Grandly Held Title and First Look Launch Event of Konidela Pavan Tej's Upcoming Film "Janta"
ఘనంగా కొణిదెల పవన్ తేజ్ హీరోగా నటిస్తున్న "జంట" మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ లాంఛ్ ఈవెంట్
Konidela Pavan Tej is playing the lead role in a new film titled "Janta", which features Padani Kumar as the female lead. Produced by Rajesh Gunisetti and Veeru Yadav under the Vasundhara Arts banner, the film is being crafted as a unique rural love and action entertainer by director Rajasekhar Yadav. The title and first look launch event was held grandly today, with TDP State Secretary Metla Ramanababu and Amalapuram MLA Aithabathula Anandarao attending as chief guests.
Speaking at the event, TDP State Secretary Metla Ramanababu said, "Several films have been shot in this region, starting from Dasara Bullodu. It is wonderful that the team of Janta has chosen this location for their film's shooting. This is Konidela Pavan Tej's second film as a hero. I hope he earns recognition as another prominent hero from the Mega family through Janta. My best wishes to the entire team."
Cinematographer Rahul Srivastav said, "We will be shooting in Amalapuram for two months, and we need everyone's support for our film's shoot. Our director has placed his trust in me by giving me this opportunity. We will work hard to live up to his expectations."
Fight Master Gouri Shankar V.V. said, "When our director narrated this story, I immediately felt that I had to be part of this film. His script captures the emotions of what happens when a war descends upon a village. Audiences can expect to witness a completely new style of action in this film."
Amalapuram MLA Aithabathula Anandarao said, "It is wonderful that the shooting of Janta is beginning in Amalapuram, a place known for its pleasant atmosphere and natural beauty. My best wishes to the entire team. More films should be shot locally, as it will create employment and generate income for the people here. Just as Hyderabad has film studios, we can proudly say that the natural locations here make Amalapuram a natural studio. I wish Janta great success."
Producer Rajesh Gunisetti said, "We have been working on this film for the past two years. We felt that the locations in Amalapuram would perfectly suit the content of our film, which is why we chose this place. As producers who hail from Amalapuram, it makes us very happy to shoot our film here. Our director Rajasekhar is the only person who could have handled this script. It is because of his efforts that the project has reached this stage. I can confidently say that Telugu cinema will soon witness the arrival of a unique and creative director through this film. I believe Janta will achieve great success, and everyone who has worked on it will feel proud of being associated with it."
Heroine Padani Kumar said, "This is my first Telugu film, and I am very happy to have received this opportunity. I thank every member of our team. I request everyone to support our film and make it a big success. I am eagerly looking forward to joining the shoot."
Hero Konidela Pavan Tej said, "I thank all the elders and well-wishers who have extended their blessings to our film Janta. Initially, we planned to shoot the film in and around Hyderabad. However, after discussions about encouraging film shootings in Andhra Pradesh as well, we decided to shift our base to Amalapuram. The entire film will be shot here.
"My director and I have been travelling with this project for the past two years, working hard to bring it to the screen. I have been waiting for this film despite receiving offers for other projects because I strongly believe in this story. I consider it fortunate to have got the opportunity to play the lead in such a powerful subject. The film has a strong emotional drive along with mass elements. I can confidently say that audiences have not witnessed a story like this before.
"Our film's tagline is 'The war is not with Rama, but with the kingdom.' Many people have been calling us after seeing this tagline, as it perfectly suits the story. We are confident that Janta will emerge as a blockbuster."
Technical Team:
Art Director: Peddiraju Addala
Fight Master: Gouri Shankar V.V.
Director of Photography: Rahul Srivastav
Music: Subhash Ishaan
Dialogue Writer: Nathmika Madhu
Executive Producer: K.S. Ravibabu
Producers: Rajesh Gunisetti, Veeru Yadav
Story and Direction: Rajasekhar Yadav
Digital: Vamsi Krishna (Cine Digital)
ఘనంగా కొణిదెల పవన్ తేజ్ హీరోగా నటిస్తున్న "జంట" మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ లాంఛ్ ఈవెంట్
కొణిదెల పవన్ తేజ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "జంట". ఈ చిత్రంలో పాడని కుమార్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని వసుంధర ఆర్ట్స్ బ్యానర్ పై రాజేష్ గునిశెట్టి, వీరు యాదవ్ నిర్మిస్తున్నారు. రూరల్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఒక యూనిక్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా దర్శకుడు రాజశేఖర్ యాదవ్ రూపొందిస్తున్నారు. ఈ రోజు ఈ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ లాంఛ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మెట్ల రమణబాబు, అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మెట్ల రమణబాబు మాట్లాడుతూ - ఇక్కడ దసరా బుల్లోడు సినిమా నుంచి ఎన్నో మూవీస్ షూటింగ్స్ జరుపుకున్నాయి. జంట సినిమా చిత్రీకరణకు ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడం సంతోషంగా ఉంది. కొణిదెల పవన్ తేజ్ కు హీరోగా ఇది రెండో సినిమా. జంట సినిమాతో కొణిదెల పవన్ తేజ్ మెగా ఫ్యామిలీలో మరో పెద్ద హీరోగా పేరు తెచ్చుకోవాలి. ఈ సినిమా టీమ్ అందరికీ నా బెస్ట్ విశెస్ అందిస్తున్నా. అన్నారు.
డీవోపీ రాహుల్ శ్రీ వాస్తవ్ మాట్లాడుతూ - రెండు నెలల అమలాపురంలో షూటింగ్ చేయబోతున్నాం. మీ అందరి సపోర్ట్ మా సినిమా షూటింగ్ కు కావాలి. మా డైరెక్టర్ నాపై నమ్మకంతో ఈ సినిమాలో తీసుకున్నారు. ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా కష్టపడతాం. అన్నారు.
ఫైట్ మాస్టర్ గౌరీ శంకర్.వి.వి. మాట్లాడుతూ - మా డైరెక్టర్ గారు ఈ కథ చెప్పినప్పుడు ఈ సినిమాకు తప్పకుండా వర్క్ చేయాలనిపించింది. ఒక యుద్ధం ఊరి మీదకు వస్తే ఎలా ఉంటుందో ఆ ఎమోషన్స్ అన్నీ ఆయన స్క్రిప్ట్ లో చూశాను. ఒక కొత్త తరహా యాక్షన్ ను ఈ సినిమాలో చూడబోతున్నారు. అన్నారు.
అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు మాట్లాడుతూ - ఆహ్లాదకర వాతావరణానికి నెలవైన అమలాపురంలో జంట సినిమా షూటింగ్ ప్రారంభం కావడం సంతోషంగా ఉంది. ఈ సినిమా టీమ్ అందరికీ నా బెస్ట్ విశెస్ అందిస్తున్నా. స్థానికంగా మరిన్ని సినిమాలు షూటింగ్స్ జరగాలి. అప్పుడే ఇక్కడ వారికి ఉపాధి, ఆదాయం లభిస్తాయి. హైదరాబాద్ లో సినిమా స్టూడియోస్ లా, ఇక్కడ ఉన్న లొకేషన్స్ తో నేచర్ స్టూడియో ఉందని చెప్పుకోవచ్చు. జంట సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా. అన్నారు.
ప్రొడ్యూసర్ రాజేష్ గునిశెట్టి మాట్లాడుతూ - ఈ సినిమా కోసం రెండేళ్లుగా వర్క్ చేసుకుంటున్నాం. మా సినిమా కంటెంట్ కు తగినట్లు అమలాపురంలోని లొకేషన్స్ యాప్ట్ అవుతాయని అనిపించి ఇక్కడికి వచ్చాం. అమలాపురం నుంచి వచ్చిన ప్రొడ్యూసర్స్ గా మా సినిమా ఇక్కడ స్థానికంగా షూటింగ్ జరుపుకోవడం సంతోషంగా ఉంది. ఈ స్క్రిప్ట్ ను మా డైరెక్టర్ రాజశేఖర్ తప్పితే మరొకరు డీల్ చేయలేరు. ఆయన వల్లే ఈ సినిమా ఇక్కడిదాకా వచ్చింది. ఈ సినిమాతో ఒక యూనిక్, క్రియేటివ్ డైరెక్టర్ టాలీవుడ్ కు రాబోతున్నాడని చెప్పగలను. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది. ఈ మూవీకి వర్క్ చేసిన వాళ్లంతా గర్వంగా ఫీలవుతారు. అన్నారు.
హీరోయిన్ పాడని కుమార్ మాట్లాడుతూ - ఇది నాకు ఫస్ట్ తెలుగు మూవీ. ఈ సినిమాలో అవకాశం రావడం చాలా హ్యాపీగా ఉంది. మా టీమ్ లోని ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ చెబుతున్నా. ఈ సినిమాను పెద్ద హిట్ చేయాలని మీ అందరినీ కోరుతున్నా. ఈ సినిమా షూట్ లో జాయిన్ అయ్యేందుకు ఆత్రుతగా వేచి చూస్తున్నా. అన్నారు.
హీరో పవన్ తేజ్ కొణిదెల మాట్లాడుతూ - మా జంట చిత్రానికి శుభాకాంక్షలు అందజేసిన పెద్దలకు థ్యాంక్స్. మా సినిమాను మొదట్లో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించాలని అనుకున్నాం. ఆంధ్రా వైపు కూడా మన సినిమాల షూటింగ్స్ జరగాలని మేమంతా డిస్కస్ చేసుకుని అమలాపురంకు షిఫ్ట్ అయ్యాం. మా సినిమా షూటింగ్ మొత్తం ఇక్కడే జరపబోతున్నాం. రెండేళ్లుగా నేను మా డైరెక్టర్ ఈ ప్రాజెక్ట్ మీద ట్రావెల్ చేస్తున్నాం. ఈ సినిమాను ఎలాగైనా హిట్ చేయాలని ప్రయత్నిస్తున్నాం. వేరే మూవీస్ ఆఫర్స్ వచ్చినా నేను ఈ చిత్రం కోసం వేచి చూస్తూ వచ్చాను. బలమైన కథతో ఈ సినిమా చేస్తున్నాం. ఈ చిత్రంలో హీరోగా నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. సినిమాలో మంచి ఎమోషనల్ డ్రైవ్, మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇలాంటి కథ ఇప్పటిదాకా రాలేదని చెప్పగలను. మా సినిమా క్యాప్షన్ 'యుద్ధం రాముడితో కాదు రాజ్యంతో..'. ఈ క్యాప్షన్ చూసి చాలా మంది ఫోన్స్ చేస్తున్నారు. ఈ క్యాప్షన్ మా కథకు యాప్ట్ గా ఉంటుంది. జంట సినిమాతో బ్లాక్ బస్టర్ కొడుతున్నాం. అన్నారు.