pizza

JetLee on May 1st
మైత్రి మూవీ మేకర్స్ ప్రజెంట్స్- సత్య, రితేష్ రానా, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ 'జెట్లీ' మే 1న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్

You are at idlebrain.com > news today >

17 April 2026
Hyderabad

టాలీవుడ్ ఫేవరేట్ ద్వయం సత్య, దర్శకుడు రితేష్ రానా 'జెట్లీ'తో అలరించబోతున్నారు. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ) హేమలత పెద్దామల్లు నిర్మించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సమర్పిస్తోంది. మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా కథానాయికగా తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేస్తున్నారు.

ఇప్పటికే ఆకట్టుకునే ఫస్ట్-లుక్ పోస్టర్‌లు, ఫన్ గ్లింప్స్‌, సత్య ఈజ్ నాట్ జెట్లీ' ప్రమోషనల్ సాంగ్‌ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

ఈ రోజు మేకర్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. 'జెట్లీ' మే 1న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కానుంది.

యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సత్య, వెన్నెల కిశోర్ డైనమిక్ గా నడుస్తూ వస్తున్న రిలీజ్ డేట్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది.

ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం అందిస్తున్నారు. సురేష్ సారంగం సినిమాటోగ్రఫీ, కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్, నార్ణి శ్రీనివాస్ ప్రొడక్షన్ డిజైనర్.

తారాగణం: సత్య, రియాసింఘా , వెన్నెల కిషోర్, అజయ్

సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం: రితేష్ రానా
నిర్మాతలు: క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్, చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు
సమర్పణ: మైత్రి మూవీ మేకర్స్ (నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి)
కథ - స్క్రీన్‌ప్లే: రితేష్ రానా & జయేంద్ర ఎరోలా
డైలాగ్స్: రితేష్ రానా
సంగీతం: కాల భైరవ
D.O.P: సురేష్ సారంగం
ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్
కాస్ట్యూమ్ డిజైనర్, స్టైలిస్ట్: తేజ ఆర్
ప్రొడక్షన్ డిజైనర్: నార్ని శ్రీనివాస్
యాక్షన్ కొరియోగ్రఫీ: వింగ్ చున్ అంజి
కో-డైరెక్టర్: చుక్కా విజయ్ కుమార్
డైరెక్షన్ గ్యాంగ్: ప్రభావ్ కర్రి, పి.వి.సాయి సోమయాజులు, విక్రమ్ రామిరెడ్డి, కౌశిక్ రాజు
పోస్టర్స్: శ్యామ్


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved