`
pizza

Director Gopichand Malineni launches Jetty trailer
జెట్టి సినిమా లో కొన్ని విజువల్స్ నన్ను ఆశ్చర్య పరిచాయి.. దర్శకుడు మలినేని గోపిచంద్

You are at idlebrain.com > news today >
Follow Us

3 November 2022
Hyderabad

వర్ధిన్ ప్రోడక్షన్స్ బ్యానర్‌పై వేణు మాధవ్ కే నిర్మాతగా, సుబ్రమణ్యం పిచ్చుక దర్శకత్వంలో రూపొందిన చిత్రం జెట్టి. మాన్యం కృష్ణ, నందితా శ్వేత జంటగా, శివాజీ రాజా, కన్నడ కిషోర్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా నవంబర్ 4వ తేదీన రిలీజ్ అవుతున్నది. జెట్టి మూవీ ట్రైలర్ ని సక్సెస్ పుల్ దర్శకుడు మలినేని గోపీచంద్ వీరసింహారెడ్డి సెట్స్ లో లాంఛ్ చేసారు.

దర్శకుడు గోపీచంద్ మలినేని మాట్లాడుతూ:
జెట్టి ట్రైలర్ లో కొన్ని విజువల్స్ నన్ను ఆశ్చర్య పరిచాయి. చాలా రియలిస్టిక్ అప్రోచ్ తో మత్య్సకారుల జీవితాలను తెరమీదకు తెచ్చిన విధానం బాగుంది. ఈ కథలో మట్టివాసనలు తెలుస్తున్నాయి. వీరి ప్రయత్నం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. పాటలు కూడా మంచి విజయం సాధించాయి అని తెలసింది. ఈ సినిమాతో పరిచయం అవుతన్న హీరో కృష్ణకు దర్శకుడు సుబ్రమణ్యం పిచ్చుకకు నా అభినందనలు అన్నారు.

హీరో మాన్యం కృష్ణ మాట్లాడుతూ:
మా ట్రైలర్ ని లాంఛ్ చేసిన దర్శకుడు గోపీచంద్ మలినేని గారికి థ్యాంక్స్. చాలా కొత్త నేపథ్యం లో ఈ సినిమా ఉంటుంది. దూరం కరిగినా సాంగ్ మా సినిమాకు మంచి హైప్ ని తెచ్చింది. మత్య్స కారుల జీవితాలను ఆవిష్కరించిన ఈ సినిమా లో అందమైన ప్రేమకథతో పాటు తండ్రి కూతుళ్ళ మద్య బలమైన ఎమోషన్స్ ఉంటాయి. నందిత శ్వేత గారితో కలసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. దర్శకుడు సుబ్రమణ్యం పిచ్చుక ఈ కథను మలిచిన తీరు చాలా హృద్యంగా ఉంటుంది అన్నారు..

దర్శకుడు సుబ్రమణ్యం పిచ్చుక మాట్లాడుతూ:
తీర ప్రాంతం లో ఒక జీవిన విధానం ఉంటుంది. వారి సమస్యలు కట్టుబాట్లు చాలా పటిష్టంగా ఉంటాయి. అలాంటి నేపథ్యం లో తీసిన జెట్టి కథ తప్పకుండా ప్రేక్షకులకు కొత్త ఎక్స్ పీరియన్స్ ని అందింస్తుంది. తప్పకుండా ప్రేక్షకుల ఆదరణ లభిస్తుందని నమ్ముతున్నాను. మా సినిమా ట్రైలర్ ని లాంఛ్ చేసిన దర్శకుడు గోపీచంద్ మలినేని కి థ్యాంక్స్. అన్నారు.

నటీ నటులు: నందిత శ్వేత‌, కృష్ణ , క‌న్న‌డ కిషోర్, మైమ్ గోపి, ఎమ్ య‌స్ చౌద‌రి, శివాజీరాజా, జీవా, సుమ‌న్ షెట్టి తదితరులు

సాంకేతిక బృందం
బ్యానర్ : వర్ధని ప్రొడక్షన్స్
మ్యూజిక్ : కార్తిక్ కొడకండ్ల‌
డిఓపి: వీర‌మ‌ణి
ఆర్ట్ ః ఉపేంద్ర రెడ్డి
ఎడిటర్: శ్రీనివాస్ తోట‌
స్టంట్స్: దేవరాజ్ నునె
కోరియోగ్రాఫర్ : అనీష్
డైలాగ్స్ ః శ‌శిధ‌ర్
నిర్మాత ః వేణు మాధ‌వ్
క‌థ‌, స్క్రీన్ ప్లే, డైరెక్ష‌న్ ః సుబ్ర‌హ్మ‌ణ్యం పిచ్చుక

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2022 Idlebrain.com. All rights reserved