7 February 2024
Hyderabad
Star Boy Siddhu Jonnalagadda, attained phenomenal success with the film DJ Tillu. He is being choosy in selecting his films. The actor has joined hands with blockbuster director Bomarillu Baskar. The film is bankrolled by the popular producer BVSN Prasad under Sri Venkateswara Cine Chitra banner. The project tentatively titled SVCC 37, shoot progressing at quick pace.
Today marks the birthday of actor Siddhu Jonnalagadda, and to celebrate, the filmmakers have released an eye-catching motion poster for his upcoming film, titled "Jack," accompanied by the intriguing tagline "Konchem Crack." The captivating motion poster prominently features Siddhu Jonnalagadda, instantly drawing attention.
In it, he is depicted leaning against a wall, wielding a toy gun in his left hand and a real gun in his right. While the poster doesn't fully unveil Siddhu's appearance, it hints at a look that promises to be stylish. Vaishnavi Chaitanya of Baby fame is playing the female lead. The film will be made as hilarious entertainer.
The combination of Bommarillu Bhaskar & Sidhu Jonnalagadda has become a positive talking point already among the movie lovers & trade circles.
More details about this exciting project will be announced soon.
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, బొమ్మరిల్లు భాస్కర్ మరియు బీవీఎస్ఎన్ ప్రసాద్ ‘జాక్ - కొంచెం క్రాక్’ మోషన్ పోస్టర్ విడుదల
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ‘డీజే టిల్లు’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. సిద్ధు జొన్నలగడ్డ తన స్క్రిప్ట్ ఎంపికలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం సిద్దు.. బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ బొమ్మరిల్లు బాస్కర్‌తో ఓ సినిమా చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత బివిఎస్‌ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సిద్దు పుట్టిన రోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు.
ఈరోజు (ఫిబ్రవరి 7) నటుడు సిద్ధు జొన్నలగడ్డ పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా అప్డేట్ వచ్చింది. "జాక్" అనే టైటిల్‌తో.. "కొంచెం క్రాక్" అనే ట్యాగ్ లైన్‌తో రాబోతోంది. టైటిల్ రివీల్‌తో పాటుగా మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో సిద్ధు జొన్నలగడ్డ స్టైల్, చేతిలో గన్నుతో హైలెట్ అవుతున్నారు.
ఇందులో సిద్దుని పూర్తిగా చూపించకపోయినా కూడా.. మేకోవర్ ఎలా ఉంటుందో హింట్ ఇచ్చారు మేకర్లు. డబుల్ గన్, డబుల్ ఫన్ అనేలా ఈ చిత్రం ఉండబోతోంది. ఇందులో బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య కథానాయికగా నటిస్తోంది. ఆద్యంతం వినోదభరితంగా ఈ సినిమా రూపొందనుంది.
'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన భాస్కర్, ప్రస్తుత యూత్ సెన్సేషన్ సిద్ధు జొన్నలగడ్డ - ఇంట్రెస్టింగ్ కాంబో కావడంతో ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సిద్ధు జొన్నలగడ్డ సినిమాలంటే యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌లో ఉంటుంది.. పైగా బొమ్మరిల్లు భాస్కర్ అంటే.. ఈ సారి యూత్ ప్లస్, రొమాంటిక్, ఫ్యామిలీ ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండనుంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.