pizza

Victory Venkatesh Launched The Thumping Number Hukum From Superstar Rajinikanth Jailer
సూపర్ స్టార్ రజనీకాంత్, నెల్సన్, సన్ పిక్చర్స్, ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ 'జైలర్' హుకుం సాంగ్ ని లాంచ్ చేసిన విక్టరీ వెంకటేష్

You are at idlebrain.com > news today >
Follow Us

30 July 2023
Hyderabad

Superstar Rajinikanth and director Nelson are set to offer a full meal treat with their first collaborative project Jailer. It’s an action comedy in where Rajinikanth will be seen in the titular role. It is produced by Kalanithi Maran of Sun Pictures. Anirudh Ravichander scored the music and the makers released the second single Hukum. Victory Venkatesh did the honours of launching the Telugu version of the song.

Anirudh who never disappoints has come up with a thumping tune. The beats are highly energetic, and so are the vocals. The lyrics are by Bhaskarabhatla. Rajinikanth is introduced in a complete mass avatar. He is seen firing guns. Rajinikanth's powerful screen presence, swag, and dialogue delivery will surely leave fans in a frenzy.

Kaavalayya song was already a blockbuster and this one Hukum is an instant hit. It will double impact when we watch the song with complete visuals on big screens.

Jailer has a stellar cast that includes Jackie Shroff, Shiva Rajkumar, Sunil, Ramya Krishnan, Vinayakan, Mirnaa Menon, and Mohanlal in a cameo appearance.

Vijay Kartik Kannan is the director of photography of the movie edited by R Nirmal. Jailer is slated for release on August 10th. Asian Multiplexes Pvt Ltd is releasing the film’s Telugu version.

సూపర్ స్టార్ రజనీకాంత్, నెల్సన్, సన్ పిక్చర్స్, ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ 'జైలర్' హుకుం సాంగ్ ని లాంచ్ చేసిన విక్టరీ వెంకటేష్

సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ తొలిసారి కలసి చేస్తున్న ప్రాజెక్ట్ 'జైలర్‌'తో ఫుల్ మీల్ ట్రీట్‌ను అందించబోతున్నారు.యాక్షన్ కామెడీ ఎంటర్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో రజనీకాంత్ టైటిల్ రోల్‌లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న జైలర్ సెకండ్ సింగిల్ 'హుకుం' పాటని మేకర్స్ ను విడుదల చేసారు. తెలుగు వెర్షన్ పాటను విక్టరీ వెంకటేష్ లాంచ్ చేశారు.

ప్రేక్షకులని ప్రతిసారి అలరించే అనిరుధ్ ‘హుకుం ‘పాట కోసం థంపింగ్ ట్యూన్‌ చేశారు. బీట్‌లు వోకల్స్ హైలీ ఎనర్జిటిక్ గా వున్నాయి. ఈ పాటకు భాస్కరభట్ల చక్కని సాహిత్యం అందించారు. రజనీకాంత్ పూర్తి మాస్ అవతార్‌లో తుపాకులు పేల్చుతూ కనిపించారు. రజనీకాంత్ పవర్ ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, స్వాగ్, డైలాగ్ డెలివరీ ఖచ్చితంగా అభిమానులను ఉర్రూతలూగిస్తాయి.

కావాలయ్య పాట ఇప్పటికే బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. హుకుం పాట ఇన్స్టంట్ హిట్ అయ్యింది. బిగ్ స్క్రీన్స్ పై పూర్తి విజువల్స్‌తో పాటను చూసినప్పుడు డబుల్ ఇంపాక్ట్ ని ఇస్తుంది.

జైలర్‌లో ప్రముఖ తారాగణం నటిస్తున్నారు. జాకీ ష్రాఫ్, శివ రాజ్‌కుమార్, సునీల్, రమ్యకృష్ణ, వినాయకన్, మర్నా మీనన్ కీలక పాత్రలు పోషిస్తుండగా మోహన్‌లాల్ అతిధి పాత్రలో కనిపించనున్నారు.

విజయ్ కార్తీక్ కన్నన్ కెమరామెన్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి ఆర్ నిర్మల్ ఎడిటర్. జైలర్ ఆగస్ట్ 10న విడుదల కానుంది. ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సినిమా తెలుగు వెర్షన్‌ను విడుదల చేస్తోంది.

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2023 Idlebrain.com. All rights reserved