pizza

Allari Naresh, AR Mohan, Hasya Movies & Zee Studios’ Itlu Maredumilli Prajaneekam Theatrical Trailer Released
అల్లరి నరేష్, ఏఆర్ మోహన్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' థియేట్రికల్ ట్రైలర్ ను మారేడుమిల్లిలో విడుదల చేసిన చిత్ర యూనిట్

You are at idlebrain.com > news today >
Follow Us

12 November 2022
Hyderabad

Itlu Maredumulli Prajaneekam is another different film from multi-faceted star Allari Naresh who will be seen as a government officer visiting the tribal area as an election officer. AR Mohan helmed the project, while Razesh Danda of Hasya Movies is producing it, in association with Zee Studios. The makers began the promotions by releasing the film’s theatrical trailer. The entire team visited Maredumilli, alongside Allari Naresh and to release the trailer there.

A government official, along with his team reaches Maredumilli to conduct elections there. The entire state is waiting for the election. Under these circumstances, the government officer gets to know the real problems of the people over there. They don’t have minimum facilities and they even lose lives. Nonetheless, there’s nobody to care for them. This officer comes forward to help them. When this officer tries to bring awareness among the people, he faces heat from political leaders and police officials.

AR Mohan picked a strong subject for his debut directorial venture and he narrated it in a stimulating way. Needless to say, it’s Allari Naresh’s show all the way as he dominates the screen effortlessly. It’s a tailor-made character for Allari Naresh and we can’t imagine any other actor in it. His screen presence is just wow. Anandhi played the leading lady, while Vennela Kishore and Praveen are there to provide comic relief, while Sampath Raj appeared in a serious role. Raam Reddy’s camerawork is flawless and has captured the raw energy and tribal areas very well. Sricharan Pakala is at a different level in every scene. Dialogues by Abburi Ravi are inspiring.

The trailer augments the curiosity to watch the movie which is set for release on 25th of this month. Balaji Gutta is the co-producer of the movie, wherein Brahma Kadali is the art director and Chota K Prasad is the editor.

Cast: Allari Naresh, Anandhi, Vennela Kishore, Praveen, Sampath Raj

Technical Crew:
Written & Direction: AR Mohan
Producer: Razesh Danda
Produced By: Hasya Movies and Zee Studios
Co-Producer: Balaji Gutta
Music Director: Sricharan Pakala
Dialogues: Abburi Ravi
DOP: Raam Reddy
Art Director: Brahma Kadali
Editor : Chota K Prasad
Stunts: Pruthvi
DI - Annapurna Studios

అల్లరి నరేష్, ఏఆర్ మోహన్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' థియేట్రికల్ ట్రైలర్ ను మారేడుమిల్లిలో విడుదల చేసిన చిత్ర యూనిట్

వెర్సటైల్ హీరో అల్లరి నరేష్ 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' ఈ నెల 25న థియేటర్లలో విడుదలౌతోంది. ఏఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్‌ తో కలిసి హాస్య మూవీస్‌ పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని గిరిజన ప్రాంతమైన మారేడుమిల్లిలో విడుదల చేసింది చిత్ర యూనిట్. రెండు నిమిషాల నిడివి గల ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. యూనిక్ కంటెంట్ తో పాటు మారేడుమిల్లి యాక్షన్ ఎపిసోడ్స్ విజువల్ ట్రీట్ గా వున్నాయి.

ఈ చిత్రంలో అల్లరి నరేష్‌ గిరిజన ప్రాంతమైన మారేడుముల్లిలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొకొని ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ అధికారిగా ఇంటెన్స్ పాత్రలో కనిపిస్తున్నారు. ''ఇంకో నాలుగు రోజుల్లో ఎలక్షన్ మీ ఊర్లో జరగబోతున్నాయి'' అని ఎన్నికల అధికారిగా నరేష్ చెప్పిన డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమైయింది. తర్వాత మారేడుమిల్లి ప్రజానీకం, అక్కడి పాత్రలు ఒకొక్కటిగా పరిచయడం ఆసక్తికరంగా వుంది.

''సాయం చేయమని మీరు ఎన్ని సార్లు అడిగినా పట్టించుకొని ప్రతి ఆఫీసర్ సమాధానం చెప్పాలి''

''కొండ మీద జనాల ఓట్లు తీసుకోవాలని తెలిసిన ప్రభుత్వ అధికారులకి ఆ జనం బతుకు కోసం ఎంత కష్టపడుతున్నారో ఎందుకు తెలియడం లేదు''

''అన్యాయంగా బెదిరించే వాడికన్నా న్యాయం కోసం ఎదిరించే వాడే బలమైనవాడు''.. ట్రైలర్ తొలి సగంలో వినిపించిన ఈ డైలాగులు ఆలోచన రేకెత్తించేవిగా వున్నాయి.

''పోలీసులు పంపిన, మిలటరీని పంపిన తలదించేదే లేదు'' అని హీరోయిన్ చెప్పిన డైలాగ్ తర్వాత వచ్చిన యాక్షన్ సీక్వెన్స్ లు మైండ్ బ్లోయింగా వున్నాయి. నదీ ప్రభావంలో జరిగే యాక్షన్ ఎపిసోడ్, అడవిలో ఎద్దులతో జరిగే యాక్షన్ సీక్వెన్స్ అమేజింగా వున్నాయి.

ఎన్నికల అధికారి పాత్రలో అల్లరి నరేష్ అవుట్ స్టాడింగ్ పెర్ఫార్మెన్స్ కనబరిచారు. నరేష్ స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా వుంది. ఇంటెన్స్ రోల్ లో సరికొత్తగా ఆకట్టుకున్నారు. ఆనంది, వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్, రఘు బాబు ట్రైలర్ లో కీలకంగా కనిపించారు.

దర్శకుడు ఎఆర్ మోహన్ యూనిక్ కంటెంట్ తో స్ట్రాంగ్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేశారు. టేకింగ్ అద్భుతంగా వుంది. శ్రీచరణ్ పాకాల నేపధ్య సంగీతం బ్రిలియంట్ గా వుంది. రాంరెడ్డి సినిమాటోగ్రఫీ విజువల్ ట్రీట్ లా వుంది. అడవి అందాలని, అక్కడి జీవితాన్ని అద్భుతంగా చిత్రీకరించారు. అబ్బూరి రవి మాటలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. నిర్మాణ విలువలు అత్యున్నతంగా నిలిచాయి. ట్రైలర్ సినిమాపై అంచనాలని మరింతగా పెంచింది.

తారాగణం: అల్లరి నరేష్, ఆనంది, వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్

సాంకేతిక విభాగం:

రచన, దర్శకత్వం: ఎఆర్ మోహన్

నిర్మాత: రాజేష్ దండా

నిర్మాణం: హాస్య మూవీస్, జీ స్టూడియోస్

సహ నిర్మాత: బాలాజీ గుత్తా

సంగీతం: శ్రీచరణ్ పాకాల

డైలాగ్స్: అబ్బూరి రవి

డీవోపీ: రాంరెడ్డి

ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి

ఎడిటర్: ఛోటా కె ప్రసాద్

స్టంట్స్: పృథ్వీ

కొరియోగ్రఫీ: శేఖర్ మాస్టర్, బిన్నీ

డిఐ - అన్నపూర్ణ స్టూడియోస్
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2022 Idlebrain.com. All rights reserved