pizza

Producer SR Prabhu about Japan
Japan will give a new experience to the audience: SR Prabhu
'జపాన్' చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తూ చాలా కాలం గుర్తుండిపోతుంది: నిర్మాత ఎస్ఆర్ ప్రభు

You are at idlebrain.com > news today >
Follow Us

5 November 2023
Hyderabad

Actor Karthi is all set to enthral the audience with his 25th film, 'Japan'. Directed by Raju Murugan, this pan-India heist thriller is produced by SR Prakash Babu and SR Prabhu under the Dream Warrior Pictures banner. Anu Emmanuel played the heroine in the movie that is released by Annapurna Studios in Telugu on November 10.

Interacting with the media, producer SR Prabhu said, “Japan is a character-driven movie. Movies like these leave a lasting impact. Karthi did a wonderful job playing the character of Japan. As much as Karthi's 'Evvarra Meerantha' dialogue has gone viral, Japan’s content will also go viral.”

Sharing the details about what makes Japan very special for all of them, the producer, known for picking unique content, shared, “Japan's role is serious. But the way he looks at things in life and the way he talks give good entertainment to the audience. It is a heist film that also discusses humanity and elements that reflect society. The whole movie is very fun. The audience will surely enjoy it.”

Answering one of the questions about what inspired him to make the film, Prabhu said, “Writer and director Raju Murugan's ideas are very unique. Karthi wanted to make a film with Raju Murugan. Raju Murugan's way of looking at society and the way he narrates stores is very unique. He makes you think while also making you laugh. Karthi loved the story of 'Japan'. We believe that the character of Japan will remain in the minds of the audience for a long time.”

The film’s trailer and teaser have already received a great response. “Making films that are different from each other and getting the audience's appreciation gives me great joy as a producer. We are very satisfied with our film. Karthi is also interested in doing different films. From the beginning, there was curiosity among the audience about the film. The get-up and voice modulation of Karthi attracted the attention of the audience. Even after watching the trailer and teaser, the audience is curious about what kind of movie Japan is. We maintained that curiosity.”

Terming Anu Emmaneul’s character to be very special and that it will definitely be liked by the audience, the producer further spoke about GV Prakash’s music saying, “GV Prakash's music for this film is very unique. In this, the music has been created according to the character of Japan. It gives a very new experience to the audience in theatres. The songs are also very different.”

Furthermore, the movie has the very popular Ravi Varman extending his technical talent to the film. “Ravi Varman is a great technician in the country. He has done many big films. A great technician like Ravi Varman is needed to create universal content. Japan's visuals are amazing,” he said.

He revealed the response of King Nagarjuna after watching Japan’s trailer and teaser, "Nagarjuna sir told Karthi that how he was able to create such different stories and characters for each film.”

On the work front, they have films with national crush Rashmika Mandanna and national award-winning actress Keerthy Suresh.

'జపాన్' చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తూ చాలా కాలం గుర్తుండిపోతుంది: నిర్మాత ఎస్ఆర్ ప్రభు

హీరో కార్తి తన 25వ చిత్రం ‘జపాన్’ తో ప్రేక్షకులని అలరించేందుకు సిద్ధంగా వున్నారు. జోకర్ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా హీస్ట్ థ్రిల్లర్ ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మించారు. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్‌, ట్రైలర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తోంది. జపాన్ 'దీపావళి' కానుకగా నవంబర్ 10న గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదలౌతుంది. ఈ సందర్భంగా నిర్మాత ఎస్ఆర్ ప్రభు విలేకరుల సమావేశంలో జపాన్ విశేషాలని పంచుకున్నారు

'జపాన్' చిత్రాన్ని నిర్మించడానికి మీకు స్ఫూర్తిని ఇచ్చిన అంశం ఏమిటి ?
రచయిత, దర్శకుడు రాజు మురుగన్ ఆలోచనలు చాలా విలక్షణంగా వుంటాయి. కార్తి గారు, రాజు మురుగన్ తో ఓ సినిమా చేయాలని అనుకున్నారు. రాజు మురుగన్ సమాజాన్ని చూసే విధానం, ఏదైనా విషయాన్ని చెప్పే విధానం చాలా యూనిక్ గా వుంటుంది. నవ్విస్తూనే ఆలోజింపజేస్తారు. రాజు మురుగన్ చెప్పిన 'జపాన్' కథ కార్తి గారికి చాలా నచ్చింది. జపాన్ క్యారెక్టర్ బేస్డ్ సినిమా. జపాన్ పాత్ర ప్రేక్షకుల మనసులో చాలా కాలం నిలిచిపోతుంది.

