pizza

My role in 'Japan' is a surprise element; it is a crazy & unique film: Heroine Anu Emmanuel
'జపాన్' లో చాలా సర్ ప్రైజ్ రోల్ చేశాను. జపాన్ క్రేజీ, యూనిక్ ఫిల్మ్. ప్రేక్షకులు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు: హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్

You are at idlebrain.com > news today >
Follow Us

7 November 2023
Hyderabad

Actor Karthi is ready to entertain the audience with his 25th film, 'Japan'. Directed by Raju Murugan, this pan-India heist thriller is produced by SR Prakash Babu and SR Prabhu under the Dream Warrior Pictures banner, while Annapurna Studios is releasing the movie in Telugu. Anu Emmanuel played the female lead in the film, which is all set to open grandly in theatres on November 10.

Ahead of the release, the actress interacted with the media, where she said that Japan has a unique story. She continued, “Raju Murugan is a very versatile director. Each of his films is different. Karthi Garu, Dream Warrior Pictures, DOP Ravi Varman, and GV Prakash Kumar, have all come together for this movie. Japan's story and character are very unique. I have never heard such a story before. As an audience, I am very interested in watching such a movie.”

She called her co-star, Karthi, the nicest human being. Heaping praise on him, she said, “Karthi is an amazing actor and a team player. We used to discuss before doing any scene. Off-screen, Karthi is a great human being. This is Karthi's 25th film, and it’s an honour to work with him. He takes a lot of care and is very supportive. Karthi is a great co-star.”

Sharing some unique elements that will entertain the audience in ‘Japan', Anu said, “Just watching the trailer and teaser makes you understand that Japan is a unique movie. No one has done such a role before, and I say this is the perfect film for Diwali. It is a film that provides a great theatre experience. Everyone must watch it in theaters. Japan is so crazy. It gives a new experience to the audience, and they will surely enjoy it.”

While the audience got an idea about Japan’s character, no one knew what Anu was playing, and the actress wanted to keep it as a surprise for the audience. Without revealing much, she shared, “My role in 'Japan' will be a surprise element. I don't want to reveal too much about it right now. I will be seen as an actress. My role is crucial in Japan’s life. There is a very interesting track between Karthi and my character. It will definitely entertain everyone.”

Furthermore, she shared that Japan’s background music is amazing and that it gives a great experience in theater. “The songs are also very unique. The music suits the story and is very different,” she added.

Calling Sunil his favourite actor, Anu recalled, “There are scenes with Sunil in Japan. Sunil is my favourite actor. I worked with him earlier on the movie Urvashivo Rakshasivo. He is a very versatile actor and played an excellent role in Pushpa. His role is very good in Japan too.”

This is an SR Prabhu production, and Anu believes that her producer is very passionate about cinema. “The best team was given to Japan. Karthi, Raju Murugam, Ravi Varman, and GV—we worked with such an amazing team. We shot in many amazing locations, like Kerala, Kashmir, and Chennai. The film was made without any compromise. Also, amazing promotions are going on everywhere- Chennai, Hyderabad, Kerala, and Dubai. Prabhu is one of the best producers I have worked with,” she said.

Lastly, the Manju star confessed that there is no such thing as a dream role for her. “You have to play roles that the audience likes. I wish to get some good characters and stories,” concluded Anu Emmanuel.

'జపాన్' లో చాలా సర్ ప్రైజ్ రోల్ చేశాను. జపాన్ క్రేజీ, యూనిక్ ఫిల్మ్. ప్రేక్షకులు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు: హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్

హీరో కార్తి తన 25వ చిత్రం ‘జపాన్’ తో ప్రేక్షకులని అలరించేందుకు సిద్ధంగా వున్నారు. జోకర్ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా హీస్ట్ థ్రిల్లర్ ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మించారు. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్‌, ట్రైలర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తోంది. జపాన్ 'దీపావళి' కానుకగా నవంబర్ 10న గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదలౌతుంది. ఈ సందర్భంగా హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ విలేకరుల సమావేశంలో జపాన్ విశేషాలని పంచుకున్నారు

దర్శకుడు రాజు మురుగన్ జపాన్ కథ చెప్పినపుడు మీకు ఎక్సయిటింగా అనిపించిన అంశాలు ఏమిటి ?
రాజు మురుగన్ చాలా వైవిధ్యమైన దర్శకుడు. తన ప్రతి సినిమా డిఫరెంట్ గా వుంటుంది. కార్తి గారు, డ్రీమ్ వారియర్ పిక్చర్స్, డీవోపీ రవి వర్మన్, జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్.. ఇలా జపాన్ టీం చాలా పెద్దది. జపాన్ కథ, పాత్ర చాలా యూనిక్. ఇలాంటి కథని గతంలో వినలేదు. ఇలాంటి సినిమాని చూడడానికి ఆడియన్ గా కూడా చాలా ఆసక్తి చూపిస్తాను.

కార్తి గారితో నటించడం ఎలా అనిపించింది ?
కార్తి గారు అద్భుతమైన నటుడు. తను టీం ప్లేయర్. ఏదైనా సన్నివేశం చేసే ముందు చర్చించుకునే వాళ్ళం. ఆఫ్ స్క్రీన్ కార్తి గారు గ్రేట్ హ్యూమన్ బీయింగ్. ఇది కార్తి గారికి 25వ చిత్రం. ఆయనతో పని చేయడం ఒక గౌరవంగా భావిస్తున్నాను. ఆయన చాలా కేర్ తీసుకుంటారు. చాలా సపోర్ట్ చేస్తారు. కార్తి గారు గ్రేట్ కో స్టార్.

'జపాన్' లో ప్రేక్షకులని అలరించే యూనిక్ ఎలిమెంట్స్ ఏమిటి ?
ట్రైలర్ టీజర్ చూస్తూనే జపాన్ ఒక యూనిక్ సినిమా అని అర్ధమైపోతుంది. జపాన్ చాలా డిఫరెంట్ మూవీ. కార్తి గారే కాదు ఇలాంటి పాత్రని గతంలో ఎవరూ చేయలేదు. జపాన్ దీపావళికి పర్ఫెక్ట్ ఫిల్మ్. ఇది గొప్ప థియేటర్స్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే చిత్రం. తప్పకుండా అందరూ థియేటర్స్ లోనే చూడాలి. జపాన్ చాలా క్రేజీగా వుంటుంది. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది. తప్పకుండా అందరూ ఎంజాయ్ చేస్తారు.

'జపాన్' లో మీ పాత్ర ఎలా ఉండబోతుంది ?
'జపాన్' లో నా పాత్ర ఒక సర్ ప్రైజ్ ఎలిమెంట్ గా వుంటుంది. దాని గురించి ఇప్పుడే ఎక్కువగా రివిల్ చేయకూడదు. ఇందులో నటిగా కనిపిస్తాను. నా పాత్ర జపాన్ జీవితంలో కీలకంగా వుంటుంది. కార్తి, నా పాత్రకు మధ్య చాలా ఆసక్తికరమైన ట్రాక్ వుంటుంది. తప్పకుండా అందరినీ అలరిస్తుంది.

జీవి ప్రకాష్ గారి మ్యూజిక్ గురించి ?
జపాన్ నేపధ్య సంగీతం అద్భుతంగా వుంటుంది. థియేటర్ లో గ్రేట్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. పాటలు కూడా చాలా యూనిక్ గా వుంటాయి. కథకు తగ్గట్టే మ్యూజిక్ చాలా డిఫరెంట్ గా వుంటుంది.

ఎస్ఆర్ ప్రభు గారి నిర్మాణంలో పని చేయడం ఎలా అనిపించింది ?
ఎస్ఆర్ ప్రభు గారు సినిమాపట్ల చాలా ప్యాషన్ వున్న ప్రొడ్యూసర్. జపాన్ కోసం బెస్ట్ టీం ఇచ్చారు. కార్తి, రాజమురన్, రవి వర్మన్, జీవీ.. ఇలా అద్భుతమైన టీంతో పని చేశాం. కేరళ, కాశ్మీర్, చెన్నై.. ఇలా చాలా అద్భుతమైన లొకేషన్స్ లో షూట్ చేశాం. ఎక్కడా రాజీపడకుండా సినిమాని నిర్మించారు. అలాగే చెన్నై, హైదరాబాద్, కేరళ, దుబాయ్ ఇలా అన్ని చోట్ల అద్భుతంగా ప్రమోషన్స్ జరుగుతున్నాయి. నేను పని చేసిన బెస్ట్ ప్రొడ్యూసర్స్ లో ప్రభు గారు ఒకరు.

ఇందులో సునీల్ గారితో కాంబినేషన్ సీన్స్ ఉన్నాయా ?
జపాన్ లో సునీల్ గారితో సీన్స్ వున్నాయి. సునీల్ గారు నా ఫేవరెట్ యాక్టర్. సునీల్ గారితో ఇంతకుముందు ఊర్వశివో రాక్షసివో సినిమా కోసం కలిసి పని చేశాను. తను చాలా వైవిధ్యమైన నటుడు. పుష్పలో అద్భుతమైన పాత్ర చేశారు. జపాన్ లో కూడా ఆయన పాత్ర చాలా బావుంటుంది.

మీరు ఎలాంటి పాత్రలు చేయాలని కోరుకుంటారు ?
నాకు డ్రీం రోల్స్ అంటూ ఏమీ లేవు. ప్రేక్షకులు ఇష్టపడే పాత్రలు చేయాలని వుంటుంది. అలాంటి మంచి పాత్రలు, కథలు రావాలని కోరుకుంటాను.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2023 Idlebrain.com. All rights reserved