"KA" Gave Me the Courage and Confidence That If I Make a Good Movie, I Can Win the Love of the Audience - Hero Kiran Abbavaram at the Blockbuster Dhamaka Event
మంచి సినిమా చేస్తే ప్రేక్షకుల ప్రేమను గెల్చుకోవచ్చు అనే ధైర్యాన్ని, నమ్మకాన్ని “క“ సినిమా ఇచ్చింది - బ్లాక్ బస్టర్ ధమాకా ఈవెంట్ లో హీరో కిరణ్ అబ్బవరం
Kiran Abbavaram’s KA has achieved great success by providing the audience with a fresh cinematic experience in the thriller genre. Nayan Sarika and Tanvi Ram played the lead roles in the film. It was produced by Chinta Gopalakrishna Reddy under the banner of Srichakraas Entertainments, with the presentation by Mrs. Chinta Varalakshmi, and was backed by substantial production values. The director duo, Sujith and Sandeep, showcased their talent with KA.
The movie was released in Telugu by producer Vamsi Nandipati, and star hero Dulquer Salmaan distributed it in Malayalam through his production company, Wayfarer Films. KA emerged as a winner in the Diwali box office race, grossing Rs. 50 crores worldwide. The movie was also made available for streaming on ETV Win with Dolby Vision 4K and Atmos technology, where it achieved tremendous success. Within a short period, it accumulated 100 million minutes of viewership. To celebrate this success, the KA Blockbuster Dhamaka event was grandly organized in Hyderabad.
At the event, Director Sujith said, "Our movie KA received an amazing response in theaters, and I’m happy that the same response is now coming through ETV Win. The film is streaming on ETV Win with Dolby Vision 4K and Atmos technology. Watching it in Dolby Vision allows viewers to experience every detail of the scenes, while the Atmos technology enhances the clarity of sound and deepens the understanding of the film’s theme. We cannot forget the support we received from Kiran garu and producer Chinta Gopalakrishna Reddy garu for this film. We thank the audience once again."
Director Sandeep added, "We are grateful for the support we’ve received since the release of KA’s teaser. The reason for the movie’s success is not only Kiran garu but also our producer, Vamsi Nandipati garu, who ensured a grand release and made the movie accessible to everyone. Every member of our team played a role in the success of KA. We are also thankful that this success has continued on ETV Win. Watching it in Dolby Vision 4K and Atmos technology delivers a more impactful cinematic experience."
ETV Win Business Head Sai Krishna said, "When we saw KA in theaters, we immediately thought about bringing it to ETV Win. After discussing how to present it in a new way, we decided to release it with Dolby Vision 4K and Atmos technology. The audience’s response has been very positive, and we are thrilled to have achieved 100 million minutes of viewership in such a short time. We are excited to offer KA on ETV Win, and we encourage everyone to watch it."
Hero Kiran Abbavaram said, "Just as we promoted KA, the entire ETV Win team has worked equally hard to ensure that the film reaches the audience. They have taken all necessary precautions to prevent piracy and brought KA to everyone’s home. We thank Bapineedu garu, Sai Krishna, and the entire ETV Win team. It’s also a privilege that KA is the first Telugu movie to come to OTT with Dolby Vision 4K and Atmos technology. I am very happy about that. In Dolby Vision 4K and Atmos, the movie’s details, sound, and visuals are enhanced. Those who have already seen the movie in theaters should consider watching it again on ETV Win, as many viewers have said that the experience was even better the second time. The success of the film is thanks to our producer Gopi, directors Sandeep and Sujith, distributor Vamsi, and everyone involved. I would like to thank everyone. KA gave me the courage and confidence to believe that if I make a good film, I can win the love of the audience."
Technical Team
Editor: Sree Varaprasad
DOPs: Vishwas Daniel, Sateesh Reddy Masam
Music: Sam CS
Production Designer: Sudheer Macherla
Executive Producer: Chavan
Creative Producer: Rithikesh Gorak
Line Producer: KL Madan
CEO: Rahasya Gorak (KA Productions)
