23 September 2024
Hyderabad
Siddhu Jonnalagadda, who scored a massive blockbuster Tillu Square, the sequel for DJ Tillu recently. The actor is currently busy with "Jack" directed by blockbuster director Bomarillu Bhaskar. The film comes with tagline "Konchem Crack." Bommarillu Bhaskar and Siddhu Jonnalagadda are exploring a new genre. Thier collaboration is going to give enthralling experience to audience. The film is bankrolled by the popular producer BVSN Prasad under Sri Venkateswara Cine Chitra banner.
The film aims to deliver a fresh experience to audiences, showcasing a new genre. Over 80 percent of the shooting has already been completed, with important scenes being filmed featuring Siddhu Jonnalagadda, Prakash Raj and Vaishnavi Chaitanya. The film is currently being shot in Nepal at a rapid pace. Director Bommarillu Bhaskar recently celebrated his birthday on set, with the cast and crew, including Sidhu Jonnalagadda, heroine Vaishnavi Chaitanya, and producer BVSN Prasad, joining in the festivities.
The makers have high expectations for the film, with Sidhu Jonnalagadda in the title role. The film is designed to be a comedic ride, and Vaishnavi Chaitanya, known for her role in "Baby," plays the female lead. Music for the film has been composed by Achu Rajamani, who has delivered fantastic tunes that are sure to create sensation. With the combination of a fresh genre, top-notch comedy, and a captivating soundtrack, the film is raising buzz.
Siddhu Jonnalagadda stars in the titular role of Jack, who is described as a "Crack gadu," and he promises wildly laughter game. More details about this exciting project will be announced soon.
నేపాల్‌లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తోన్న చిత్రం ‘జాక్- కొంచెం క్రాక్’... శరవేగంగా జరుగుతోన్న షూటింగ్.. సెట్స్‌లో డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ బర్త్ డే సెలబ్రేషన్స్
సిద్ధు జొన్నలగడ్డ.. రీసెంట్‌గా డీజే టిల్లు చిత్రానికి సీక్వెల్ టిల్లు స్క్వేర్తో బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈయన కథాయకుడిగా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతోన్న తాజా చిత్రం ‘జాక్’. ‘కొంచెం క్రాక్’ ట్యాగ్ లైన్. విలక్షణమైన సినిమాలు చేయటానికి ఇష్టపడే సిద్ధు జొన్నలగడ్డ, బొమ్మరిల్లు భాస్కర్ కాంబోలో మరో కొత్త జోనర్ మూవీగా జాక్ తెరకెక్కుతోంది. ఆడియెన్స్‌కు ఓ సరికొత్త ఎక్స్‌పీరియెన్స్‌ను అందించే చిత్రంగా ఇది రూపొందుతోంది. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై సీనియర్ ప్రొడ్యూసర్ బివిఎస్ఎన్.ప్రసాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ నేపాల్‌లో శరవేగంగా జరుగుతోంది. ప్రకాష్ రాజ్, వైష్ణవి చైతన్య తదితరులపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. సోమవారం చిత్ర దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా సెట్స్‌లో ఆయన బర్త్‌డే సెలబ్రేషన్స్‌జరిగాయి. హీరో సిద్ధు జొన్నలగడ్డ, హీరోయిన్ వైష్ణవి చైతన్య, నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, ప్రకాష్ రాజ్ సహా చిత్ర యూనిట్ పాల్గొనగా బొమ్మరిల్లు భాస్కర్ కేట్ కట్ చేశారు.
‘జాక్- కొంచెం క్రాక్’ సినిమా 80 శాతం పైగానే చిత్రీకరణ పూర్తయ్యింది. అచ్చు రాజమణి ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. సరికొత్త జోనర్, ఫ్రెష్ కామెడీ, వావ్ అనిపించే సౌండ్ ట్రాక్‌ను అచ్చు రాజమణి సిద్ధం చేస్తున్నారు. సినిమాపై మంచి అంచనాలున్నాయి. సిద్ధు జొన్నలగడ్డ టైటిల్ రోల్‌ను పోషిస్తున్నారు. తనే క్రాక్ గాడు ఎందుకుంటాడనేదే తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందేనంటున్నారు మేకర్స్. లాఫింగ్ రైడ్‌లా సినిమా ఉంటుంది. బేబి సినిమా ఫేమ్ వైష్ణవి చైతన్య ఇందులో హీరోయిన్‌గా నటిస్తుంది. త్వరలోనే మరిన్ని వివరాలను తెలియజేస్తామని మేకర్స్ తెలిపారు.
|