‘Jack’ is a Highly Entertaining Film with Racy Twists – Star Boy Siddhu Jonnalagadda at the Trailer Launch Event
‘జాక్’ చిత్రం చాలా రేసీగా ట్విస్టులతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ
Star Boy Siddhu Jonnalagadda is currently working on a film titled Jack – Konchem Crack, directed by Bommarillu Bhaskar. The film is being produced by the renowned production house Sri Venkateswara Cine Chitra, led by the well-known producer BVSN Prasad. Vaishnavi Chaitanya plays the heroine opposite Siddhu in this film, which is scheduled for a worldwide release on April 10. The songs and teaser that have already been released have generated a positive buzz about the film. On Thursday, the trailer of the movie was unveiled, followed by a press meet.
Siddhu Jonnalagadda said: “I got very excited when Bommarillu garu narrated the story of Jack. It is a huge story with a lot more beneath the surface. Bhaskar’s change of genre makes Jack feel completely fresh. While Tillu and Tillu Square focused on characterization, Jack goes beyond that. Tillu was character-driven, whereas Jack has an amazing storyline along with well-developed characters. The Charminar episode in the film is of international standard. The idea behind Jack is fantastic, and the sequences that unfold from this idea are even better. Bhaskar worked on this film for almost two years. It’s not just a routine action film; it’s fast-paced and thrilling. Jack is a truly unique character, and there are several twists. The screenplay is exceptional. The film is releasing on April 10, and I am confident it will entertain everyone."
Bommarillu Bhaskar said:“I have known BVSN Prasad garu for many years, and Baapi is a good friend of mine. Once, I shared the idea for Jack with him, and immediately, a meeting was arranged with Siddhu. In just one day, the project was set in motion. Working with an actor like Siddhu is very easy. You just need to trust him, give him the scene, and close your eyes - the result is always amazing on the monitor. Sidhu was deeply involved from the writing stage. I wrote only Jack’s theme and gave Siddhu the freedom to shape his character and dialogue. He improvised a lot, and Jack’s role is phenomenal. Jack exists in everyone. Who is that Jack? You’ll have to watch the film to find out. This film will be in my style, and I won’t disappoint the family audience who trust Bommarillu Bhaskar. Though Sidhu’s flavor is visible on the surface, beneath that, there are all the emotions and messages in my signature style. Vaishnavi Chaitanya has acted with great depth, especially with her eyes. She has a promising future ahead as a very talented actress. Our film is releasing on April 10, and I hope everyone enjoys it.”
Vaishnavi Chaitanya said: “I consider myself lucky to have the opportunity to work under the direction of Bommarillu Bhaskar. I used to vibe to his songs as a child, and now, acting in his film and appearing in his songs is a dream come true. Siddhu garu was extremely supportive on set. He is very dedicated and passionate about his work. I was initially intimidated by the way he improvises scenes, but it was a pleasure to act alongside such a great actor. I’ve learned a lot from him. I believe everyone will enjoy the trailer, and I hope they love the film as much as I do. Jack is releasing on April 10, and I hope the audience enjoys it.”
Producer BVSN Prasad said: “We have always had a close relationship with Bommarillu Bhaskar. It’s a pleasure to produce Jack with Siddhu as the hero under his direction. The trailer has already impressed everyone, and I am confident the film will captivate the audience. Our movie is releasing on April 10, and I encourage everyone to watch it.”
Technical Team:
Written and Directed by: Bommarillu Bhaskar
Producer: BVSN Prasad, Baapineedu
Music: Suresh Bobbili, Radhan, Achu Rajamani
BGM: Sam CS
Cinematographer: Vijay K Chakravarthi
Editor: Navin Nooli
‘జాక్’ చిత్రం చాలా రేసీగా ట్విస్టులతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ‘జాక్ - కొంచెం క్రాక్’ అనే చిత్రాన్ని చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నేతృత్వంలోని అగ్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమాలో సిద్దు సరసన వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించారు. ఈ మూవీ ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలు, టీజర్ సినిమా మీద పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. ఇక గురువారం నాడు ఈ చిత్రం నుంచి ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ట్రైలర్‌ను విడుదల చేసిన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో..
సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ .. ‘బొమ్మరిల్లు గారు జాక్ కథను చెప్పినప్పుడే చాలా ఎగ్జైట్ అయ్యాను. ఇది చాలా పెద్ద కథ. పైకి కనిపించేది కాదు.. లోపల చాలా ఉంటుంది. భాస్కర్ గారు జానర్ మార్చడం వల్ల జాక్ చాలా కొత్తగా అనిపిస్తుంది. టిల్లు, టిల్లు స్క్వేర్ కారెక్టరైజేషన్ ఏ మీటర్‌లో ఉంటుందో.. జాక్ అంతకు మించి ఉంటుంది. టిల్లు అనేది కారెక్టరే బేస్డ్ సినిమా అయితే.. జాక్‌లో కారెక్టర్‌తో పాటు అదిరిపోయే కథ కూడా ఉంటుంది. ఇంటర్వెల్‌లో వచ్చే ఛార్మినార్ ఎపిసోడ్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటుంది. జాక్ ఐడియానే అద్భుతంగా ఉంటుంది. ఆ ఐడియా నుంచి వచ్చిన సీక్వెన్స్ ఇంకా బాగుంటాయి. భాస్కర్ గారు ఈ సినిమా కోసం దగ్గరదగ్గరగా రెండేళ్లు పని చేశారు. రొటీన్ యాక్షన్ సినిమాలా ఉండదు. చాలా రేసీగా ఉంటుంది. జాక్ అనేది నిజంగానే క్రాక్ లాంటి పాత్ర. చాలా ట్విస్టులు ఉంటాయి. స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంటుంది. ఈ చిత్రం ఏప్రిల్ 10న రాబోతోంది. అందరినీ అలరించేలా మా సినిమా ఉంటుంది’ అని అన్నారు.
బొమ్మరిల్లు భాస్కర్ మాట్లాడుతూ .. ‘బీవీఎస్ఎన్ ప్రసాద్ గారితో నాకు ఎన్నో ఏళ్ల నుంచి పరిచయం ఉంది. బాపీ నాకు మంచి స్నేహితుడు. ఒకసారి జాక్ పాయింట్ ఆయనకు చెప్పాను. వెంటనే సిద్దుతో మీటింగ్ జరగడం, ఒక్కరోజులోనే ప్రాజెక్ట్ సెట్ అవ్వడం జరిగింది. సిద్దు లాంటి నటుడితో పని చేయడం ఏ దర్శకుడికైనా చాలా సులభం. సిద్దుని నమ్మి సీన్ చెప్పి కళ్లు మూసుకుంటే చాలు. ఆ సీన్ అద్భుతంగా వస్తుంది. రైటింగ్ స్టేజ్ నుంచే సిద్దు చాలా ఇన్వాల్వ్ అయ్యాడు. జాక్ థీమ్ మాత్రమే నేను రాశాను. జాక్ కారెక్టరైజేషన్, డైలాగ్ మాడ్యులేషన్‌లో సిద్దుకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చాను. సిద్దు చాలా ఇంప్రవైజ్ చేశాడు. జాక్ పాత్ర అద్భుతంగా ఉంటుంది. ప్రతీ ఒక్కరిలోనూ జాక్ ఉంటాడు. ఆ జాక్ ఎవరు? అనేది ఎవరిది వాళ్లే తెలుసుకోవాలి. ఈ సినిమా నా స్టైల్లోనే ఉంటుంది. బొమ్మరిల్లు భాస్కర్‌ను నమ్మి వచ్చే ఫ్యామిలీ ఆడియెన్స్‌ను నేను నిరాశ పర్చను. పైన సిద్దు ఫ్లేవర్ కనిపించినా లోలోపల నా స్టైల్లో ఉండే ఎమోషన్, మెసెజ్ అన్నీ ఉంటాయి. వైష్ణవి చైతన్య కళ్లతోనే నటించేశారు. ఆమె చాలా గొప్ప స్థాయికి వెళ్తారు. చాలా మంచి నటి. ఏప్రిల్ 10న మా చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.
వైష్ణవి చైతన్య మాట్లాడుతూ .. ‘బొమ్మరిల్లు భాస్కర్ గారి దర్శకత్వంలో పని చేసే అవకాశం రావడం నా అదృష్టం. చిన్నప్పుడు ఆయన పాటలకు వైబ్ అవుతుండేదాన్ని. అలాంటి స్థాయి నుంచి ఈ రోజు ఆయన సినిమాలో నటించడం, ఆయన పాటల్లో కనిపించడమే నా సక్సెస్. సిద్దు గారు సెట్స్‌లో ఎంతో సపోర్ట్ చేసేవారు. ఆయన సినిమా పట్ల ఎంతో డెడికేటెడ్‌గా, ప్యాషనేట్‌తో ఉంటారు. సెట్స్‌లో ఆయన సీన్లను ఇంప్రోవైజ్ చేసే తీరు చూసి నేను భయపడేదాన్ని. సిద్దు లాంటి గొప్ప యాక్టర్‌తో నటించడం ఆనందంగా ఉంది. ఆయన్నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ట్రైలర్ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. జాక్ సినిమా ఏప్రిల్ 10న రాబోతోంది. ఈ మూవీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ .. ‘బొమ్మరిల్లు భాస్కర్‌తో మాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది. ఆయన దర్శకత్వంలో సిద్దు హీరోగా జాక్ చిత్రాన్ని నిర్మించడం ఆనందంగా ఉంది. ట్రైలర్ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. సినిమా అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. మా మూవీ ఏప్రిల్ 10న రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.
సాంకేతిక బృందం
రచన, దర్శకత్వం : బొమ్మరిల్లు భాస్కర్
నిర్మాత: BVSN బాపినీడు
సంగీతం: సురేష్ బొబ్బిలి, రధన్, అచ్చు రాజమణి,
బీజీఎం : సామ్ సిఎస్
కెమెరామెన్: విజయ్ కె చక్రవర్తి
ఎడిటర్: నవీన్ నూలి
The #JACK trailer is both entertaining and engaging. Much like in DJ Tillu, Siddu Jonnalagadda infuses the character of JACK with his own personality through his dialogue delivery and quirky body language.