపించింది? -చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎన్టీఆర్ గారు సినిమా కంటెంట్ గురించి, అనీష్ పర్ఫార్మెన్స్ గురించి చాలా గొప్పగా చెప్పారు. అది మాకు చాలా బూస్ట్ ఇచ్చింది. అంత పెద్ద స్టార్ వచ్చి మా సినిమా ట్రైలర్ లాంచ్ చేయడం అనేది మాకు చాలా హెల్ప్ అయింది. అలాగే అనీష్‌ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఒక మూగవాడి పాత్ర చేయడం చాలా ఛాలెంజింగ్ అని ఆయన చెప్పారు.
తమన్ గారి మ్యూజిక్ గురించి? -తమన్ గారు ‘తొలిప్రేమ’ సినిమాకు చేసిన మ్యూజిక్ నాకు చాలా ఇష్టం. ఈ సినిమాకు అలాంటి ఒక బ్రాండ్ కావాలనిపించింది. ఆయనకు కథ చాలా నచ్చింది. ఆయన చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. నేపధ్య సంగీతం కూడా చాలా అద్భుతంగా చేశారు.
నెక్స్ట్ మీ నుంచి వచ్చే సినిమా ఎలా ఉండబోతోంది? -ఒక కామెడీ ఎంటర్‌టైనర్ రాశాను. స్క్రిప్ట్ చాలా బాగా వచ్చింది.
‘ఇట్లు అర్జున’ ఆడియన్స్‌కు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతోంది?
-మంచి లవ్ స్టోరీ ఇది. లీడ్ పెయిర్ కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. ఇంటర్వెల్, ప్రీ-క్లైమాక్స్ ఎపిసోడ్స్‌లో యాక్షన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఆడియన్స్ హ్యాపీగా థియేటర్‌లో చూసి ఎంజాయ్ చేసే సినిమా. కచ్చితంగా చాలా కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.