pizza

"JITHENDER REDDY" Movie Based on Real Events Releasing worldwide on May 3rd
విరించి వర్మ దర్శకత్వంలో వస్తున్న జితేందర్ రెడ్డి సినిమా, పొలిటికల్ డ్రామా - మే 3న

You are at idlebrain.com > news today >

30 March 2024
Hyderabad

This Action Drama movie is directed by Virinchi Varma, who gained fame as a director with films like Uyyala Jampala and Majnu ; with Rakesh Varre as the Lead Actor. Rakesh Varre is acclaimed for his performances in films such as Baahubali and Evarikee Cheppoddu and also is the producer for Peka Medalu. The film is being developed as an Action drama based on real events from the 1980s. Previously, the first look posters of this movie have heightened the expectations for the film. The release date for this movie is announced as May 3rd.

Director Virinchi Varma said on this occasion, "Ever since the title JITHENDER REDDY was decided, the audience's interest in the movie has been increasing. The first look of Rakesh Varre has also generated good hype. Rakesh Varre will gain recognition as an action hero with this film. We filmed this movie based on real events from 1980's in Jagtial in erstwhile Karimnagar District of Telangana.After screening it for some prominent individuals, gathering their suggestions and facts, we are bringing this movie to you. Soon, we will come to you with interesting teasers, trailer, and promotions."

Producer Muduganti Ravinder Reddy said, "The title JITENDER REDDY is in itself very powerful. Many are praising the making of such a realistic and action-packed movie. We made this movie based on a real incidents that occurred between 1980-90. Despite Rakesh Varre's busy schedule with his production house, he has worked very hard for this film with enthusiasm. Virinchi Varma's storytelling is excellent, without offending anyone. We made this movie with the intention of highlighting Jitender Reddy's service to society. We are presenting the real incidents in its true form. Subbaraju's character is also very good. We will bring you updates on this movie very soon."

Artists:
Rakesh Varre
Riya Suman
Subbaraju
Ravi Prakash
Chathrapathi Shekar

Technicians:
Director : Virinchi Varma
Story and Dialogues : Muduganti Ravindhar Reddy
Producer : Muduganti Ravinder reddy
Co-Producer : Uma Ravinder
Executive Producer : Vanisri Podugu
D. O. P : V. S. Gnana Shekar
Music Director : Gopi Sunder

విరించి వర్మ దర్శకత్వంలో వస్తున్న జితేందర్ రెడ్డి సినిమా, పొలిటికల్ డ్రామా - మే 3న

బాహుబలి సినిమాతో జాతీయ స్థాయిలో ప్రేక్షకుల మన్ననలు పొందిన రాకేష్ వర్రే, గతంలో ‘ఎవ్వరికీ చెప్పొద్దు’ సినిమాతో హీరో, నిర్మాతగా మారిన సంగతి అందరికీ తెలిసిందే, రీసెంట్ గా నిర్మాతగా ‘పేకమేడలు’ చిత్రం టీజర్ను లాంచ్ చేసి మంచి కథలు, కొత్త కథలను ప్రేక్షకులకు అందించాలని చేసే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు ‘జితేందర్ రెడ్డి’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొని వస్తున్నారు. గతంలో రిలీజ్ చేసిన ప్రోమోకి, అస్సలు ఎవరు ఈ జితేందర్ రెడ్డి అని ? అని హీరో పేస్ రెవీల్ చెయ్యకుండా విడుదల చేసిన పోస్టర్స్ కూడా మంచి ఆదరణ పొందాయి.. ముదుగంటి క్రియేషన్స్ బ్యానర్ లో రాబోతున్న ఈ జితేందర్ రెడ్డి సినిమా రిలీజ్ డేట్ ను చిత్ర యూనిట్ ఈరోజు విడుదల చేసింది. 2024 May 3న ఈ చిత్రం విడుదల కాబోతుంది అని చిత్ర దర్శకుడు విరించి వర్మ చెప్పారు, ఈ సందర్భంగా దర్శకుడు విరించి వర్మ మాట్లాడుతూ, ఈ సినిమా 1st లుక్ పోస్టర్ నుండి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. హీరో ఎవరో చూపించకుండా విడుదల చేసిన పోస్టర్స్ కూడా మంచి క్యూరియాసిటీని పెంచాయి.. రాకేష్ వర్రే ఫ్యామిలీ హీరో గా ఎవ్వరికీ చెప్పొద్దూ లాంటి లవ్ స్టొరీని చేసినప్పటికీ ఇలాంటి ఒక ఆక్షన్ డ్రామా చెయ్యడం చాలా గొప్ప విషయం. ఈ జితేందర్ రెడ్డి జగిత్యాలలో 1980లలో యదార్ధంగా జరిగిన కథ. రియల్ స్టొరీని బాగా తియ్యడానికి చాలా రీసెర్చ్ అవసరమైంది, దాని కోసం నేను మా టీం వర్క్ ఔట్స్ చేసి, రెఫెరెన్సులు తీసుకుని, పెద్ద వారి సలహాలు తీసుకుని చాలా జెన్యూన్ గా చేసిన సినిమా ఇది.. మే 3న రిలీజ్ అయ్యే ఈ సినిమాతో ఆరోజుల్లో విలువలతో కూడిన ఈ పాత్ర, దాని చుట్టూ తిరిగే కథని ఈ తరం ప్రేక్షకులకి అందించాలని చేసే ప్రయత్నమే ఈ జితేందర్ రెడ్డి.

ముదుగంటి క్రియేషన్స్ అధినేత, నిర్మాత ముదుగంటి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, ఉయ్యాలా జంపాలా, మజ్ను లాంటి ప్రేమకథా చిత్రాలకు దర్శకత్వం వహించిన విరించి వర్మ, మా జితేందర్ రెడ్డి లాంటి ఆక్షన్ స్టొరీని కూడా అద్భుతంగా తెరకెక్కించారు.. ఈ చిత్రం యొక్క పోస్టర్స్, గ్లిమ్స్ ను చాలా మంది అప్ప్రిషిఎట్ చేస్తున్నారు, జితేందర్ రెడ్డి అనే టైటిల్ ఏ చాలా పవర్ఫుల్ టైటిల్. 1980లో నేను చూసిన, నాకు తెలిసిన కథ ఈ జితేందర్ రెడ్డి, అప్పటి లొకేషన్స్ గాని, అప్పటి అంబియన్స్ ని గాని చాలా చక్కగా తెరకేక్కించాము. మా హీరో రాకేష్ వర్రే గురంచి మీకు చెప్పాలి, గతంలో లవ్ స్టొరీ చేసి ఇప్పుడు ఈ ఆక్షన్ డ్రామా ని కూడా చాలా బాగా హేండిల్ చేశాడు, తనకు సొంతగా క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ ఉన్నప్పటికీ, తన సినిమాలే మూడు జరుగుతున్నప్పటికీ కూడా ఈ జితేందర్ రెడ్డిని తన సొంత ప్రాజెక్ట్ లాగా, తన సినిమాల పనులను అడ్జస్ట్ చేసుకుని చాలా శ్రమని ఈ సినిమా కోసం పెట్టారు.. అప్పటి సన్నివేశాలని, జరిగిన కథని యదార్ధంగా చూపించాము తప్ప, ఎవరిని కించ పరిచే విధంగా మాత్రం చెయ్యలేదు. సుబ్బరాజు గారి లాంటి విలక్షణ నటులు కూడా మనసు పెట్టి అధ్బుతంగా ఈ కథ కోసం పని చేశారు. ఈసినిమాకి సంబధించిన updatesను మీకు ఇక నండి ఇస్తూ ఉంటాము, మేము మొదటి సారి సినిమా ఇండస్ట్రీ కి వచ్చి ఈ సినిమా చేస్తున్నాము, మమ్మల్ని ఆశీర్వదించండి.

సాంకేతిక నిపుణులు విషయానికి వస్తే ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలకు (కంచే, NTR కథానాయకుడు, NTR మహానాయకుడు, IB 47) విషువల్స్ అందిచిన వి.ఎస్‌ జ్ఞాన శేఖర్‌ ఈ సినిమాకి కెమెరామెన్‌ గా పని చేశారు. అలాగే ఎన్నో లవ్ స్టోరీస్ కు మ్యూజికల్ హిట్స్ అందించిన మలయాళ సంగీత దర్శకుడు గోపీసుందర్‌ జితేందర్ రెడ్డి సినిమాకు సంగీతం అందిస్తున్నారు. నాగేంద్రకుమార్‌ ఆర్ట్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమాను ముదుగంటి క్రియేషన్స్‌ బ్యానర్‌పై ముదుగంటి రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు.

నటీ నటులు : రాకేష్ వర్రే, రియా సుమన్,
ఛత్రపతి శేఖర్,
సుబ్బరాజు, రవి ప్రకాష్,
ఛత్రపతి శేఖర్

సాంకేతిక నిపుణులు:
డైరెక్టర్ : విరించి వర్మ.
కథ & మాటలు ముదుగంటి రవీందర్ రెడ్డి.
నిర్మాత : ముదుగంటి రవీందర్ రెడ్డి.
కో - ప్రొడ్యూసర్ : ఉమ రవీందర్.
ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : వాణిశ్రీ పొడుగు
డి. ఓ. పి : వి. ఎస్. జ్ఞాన శేఖర్.
మ్యూజిక్ డైరెక్టర్ : గోపి సుందర్.
ఆర్ట్ డైరెక్టర్: నాగేంద్రకుమార్

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved