pizza

Karthi interview about Japan
Japan is a universal entertainer with many mass and fun elements: Karthi
‘జపాన్’ మాస్, ఫన్ అన్నీ ఎలిమెంట్స్ వున్న యూనివర్సల్ ఎంటర్టైనర్. ఖచ్చితంగా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది: హీరో కార్తీ

You are at idlebrain.com > news today >
Follow Us

2 November 2023
Hyderabad

Actor Karthi is ready to entertain the audience once again with a unique story in his 25th film. Titled 'Japan', the movie, a heist thriller, is directed by Raju Murugan of Joker fame and produced by SR Prakash Babu and SR Prabhu under the Dream Warrior Pictures banner. Anu Emmanuel is playing the heroine. The already-released teaser, trailer, and songs of the film have received tremendous response. The movie, coming as a Diwali treat, will be released by Annapurna Studios in the Telugu states on November 10th.

The actor who interacted with the media revealed that 'Japan' is not a true story. “Japan is based on real-life events. Director Raju Murugan, who was a reporter before turning into a director, included his real-life experiences in this. He got the National Award for the movie Joker, and he included another new aspect in ‘Japan’. The movie gives the audience a very new experience. While reading the script of this movie, I felt it was an out-of-the-box movie. Every scene in this is very new and original. But if you watch the movie, you will understand why it is titled ‘Japan’,” stated he.

Director Raju Murugan's films are known to be very intense, and Japan too is said to have a universal concept laced with many elements. Karthi said, “Japan is a dark comedy laced with many elements, including satire and humor. Raju Murugan wrote the dialogues for the Tamil version of Oopiri. I was shocked to see his humor. In this, the humor will surprise the audience. After a long timr, I played a different role in this, which has both mass and comedy elements.”

Moreover, the actor had to undergo a huge makeover for the movie. The dialogues are also very peculiar. He shared, “Raj Murugan wrote a story for me. I really liked a character in it, and I asked him if we could tell a story through that character, and that’s how 'Japan' happened. I already knew that this role would be very unique. This character needs a new Karthi. I changed myself accordingly. When the dubbing was done, we ensured the essence of Karthi was not felt anywhere. Some people's personalities have nothing to do with their voices. Some people look heavy, but their voice is very soft. We tried that for the character of Japan. It turned out great. I enjoyed doing this role a lot.”

He added, “Japan reflects today's society with all the fun elements. This story connects with everyone. We have worked with very talented technicians to present it to a universal audience. S. Ravi Varman has given an excellent visual treatment. Also, GV Prakash Kumar took it to another level with the music. Just like cinematography, GV’s music is also very new.”

On a lighter note, he also spoke about his movie selection process: "I love the magic in the movie. The audience who come to the theater with any problems forget everything for a couple of hours and enjoy transversing to another world. That is the magic of cinema. First, it should be learned properly. It was a big learning experience for me. Till now, I have made sure that every film, story, and role I have played is different. I try to do something different every time. It works out for me.”

About Annapurna Studios, with whom he is doing back-to-back films, he said, “It is a great pleasure to do a film with Annapurna Studios. The movie became bigger with the association of Annapurna Studios.”

When asked about Khaidi 2 and the role of Rolex, he said, “I am also waiting for that. Discussions are going on. There are many expectations among the audience about Rolex. You have to ask my brother (Surya), director Lokesh Kanakaraj, about this (laughing).”

“Japan is a very strong and interesting character. I told the director that there should be a hint of a probable sequel or prequel for the movie towards the climax,” he said, adding, “I am doing a film with the director of Soodhu Kavvum. Also, I am doing a film with 96 director Prem Kumar. Also, there are Khaidi 2 and Sardar 2.”

