pizza

Junior on July 18
కిరీటి రెడ్డి, శ్రీలీల, వారాహి చలన చిత్రం, రాధాకృష్ణ, పాన్ ఇండియా మూవీ 'జూనియర్' జూలై 18న రిలీజ్

You are at idlebrain.com > news today >

15 May 2025
Hyderabad

ప్రసిద్ధ నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రం, కర్ణాటక మాజీ మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డిని “జూనియర్” అనే ఫన్, ఫ్యామిలీ, ఎమోషన్‌తో నిండిన ఎంటర్టైనర్‌ ద్వారా సినీ రంగంలోకి పరిచయం చేస్తోంది. రాధా కృష్ణ దర్శకత్వంలో, రజని కొర్రపాటి నిర్మించిన ఈ పాన్ ఇండియా చిత్రం ప్రోమోలకే మంచి స్పందన అందుకుంది.

కిరీటి తన డైలాగ్ డెలివరీ, స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నాడు. ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా కిరీటీకి జోడీగా కనిపించనుంది. అలాగే జెనీలియా కీలక పాత్రలో వెండితెరకు కం బ్యాక్ ఇస్తుండగా, కన్నడ లెజెండ్ క్రేజీ స్టార్ డా. రవిచంద్ర వి కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

ఈ రోజు మూవీ టీం విడుదల తేదీకి సంబంధించిన అప్‌డేట్‌ను రివిల్ చేసింది. జూనియర్ చిత్రం ఈ ఏడాది జూలై 18న థియేటర్లలోకి రానుంది. జూనియర్ ఈ మాన్సూన్ లో కుటుంబంతో కలిసి సరదాగా, భావోద్వేగాలతో జర్నీని అదించబోతోంది. రిలీజ్ డేట్ పోస్టర్ లో ప్రధాన తారాగణం ఆనందంగా కనిపించగా, జెనీలియా మాత్రం సీరియస్ లుక్‌తో కనిపిస్తుంది. త్వరలోనే ప్రొమోషన్స్ కిక్ స్టార్ట్ చేస్తారు.

ఈ చిత్రానికి ప్రఖ్యాత సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. కె కె సెంటిల్ కుమార్ సినిమాటోగ్రఫీను అందించగా, సంగీతాన్ని దేవి శ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైనర్‌గా రవీందర్ పనిచేస్తుండగా, యాక్షన్ సీన్‌లను భారత్‌లోనే అగ్రశ్రేణి స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్ కొరియోగ్రాఫ్ చేస్తున్నారు. డైలాగ్స్‌ను కల్యాణ్ చక్రవర్తి త్రిపురనేని రాయగా, నిరంజన్ దేవరమేనే ఎడిటర్.

తారాగణం: కిరీటి, జెనీలియా, డా. రవిచంద్ర వి, శ్రీలీల
సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: రాధా కృష్ణ
నిర్మాత: రజని కొర్రపాటి
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: కె కె సెంటిల్ కుమార్
ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్
స్టంట్ డైరెక్టర్: పీటర్ హెయిన్
డైలాగ్స్: కల్యాణ్ చక్రవర్తి త్రిపురనేని
ఎడిటర్: నిరంజన్ దేవరమేనే
కాస్ట్యూమ్స్: నీతా లుల్లా
లిరిక్స్: కల్యాణ్ చక్రవర్తి, శ్రీమణి

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved