Young and talented hero Kiran Abbavaram stars in the highly anticipated period thriller movie "KA." The first single from the film, titled "World of Vasudev," was released today. This song introduces the character of Vasudev, played by Kiran Abbavaram. The lyrics for "World of Vasudev" were written by Sanapati Bharadwaj, while the music was beautifully composed by Sam CS. The track is impressively sung by Kapil Kapilan.
The song's lyrics capture a journey without a clear beginning or end, describing a timeless and boundless experience. It reflects the character of Vasudev, highlighting themes of loneliness and introspection.
In "KA," Nayan Sarika and Tanvi Ram play the lead female roles. Presented by Mrs. Chinta Varalakshmi and produced by Chinta Gopalakrishna Reddy under the banner Srichakraas Entertainments, the film promises high production values. Directed by the duo Sujith and Sandeep, "KA" is set against a village backdrop and features an action-packed thriller storyline. The film will be released grandly in Tamil, Malayalam, Kannada, and Telugu.
హీరో కిరణ్ అబ్బవరం "క" సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ 'వరల్డ్ ఆఫ్ వాసుదేవ్..' రిలీజ్
యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా "క". ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ 'వరల్డ్ ఆఫ్ వాసుదేవ్..' ను ఈ రోజు రిలీజ్ చేశారు. ఈ పాట హీరో కిరణ్ అబ్బవరం వాసుదేవ్ క్యారెక్టరైజేషన్ ను ఆవిష్కరించింది. 'వరల్డ్ ఆఫ్ వాసుదేవ్..' పాటకు సనాపతి భరద్వాజ పాత్రుడు లిరిక్స్ రాయగా..సామ్ సీఎస్ బ్యూటిఫుల్ గా కంపోజ్ చేశారు. కపిల్ కపిలన్ ఆకట్టుకునేలా పాడారు.
'వరల్డ్ ఆఫ్ వాసుదేవ్..' పాట ఎలా ఉందో చూస్తే - 'ఏ మొదలు తుదలు లేని ప్రయాణం. ఏ అలుపూ సొలుపు లేని విహారం. ఏ చెరలు తెరలు తెలియని పాదం..ఈ మజిలీ ఒడిలో ఒదిగిన వైనం,నిన్న మొన్న ఉన్న నన్ను చూశారా..వెన్ను దన్ను అంటూ ఏముంది. ఒంటరివాడినని అంటారా నాతో పాటు ఊరుంది...' అంటూ హీరో వాసుదేవ్ పాత్రను ప్రతిబింబిస్తూ 'వరల్డ్ ఆఫ్ వాసుదేవ్..' పాట సాగుతుంది.
"క" సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో "క" సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా త్వరలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురాబోతున్నారు.