‘జపాన్’ మాస్, ఫన్ అన్నీ ఎలిమెంట్స్ వున్న యూనివర్సల్ ఎంటర్టైనర్. ఖచ్చితంగా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది: హీరో కార్తీ

హీరో కార్తి తన 25వ చిత్రం ‘జపాన్’ తో ప్రేక్షకులని అలరించేందుకు సిద్ధంగా వున్నారు. జోకర్ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వం వహించిన ఈ హైస్ట్ థ్రిల్లర్ ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మించారు. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్‌, ట్రైలర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తోంది. జపాన్ 'దీపావళి' కానుకగా గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదలౌతుంది. ఈ సందర్భంగా హీరో కార్తి విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

జపాన్ ట్రూ స్టొరీ నా ? జపాన్ అనే టైటిల్ పెట్టడానికి కారణం ?
‘జపాన్’ ట్రూ స్టొరీ కాదు. కానీ వాస్తవ సంఘటనలు స్ఫూర్తి వుంటుంది. ఈ చిత్ర దర్శకుడు రాజు మురుగన్ రిపోర్ట్ నుంచి డైరెక్టర్ అయ్యారు. ఆయన చూసిన అనుభవాలు కూడా ఇందులో వున్నాయి. జోకర్ సినిమాకి ఆయనకు నేషనల్ అవార్డ్ వచ్చింది. జపాన్ లో మరో కొత్తకోణం ఆవిష్కరించారు. సినిమా చాలా కొత్త అనుభూతిని ఇస్తుంది. ఈ సినిమా స్క్రిప్ట్ చదువుతున్నప్పుడే ఇదే అవుట్ అఫ్ ది బాక్స్ మూవీ అనిపించింది. ఇందులో ప్రతి సన్నివేశం చాలా కొత్తగా ఒరిజినల్ గా వుంటుంది. అయితే జపాన్ అనే పేరు ఎందుకు పెట్టామో సినిమా చూస్తే అర్ధమౌతుంది.

దర్శకుడు రాజు మురుగన్ చిత్రాలు ఇంటెన్స్ గా వుంటాయి.. ఇది భిన్నంగా కనిపిస్తుంది కదా?
జపాన్ లో కూడా సెటైర్ వుంది. మంచి డార్క్ కామెడీ పండింది. ఊపిరి సినిమాకి తమిళ వెర్షన్ డైలాగులు రాసింది ఆయనే. అప్పుడే ఆయన హ్యుమర్ చూసి షాక్ అయ్యాను. ఇందులో ఆ హ్యుమర్ ప్రేక్షకులకు సర్ ప్రైజ్ ఇస్తుంది. చాలా రోజుల తర్వాత మాస్ తో పాటు హ్యుమర్ సెటైర్ వున్న డిఫరెంట్ రోల్ ఇందులో చేశాను.

జపాన్ కోసం కొత్తగా మేకోవర్ అయ్యారు .. డైలాగ్స్ కూడా చాలా పెక్యులర్ గా చెప్పారు కదా?
రాజ్ మురగన్ నా కోసం ఒక కథ రాశారు. అందులో ఒక పాత్ర నాకు చాలా నచ్చింది. ఆ పాత్రతో ఒక కథ చెప్పగలమా అని అడిగాను. అలా వచ్చిందే ‘జపాన్’. ఈ పాత్ర చాలా యూనిక్ గా వుంటుందని నాకు ముందే తెలుసు. ఈ పాత్ర కు కొత్త కార్తి కావాలి. దానికి తగ్గట్టే నన్ను నేను మార్చుకున్నాను. డబ్బింగ్ చెప్పినప్పుడు .. కార్తి వినిపిస్తున్నడు జపాన్ కావాలని అడిగారు దర్శకుడు. కొంతమంది పర్సనాలిటీకి వాళ్ళ వాయిస్ కి సంబంధం వుండదు. మనిషి దృడంగా వుంటారు కానీ వాయిస్ కాస్త లేతగా సన్నగా వుంటుంది. జపాన్ పాత్ర కోసం అలా ప్రయత్నించాం. అది అద్భుతంగా కుదిరింది. జపాన్ క్యారెక్టర్ బేస్డ్ ఫిల్మ్. ఈ పాత్ర చేసినప్పుడు చాలా ఎంజాయ్ చేశాను.