జపాన్ ట్రైలర్ టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ రావడం ఎలా అనిపించింది ?
మా సినీ ప్రయాణం చాలా వైవిధ్యంగా సాగుతోంది. ఒకదానికొకటి భిన్నమైన చిత్రాలని నిర్మిస్తూ ప్రేక్షకుల ఆదరణని పొందడం నిర్మాతగా చాలా ఆనందాన్ని ఇస్తుంది. మా సినిమా పట్ల మేము చాలా సంతృప్తిగా వున్నాం. కార్తి గారు కూడా డిఫరెంట్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. ప్రతిసారీ ఏదో కొత్తది చేయడానికి ప్రయత్నిస్తారు. జపాన్ చిత్రంపై ప్రేక్షకుల్లో మొదటి నుంచి ఒక క్యూరియాసిటీ వుంది. గెటప్, వాయిస్ మాడ్యులేషన్ ఇవన్నీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. ట్రైలర్, టీజర్ చూసినప్పటికీ జపాన్ ఎలాంటి సినిమానో అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో వుంది. ఆ క్యూరియాసిటీని మెయింటైన్ చేశాం.

జపాన్ పాత్రలో కార్తిగా ఎంతలా మెస్మరైజ్ చేస్తారు ?
ఇది క్యారెక్టర్ డ్రివెన్ మూవీ. ఇలాంటి చిత్రాలు చాలా కాలం నిలుస్తాయి. కార్తి గారు అద్భుతంగా చేశారు. జపాన్ పాత్ర చాలా ఫేమస్ అవుతుంది. కార్తి గారి 'ఎవ్వర్రా మీరంతా' డైలాగ్ ఎంత వైరల్ అయ్యిందో.. జపాన్ కంటెంట్ కూడా చాలా వైరల్ అవుతుంది.

'జపాన్' సినిమా జోనర్ అడ్వాంటేజెస్ ఏమిటి ?
జపాన్ పాత్ర సీరియస్ గానే వుంటుంది. అయితే అతను ఏదైనా ఒక విషయాన్ని చూసే తీరు, మాట్లాడే విధానం ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతుంది. ఇది హీస్ట్ ఫిల్మ్. ఇందులో మానవత్వం గురించి వుంటుంది. సొసైటీని రిఫ్లెక్ట్ చేసే ఎలిమెంట్స్ వుంటాయి. సినిమా అంతా చాలా ఫన్ గా వుంటుంది. ప్రేక్షకులకు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.

అను ఇమ్మాన్యుయేల్ పాత్ర ఎలా ఉండబోతుంది ?
జపాన్ జీవితంలో అను క్యారెక్టర్ చాలా స్పెషల్. జపాన్ లానే అను పాత్ర కూడా ఊహాతీతంగా వుంటుంది. ఆ పాత్ర ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుంది.

జీవి ప్రకాష్ గారి మ్యూజిక్ గురించి ?
జీవి ప్రకాష్ గారు ఈ చిత్రానికి మ్యూజిక్ చేసిన విధానం చాలా ప్రత్యేకంగా వుంటుంది. బేసిగ్గా ఒక సినిమాకి మ్యూజిక్ .. దర్శకుడు, హీరో, లేదా సంగీత దర్శకుడి స్టైల్ లో కనిపిస్తుంది. ఇందులో మాత్రం జపాన్ పాత్రకు తగ్గట్టు మ్యూజిక్ చేయడం జరిగింది. థియేటర్స్ లో ఆడియన్స్ కు ఇది చాలా కొత్త అనుభూతిని పంచుతుంది. పాటలు కూడా చాలా డిఫరెంట్ గా వుంటాయి.

రవివర్మన్ గారి పనితీరు గురించి ?
రవి వర్మన్ గారు దేశంలో గొప్ప టెక్నిషియన్. చాలా పెద్ద సినిమాలు చేశారు. జపాన్ కంటెంట్ ని యూనివర్శల్ గా చెప్పడానికి రవివర్మన్ లాంటి గ్రేట్ టెక్నిషియన్ కావాలి. జపాన్ విజువల్స్ అద్భుతంగా వుంటాయి.

అన్నపూర్ణ స్టూడియోస్ తో కలసి పని చేయడం ఎలా అనిపిస్తుంది ? నాగార్జున గారి నుంచి ఎలాంటి స్పందన వచ్చింది ?
నాగార్జున గారు జపాన్ ట్రైలర్ టీజర్ చూసి ఇలాంటి డిఫరెంట్ కథలు, పాత్రలు ప్రతి సినిమాకి ఎలా చేయగలుగుతున్నారని కార్తి గారిని అభినందించారు. అన్నపూర్ణ స్టూడియోస్ గత ఏడాది కార్తి గారి సర్దార్ సినిమాని విడుదల చేసింది. సినిమా విషయంలో సుప్రియ గారు, మా ఆలోచనలు ఒకేలా వుంటాయి. ఎక్కువ రీచ్ సాధించడానికి అన్నపూర్ణ మంచి ఫ్లాట్ ఫామ్.

మీ నుంచి రాబోతున్న కొత్త సినిమా గురించి ?
కీర్తి సురేష్ గారితో కన్నివెడి చేస్తున్నాం. అలాగే రష్మిక మందన గారితో రెయిన్ బో చిత్రం కూడా జరుగుతుంది. ఈ రెండు దేనికవే ప్రత్యేకమైన చిత్రాలు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2023 Idlebrain.com. All rights reserved