Costumes: Anusha Punjla
Makeup: Kovvada Ramakrishna
Fights: Real Satish, Ram Krishnan, Uyyala Shankar
Choreography: Polaki Vijay
VFX Producer: MS Kumar
VFX Supervisor: Phaniraja Kasturi
Co-Producers: Chinta Vinisha Reddy, Chinta Rajasekhar Reddy
Producer: Chinta Gopalakrishna Reddy
Written and Directed by: Sujith, Sandeep
మంచి సినిమా చేస్తే ప్రేక్షకుల ప్రేమను గెల్చుకోవచ్చు అనే ధైర్యాన్ని, నమ్మకాన్ని “క“ సినిమా ఇచ్చింది - బ్లాక్ బస్టర్ ధమాకా ఈవెంట్ లో హీరో కిరణ్ అబ్బవరం
థ్రిల్లర్ జానర్ లో ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇచ్చి ఘన విజయాన్ని అందుకుంది కిరణ్ అబ్బవరం మూవీ “క“. ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటించారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మించారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ "క" సినిమాతో తమ ప్రతిభ నిరూపించుకున్నారు. "క" సినిమాను తెలుగులో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి రిలీజ్ చేయగా..మలయాళంలో స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తన వేఫరర్ ఫిలింస్ పై డిస్ట్రిబ్యూట్ చేశారు. దీపావళి బాక్సాఫీస్ రేసులో విన్నర్ గా నిలిచిన ఈ సినిమా వరల్డ్ వైడ్ 50 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఈ మూవీ ఈటీవీ విన్ లో డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీతో స్ట్రీమింగ్ కు వచ్చి అక్కడా గ్రాండ్ సక్సెస్ అందుకుంది. అతి తక్కువ టైమ్ లో 100 మిలియన్ మినిట్స్ వ్యూయర్ షిప్ దక్కించుకుంది. ఈ సందర్భంగా “క“ బ్లాక్ బస్టర్ ధమాకా ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
దర్శకుడు సుజీత్ మాట్లాడుతూ - మా క సినిమాకు థియేటర్స్ లో వండర్ ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. అదే రెస్పాన్స్ ఇప్పుడు ఈటీవీ విన్ లో రావడం సంతోషంగా ఉంది. డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీతో క ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది. డాల్బీలో చూస్తే సీన్స్ లోని ప్రతి డీటెయిలింగ్ బాగా తెలుస్తుంది. అలాగే అట్మాస్ లో సౌండ్ ను క్లియర్ గా వింటూ దాని థీమ్ ను అర్థం చేసుకుంటారు. ఈ సినిమా విషయంలో మాకు కిరణ్ గారు, ప్రొడ్యూసర్ చింతా గోపాలకృష్ణ రెడ్డి గారు ఇచ్చిన సపోర్ట్ ను మర్చిపోలేం. ఆడియెన్స్ కు మరోసారి థ్యాంక్స్ చెబుతున్నాం. అన్నారు.
దర్శకుడు సందీప్ మాట్లాడుతూ - క సినిమా టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా మీరు చూపిస్తున్న ఆదరణకు థ్యాంక్స్ చెబుతున్నాం. ఈ సినిమా ఇంతబాగా రావడానికి కారణం కిరణ్ గారు, అలాగే మా ప్రొడ్యూసర్ గారు. గ్రాండ్ రిలీజ్ చేసి సినిమాను అందరికీ రీచ్ చేశారు వంశీ నందిపాటి గారు. మా టీమ్ లోని ప్రతి ఒక్కరూ క సినిమా సక్సెస్ కు కారణం. థియేటర్స్ లో ఇచ్చిన ఘన విజయాన్ని ఈటీవీ విన్ లో కూడా ఇస్తున్నందుకు కృతజ్ఞతలు. డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో మా మూవీ మరింత ఎఫెక్టివ్ గా మీకు సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇస్తుంది. అన్నారు.
ఈటీవీ విన్ బిజినెస్ హెడ్ సాయి కృష్ణ మాట్లాడుతూ - క సినిమాను థియేటర్స్ లో చూసినప్పుడు ఈ మూవీ తప్పకుండా ఈటీవీ విన్ కు తీసుకోవాలని అనుకున్నాం. అయితే కొత్తగా ఎలా ప్రెజెంట్ చేయొచ్చని ఆలోచించినప్పుడు డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో తీసుకురావాలని కిరణ్ గారితో డిస్కస్ చేసి నిర్ణయించాం. ఆడియెన్స్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. తక్కువ టైమ్ లో 100 మిలియన్ మినట్స్ వ్యూయర్ షిప్ దక్కడం సంతోషంగా ఉంది. మీరంత క సినిమాను ఈటీవీ విన్ లో తప్పకుండా చూడండి. అన్నారు.
హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ - క సినిమాకు మేము ఎంతగా ప్రమోషన్ చేశామో, ఈటీవీ విన్ టీమ్ అంతా అంతే ప్రమోషన్ చేసి ఆడియెన్స్ కు సినిమా బాగా రీచ్ అయ్యేలా చేస్తున్నారు. పైరసీ అనేది జరగకుండా జాగ్రత్తలు తీసుకుని ప్రతి ఒక్కరి ఇంటికి క సినిమాను చేర్చారు. ఈటీవీ విన్ టీమ్ బాపినీడు గారు, సాయి కృష్ణ ఇతర అందరికీ థ్యాంక్స్ చెబుతున్నాం. అలాగే డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీ నుంచి ఓటీటీలోకి వచ్చిన ఫస్ట్ తెలుగు సినిమా క కావడం విశేషం. అందుకు చాలా సంతోషంగా ఉంది. డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో మా సినిమా మరింత డీటెయిలింగ్ గా సౌండ్, విజువల్స్ మరింతగా ఆకట్టుకుంటాయి. థియేటర్ లో క సినిమా చూసిన వాళ్లు కూడా మరోసారి ఈటీవీ విన్ లో చూడండి. ఎందుకంటే సెకండ్ టైమ్ ఇంకా బాగా అనిపించింది అని చాలామంది చెబుతున్నారు. క సినిమా సక్సెస్ కు మా ప్రొడ్యూసర్ గోపి గారు, డైరెక్టర్స్ సందీప్, సుజీత్, డిస్ట్రిబ్యూటర్ వంశీ గారు..ఇలా ప్రతి ఒక్కరూ కారణం. అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నా. మంచి సినిమా చేస్తే ఆడియెన్స్ ప్రేమను గెల్చుకోవచ్చు అనే ధైర్యాన్ని, నమ్మకాన్ని క సినిమా ఇచ్చింది. అన్నారు.