జపాన్ యూనివర్సల్ సబ్జెక్ట్ నా?
జపాన్ అన్నీ ఫన్ ఎలిమెంట్స్ తో నేటి సమాజాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఈ కథ అందరికీ కనెక్ట్ అవుతుంది. యూనివర్సల్ ఆడియన్స్ కి ప్రజెంట్ చేయడానికే చాలా ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులతో పని చేశాం. ఎస్ రవివర్మన్ అద్భుతమైన విజువల్ ట్రీట్మెంట్ ఇచ్చారు. అలాగే జీవీ ప్రకాష్ మ్యూజిక్ తో మరో స్థాయికి తీసుకెళ్ళారు. విజువల్ ఎలా అయితే కొత్తగా వున్నాయో జీవీ కూడా చాలా కొత్తగా సంగీతం చేశారు.

మీ సినిమాల ఎంపిక ఎలా వుంటుంది ?
సినిమాలోని మ్యాజిక్ నాకు చాలా ఇష్టం. ఏవో సమస్యలతో థియేటర్ కి వచ్చిన ఆడియన్స్ ఓ రెండు గంటల పాటు అన్నీ మర్చిపోయి వేరే ప్రపంచంలో ప్రయాణించి ఆనందాన్ని పొందుతారు. అదే సినిమా మ్యాజిక్. ముందు ఇది సరిగ్గా నేర్చుకోవాలి. ఇది నాకు పెద్ద లెర్నింగ్ ఎక్స్ పీరియన్స్. నా వరకూ నేను చేసిన ప్రతి సినిమా, కథ, పాత్ర డిఫరెంట్ గా ఉండే లాగా చూసుకుంటాను. ప్రతిసారిఏదో డిఫరెంట్ గాచేయాలని ప్రయత్నిస్తాను. అది నాకు వర్క్ అవుట్ అవుతుంది.

బ్యాక్ టు బ్యాక్ అన్నపూర్ణ స్టూడియోస్ తో చేయడం ఎలా అనిపిస్తుంది ?
అన్నపూర్ణ స్టూడియోస్ తో కలిసి సినిమా చేయడం చాలా ఆనందంగా వుంది. అన్నపూర్ణ స్టూడియోస్ రావడంతో మరింత బలం చేకూరింది.

ఖైదీ 2 ఎప్పుడు ? రోలెక్స్ లో పాత్ర ఎలా వుంటుంది.
దాని కోసం నేనూ వెయిటింగ్ ( నవ్వుతూ). చర్చలు జరుగుతున్నాయి. రోలెక్స్ గురించి ప్రేక్షకుల్లో చాలా అంచనాలు వున్నాయి. దీని గురించి అన్నయ్య (సూర్య), దర్శకుడు లోకేష్ కనకరాజ్ ని అడగాలి( నవ్వుతూ)

సీక్వెల్స్ అంటే భయం వుంటుంది కదా.. సీక్వెల్స్ ని మీరేలా చూస్తారు ?
ఒక బలమైన పాత్ర, బ్యాక్ స్టొరీ వున్నప్పుడు దాన్ని ముందుకు తీసుకెళ్లవచ్చు. ఖైదీ, సర్దార్ కి అది జరిగింది కాబట్టి ముందుకు తీసుకెళ్తున్నారు.

జపాన్ కి సీక్వెల్ వుంటుందా ?
జపాన్ చాలా బలమైన, ఆసక్తికరమైన పాత్ర.. దీనికి సీక్వెల్, ప్రీక్వెల్ ఎదో ఒకటివుండాలని క్లైమాక్స్ కి ముందే దర్శకుడితో చెప్పాను. జపాన్ పాత్రని మళ్ళీ చేయాలని వుంది.

కొత్తగా చేస్తున్న చిత్రాలు ?
సూదుకవ్వం చిత్ర దర్శకుడితో ఓ సినిమా చేస్తున్నాను. అలాగే 96 దర్శకుడు ప్రేమ్ కుమార్ తో ఓ సినిమా చేస్తున్నాను. ఈ రెండు దేనికవే ప్రత్యేకం. అలాగే ఖైదీ 2, సర్దార్ 2 కూడా వున్నాయి.

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2023 Idlebrain.com. All rights reserved