pizza

Kiran Abbavaram’s Hard Work Pays Off: Bunny Vasu Lauds Ka Team"
కిరణ్‌ అబ్బవరం సినిమాను వదల్లేదు.. అందుకే ఈ రోజు గెలిచాడు: సక్సెస్‌ఫుల్‌ ప్రొడ్యూసర్‌ బన్నీవాస్‌

You are at idlebrain.com > news today >

09 November 2024
Hyderabad

Prominent producer Bunny Vasu lauded actor Kiran Abbavaram during the grand success meet of the film Ka. The film stars Kiran Abbavaram alongside Tanvi Ram and Nayan Sarika, with Sujith and Sandeep directing, and Chinta Gopal Reddy producing. Vamsi Nandipati oversaw the film’s release. Since its recent release, Ka has been making waves as a significant success.

During the event, Bunny Vasu praised the K team, explaining, "I only attend such events when I feel deeply connected. I genuinely wanted to speak about this film, which is why I'm here. I loved the film immensely. Having listened to hundreds of stories over the years, I tend to expect certain elements, but this film's climax caught me off guard. I couldn’t predict the plot twists and was genuinely impressed. In recent times, this film stands out with its exceptional screenplay. There wasn't a single flaw in it. The climactic sequences elicited applause for their brilliant execution."

He continued, "No matter how skilled a writer you are, if you could foresee this film's climax, you would be on par with the gods. My heartfelt congratulations to everyone involved in this project. I wish them all a bright future. The producer's courage in taking on this film is commendable. I was shocked upon hearing the budget. Both Kiran and Vamsi are dear to me. Vamsi purchased the film without quoting a price, and even when I learned the price later, I was taken aback. But after watching the film, it’s clear his faith was well-placed, leading to financial success. In the film industry, those who create opportunities for themselves succeed. Kiran created his opportunity and worked tirelessly, despite naysayers who doubted him. He never gave up the fight. Success comes when you keep striving, and Kiran’s journey is a true inspiration. He fought until he achieved success. I hope the team achieves many more victories."

కిరణ్‌ అబ్బవరం సినిమాను వదల్లేదు.. అందుకే ఈ రోజు గెలిచాడు: సక్సెస్‌ఫుల్‌ ప్రొడ్యూసర్‌ బన్నీవాస్‌

కిరణ్‌ అబ్బవరం హీరోగా నటించిన చిత్రం 'క'. తన్వీరామ్‌, నయన సారిక హీరోయిన్స్‌గా నటించిన ఈ చిత్రానికి సుజీత్‌, సందీప్‌ దర్శకులు. చింతా గోపాల్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం దిశగా పయనిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం గ్రాండ్‌ సక్సెస్‌ మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న బన్నీవాస్ 'క' టీమ్‌ను అభినందించారు. ఆయన మాట్లాడుతూ ''నాకు మనస్పూర్తిగా అనిపిస్తే తప్ప నేను ఇలాంటి వేడుకలకు రాను. ఈసినిమా గురించి మనస్పూర్తిగా మాట్లాడాలి అని అనుకున్నాను. అందుకే వచ్చాను. నాకు ఈ సినిమా నిజంగా బాగా నచ్చింది. నేను ఎన్నో కథలు విన్నాను. ఎన్నో వందల కథలు వినడం వల్ల సినిమా గురించి ఎంతో కొంత ఎక్స్‌పెక్ట్‌ చేస్తాం. కానీ ఈ సినిమా క్లైమాక్స్‌ నేను ఎక్స్‌ పెక్ట్‌ చేయలేదు. ఇలాంటి పతాక సన్నివేశాలు వస్తాయని నేను గెస్‌ చేయలేదు. ఈ మధ్య కాలంలో గ్రేట్‌ స్క్రీన్‌ప్లే ఇది. స్క్రీన్‌ప్లేలో చిన్న తప్పు కూడా లేదు.. ఈ మధ్య కాలంలో చూసిన బెస్ట్‌ స్క్రీన్‌ప్లే ఇది. పతాక సన్నివేశాల్లో ఈ సినిమా స్క్రీన్‌ప్లే విషయంలో క్లాప్స్‌ పడ్డాయి. మీరు ఎంత గొప్ప రచయిత అయినా ఈ సినిమా క్లైమాక్స్‌ ఎక్స్‌పెక్ట్‌ చేస్తే మీరు దేవుళ్లతో సమానం.ఈ సినిమాలో పనిచేసిన అందరికి శుభాకాంక్షలు. అందరికి మంచి భవిష్యత్‌ వుండాలని కోరుకుంటున్నాను.ఈ నిర్మాత గట్స్‌ అభినందనీయం. ఈ సినిమా బడ్జెట్‌ విని షాక్‌ అయ్యాను. కిరణ్‌, వంశీ నాకు నా మనసుకు దగ్గరయిన వ్యక్తులు. వంశీ నందిపాటి నాకు రేట్‌ చెప్పకుండా కొన్నాడు. రేట్‌ తెలిసి షాక్‌ అయ్యాను. నాకు కూడా ఈ నెంబర్‌ తెలిసి కంగారు పడ్డాను. సినిమా చూసిన తరువాత వీళ్ల క్యాలికేలేషన్స్‌ వంశీ నమ్మకం నిజమైంది. వంశీ సినిమాను నమ్మాడు కాబట్టే ఈ రోజు డబ్బులు వచ్చాయి. సినీ పరిశ్రమలో ఛాన్స్‌ క్రియేట్‌ చేసుకున్న వ్యక్తులు ఎదుగుతారు. కిరణ్‌ అవకాశం క్రియేట్‌ చేసుకున్నాడు.కిరణ్‌ చాలా కషపడ్డాడు. చాలా మంది కిరణ్‌ పడిపోయాడు. ఇక పని అయిపోయింది అన్నారు. కానీ అతను ఫైట్‌ ఆపలేదు. ఆట ఓడిపోవడం అంటే ఆ ఆటగాడు ఆటను వదిలేసినప్పుడే కిరణ్‌ ఎప్పుడు సినిమాను వదల్లేదు. అందుకే కిరణ్‌ గెలిచాడు. కిరణ్‌ ను చూస్తే ఇన్‌స్పిరేషన్‌ వస్తుంది. సక్సెస్‌ పాయింట్‌ వద్దకు వెళ్లే వరకు ఫైట్‌ చేయాలి. ఈ టీమ్‌ మరిన్ని విజయాలు అందుకోవాలి అన్నారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved