pizza

Janaka Aithe Ganaka on 12 Oct
ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 12న సుహాస్‌, దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ ‘జనక అయితే గనక’ రిలీజ్‌

You are at idlebrain.com > news today >

9 September 2024
Hyderabad

వెర్సటైల్ యాక్ట‌ర్ సుహాస్‌, సంగీర్త‌న హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘జనక అయితే గనక’. శిరీష్ సమర్పణలో దిల్‌రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్‌ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. వెర్సటైల్‌ యాక్టర్‌ సుహాస్‌ హీరోగా నటించారు. సందీప్‌ రెడ్డి బండ్ల డైరక్ట్ చేశారు. ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్‌ను మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ద‌స‌రా సంద‌ర్భంగా ‘జనక అయితే గనక’ చిత్రాన్ని అక్టోబ‌ర్ 12న విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఇంట్రెస్టింగ్ వీడియో క్రియేట్ చేసి రిలీజ్ చేశారు.

వీడియో గ‌మ‌నిస్తే..‘జనక అయితే గనక’ ఓవ‌ర్‌సీస్ హ‌క్కులు సొంతం చేసుకున్న హీరో సుహాస్‌కి అంద‌రూ ఫోన్ చేసి సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడ‌ని అడుగుతుంటారు. వీరి గోల భ‌రించ‌లేక‌.. నిర్మాత దిల్ రాజుకి సుహాస్ ఫోన్ చేసి రిలీజ్ డేట్ గురించి అడ‌గ‌టం.. ఆయ‌న దానికి మాట్లాడుతూ మ‌న సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్‌కు క‌నెక్ట్ అయ్యే స‌బ్జెక్ట్ కాబ‌ట్టి ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 12న ‘జనక అయితే గనక’ చిత్రాన్ని విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు తెలియ‌జేశారు. ఈ సంభాష‌ణ‌ను ఫ‌న్నీగా ఉంటూనే.. రిలీజ్ డేట్ అక్టోబ‌ర్ 12 అని రిజిష్ట‌ర్ అయ్యేలా ఉంది.

నటీనటులు:

సుహాస్‌, సంగీర్తన, రాజేంద్రప్రసాద్‌, గోపరాజు రమణ తదితరులు

సాంకేతిక బృందం:

బ్యానర్‌: దిల్‌రాజు ప్రొడక్షన్స్, సమర్పణ: శిరీష్‌, నిర్మాతలు: హర్షిత్‌ రెడ్డి, హన్షితా రెడ్డి, రచన - దర్శకత్వం: సందీప్‌ బండ్ల, సంగీతం: విజయ్‌ బుల్గానిన్‌, డీఓపీ: సాయి శ్రీరామ్‌, ఎడిటర్‌: కోదాటి పవన్‌ కల్యాణ్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: అరసవిల్లి రామ్‌కుమార్‌, కాస్ట్యూమ్ డిజైనర్‌: భరత్‌ గాంధీ, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: అకుల్‌, పీఆర్ఓ: వంశీకాకా.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved