14 October 2024
Hyderabad
Young and talented hero Kiran Abbavaram stars in the period thriller "KA." Nayan Sarika and Tanvi Ram play the female leads in this film, which is presented by Mrs. Chinta Varalakshmi and produced by Chinta Gopalakrishna Reddy under the banner Srichakraas Entertainments, featuring high production values. The director duo, Sujith and Sandeep, are crafting an action thriller set against a village backdrop. The film is gearing up for a grand theatrical release in Tamil, Malayalam, and Kannada, alongside Telugu, on the 31st of this month to coincide with the Diwali festival. "KA" will be released in Telugu by producer Vamsi Nandipati and in Malayalam by hero Dulquer Salmaan under his Wayfarer Films.
During the release date announcement press meet held today at Hyderabad, Kiran Abbavaram stated, "We have decided to release 'KA' on the 31st of this month for the Diwali festival. Many movies will be released on that day, and the theaters will be competitive. We chose this date thanks to Vamsi Nandipati, who, after watching our film, decided to back it with a good offer. We all believe in the content of 'KA.' Today's audience is selective, booking tickets only if they like the content. Our teaser and songs have received a positive response, creating excitement about the new content. We aim to bring 'KA' to theaters with both commercial elements and strong content."
Kiran further elaborated, "'KA' is set in the 1970s, appealing to both youth and family audiences. The song 'Jathara' is particularly special, with choreography by Vijay Polaki. Although I’m not fond of dancing, everything aligned well for this project, and I’ve received compliments on my performance. The film features an exciting 15-minute action sequence that we hope will impress audiences in theaters. With two weeks left until the release, we plan to drop the trailer on the 22nd and engage in extensive promotion during this time. Icon Star Allu Arjun visited our set on the first day of shooting to wish me success with the film, which was incredibly encouraging. We’re showcasing our content to everyone; no movie is released in any language without presenting the content first. The visuals and sound created by our directors are unprecedented in our cinema. 'KA' is the perfect title for our movie, and viewers will understand why after watching it. I was thrilled when I first heard the story, and I felt the same excitement upon seeing the final cut. Dulquer saw our film and decided to release it in Malayalam, coincidentally on the same date as his film 'Lucky Baskhar.' This timing was unintentional, but I wish success to all films during this festive season."
Director Sandeep stated: "I’m happy that our film 'KA' is set to release on October 31st. Since we first shared the story, Kiran has given us complete freedom. He did not interfere in any aspect, allowing us to create the film as we envisioned. You will experience the same emotions we felt while making it when you watch it in theaters. We crafted a unique storyline and aimed to present it with a fresh screenplay."
Director Sujeeth added: "'KA' is set against the backdrop of the 1970s, a time when information was conveyed by postmen. This film revolves around the life of a postman named Abhinav Vasudev and explores what he did for his special hobby. It reveals why he traveled to a particular village and the events he encountered there. The movie is based on a screenplay, and 'KA' unfolds with a distinctive storytelling style. Since we first discussed the character, Kiran has fully immersed himself in the role. When you watch the film in theaters, you will see Abhinav Vasudev, not Kiran Abbavaram; he has transformed completely into the character."
Producer and distributor Vamsi Nandipati mentioned: "We are releasing 'KA' on October 3qst, and we have complete faith in the movie's content. I am confident that 'KA' will resonate with audiences. People will always watch good content, regardless of competition. We are also planning to premiere the film on the 30th. With the festival holidays approaching, we see it as an advantage. The reason I took on this film is Kiran Abbavaram. Despite intense competition in film distribution, Kiran entrusted the rights to me. After seeing the content, I felt I had undervalued it. While other films are also releasing on the 31st, I hope they all succeed, as we consider ourselves one big film family."
Heroine Tanvi Ram expressed: "I am happy to be part of 'KA' as the heroine. When the directors first pitched the story, they gave us a glimpse of the plot, and later, when they revealed the full script, I became curious about what would happen next. Everyone is talking about how good the content is, and we believed in it from the beginning. Some scenes appeared even better after editing and with the background score. In Malayalam films, songs often get more emphasis, but in this film, I felt very happy watching my dances on screen. I hope 'KA' brings great success to our entire team."
Co-Producer Chinta Rajasekhar Reddy stated: "We are bringing 'KA' for a pan-India release on October 31st. I would like to thank the entire team that worked on this film. You will see a new type of content in our project. Special thanks to Vamsi Nandipati for releasing it in Telugu. My father was supposed to attend this event, but he couldn’t make it due to some commitments. Our entire team is confident about the success of 'KA'."
Cast:
- Kiran Abbavaram
- Nayan Sarika
- Tanvi Raam
Technical Team:
- Editor: Sree Varaprasad
- DOP: Vishwas Daniel, Satish Reddy Masam
- Music: Sam CS
- Production Designer: Sudheer Macherla
- Executive Producer: Chavan
- Creative Producer: Ritikesh Gorak
- Line Producer: KL Madan
- CEO: Rahasya Gorak (KA Productions)
- Costumes: Anusha Punjla
- Makeup: Kovvada Ramakrishna
- Fights: Real Satish, Ram Krishnan, Uyyala Shankar
- Choreography: Polaki Vijay
- VFX Producer: MS Kumar
- VFX Supervisor: Phaniraja Kasturi
- Co-Producers: Chinta Vineesha Reddy, Chinta Rajasekhar Reddy
- Producer: Chinta Gopalakrishna Reddy
- Written and Directed by: Sujith, Sandeep
మంచి కంటెంట్, కమర్షియల్ ఎలిమెంట్స్ కలిపి "క" సినిమాను ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం - హీరో కిరణ్ అబ్బవరం
యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా "క". ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో "క" సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా దీపావళి పండుగ సందర్భంగా ఈ నెల 31న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. "క" సినిమాను తెలుగులో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి, మలయాళంలో హీరో దుల్కర్ సల్మాన్ తన వేఫరర్ ఫిలింస్ పై రిలీజ్ చేయబోతున్నారు. ఈ రోజు "క" సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ ప్రెస్ మీట్ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ - "క" సినిమాను ఈ నెల 31న దీపావళి పండుగ సందర్భంగా రిలీజ్ చేయాలని నిర్ణయించాం. ఆ రోజు చాలా సినిమాలు రిలీజ్ కు వస్తున్నాయి. థియేటర్స్ దగ్గర పోటీ ఉంది. మేము ఈ నెల 31న రిలీజ్ చేయడానికి కారణం మా వంశీ నందిపాటి. ఆయన మూవీ చూసి మంచి ప్రైస్ ఇచ్చి సినిమా రిలీజ్ చేస్తున్నారు. మా అందరికీ "క" సినిమాపై సినిమాపై నమ్మకం ఉంది. ఈ రోజు ఆడియెన్స్ చాలా ఎంపికగా థియేటర్స్ కు వెళ్తున్నారు. కంటెంట్ నచ్చితేనే టికెట్ బుక్ చేసుకుంటున్నారు. మా మూవీ టీజర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఏదో కొత్త కంటెంట్ మూవీలో ఉండబోతోంది అనే వైబ్ క్రియేట్ అయ్యింది. కంటెంట్ తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ కలిపి "క" సినిమాను థియేటర్స్ లోకి తీసుకొస్తున్నాం. తమిళంలో సహా అన్ని భాషల్లో ఈ నెల 31నే రిలీజ్ చేయాలనే ప్లాన్ చేస్తున్నాం. తమిళనాట స్థానిక సినిమాలు ఎక్కువగా ఉన్నందున థియేటర్స్ అందుబాటులో లేవు. అయినా తమిళ్ రిలీజ్ కు ప్రయత్నిస్తున్నాం. "క" సినిమా 70వ దశకం నేపథ్యంతో పీరియాడిక్ కథతో సాగుతుంది. కాబట్టి యూత్ తో పాటు కుటుంబ ప్రేక్షకులు, మీ ఇంట్లోని పెద్ద వాళ్లను కూడా ఆకర్షించే అంశాలుంటాయి. "క" సినిమాలో జాతర సాంగ్ కు స్పెషల్ అప్లాజ్ వస్తోంది. కథ ప్రకారం ఒక జాతర సాంగ్ ఉంటుంది. ఆ పాటను విజయ్ పొలాకీ మాస్టర్ బాగా కొరియోగ్రాఫ్ చేశారు. నాకు డ్యాన్స్ లు పెద్దగా రావు. మంచి ప్రాజెక్ట్ కు అన్నీ కుదురుతాయి అన్నట్లు డ్యాన్స్ లు కూడా ఈ పాటకు బాగా కుదిరాయి. నేను బాగా డ్యాన్స్ చేశాననే ప్రశంసలు వస్తున్నాయి. ఈ చిత్రంలో ఓ ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది. 15 నిమిషాల పాటు సాగే ఈ యాక్షన్ సీక్వెన్స్ కు థియేటర్ లో మంచి రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నాం. సినిమా రిలీజ్ కు ఇంకా రెండు వారాల పైనే సమయం ఉంది. ఈ నెల 22న ట్రైలర్ రిలీజ్ చేస్తున్నాం. మాకున్న ఈ టైమ్ లో మంచి ప్రమోషన్ చేయబోతున్నాం. "క" సినిమా ఫస్ట్ డే షూట్ కు మా లొకేషన్ కు అల్లు అర్జున్ గారు వచ్చి కిరణ్..ఈ సినిమాతో పెద్ద హిట్ కొట్టాలని విశెస్ అందించారు. అల్లు అర్జున్ గారి విశెస్ మాకు ఎంతో హ్యాపీగా అనిపించాయి. మా సినిమా వరకు ప్రతి ఒక్కరికీ కంటెంట్ చూపించే ఇస్తున్నాం. కంటెంట్ చూపించకుండా ఏ లాంగ్వేజ్ కు మూవీ ఇవ్వడం లేదు. "క" సినిమాలో మా డైరెక్టర్స్ క్రియేట్ చేసిన విజువల్స్, సౌండింగ్ చాలా కొత్తగా ఉంటాయి. మన సినిమాలో అలాంటివి చూసి ఉండరు. "క" అనేది మా సినిమాకు యాప్ట్ టైటిల్. సినిమా చూశాక మీకే తెలుస్తుంది. కథ విన్నప్పుడు నేను ఏదైతే ఎగ్జైట్ అయ్యానో అలాంటి ఎగ్జైట్ మెంట్ ఫస్ట్ కాపీ చూసినప్పుడు కూడా కలిగింది. దుల్కర్ గారు మా మూవీని చూసి మలయాళ రిలీజ్ కు తీసుకున్నారు. ఆయన లక్కీ భాస్కర్ సినిమా కూడా ఈ నెల 31న వస్తుందని అనుకోలేదు. ముందు వారి సినిమా డేట్ ఇది కాదు. మా మూవీ కూడా డేట్ అనౌన్స్ చేయలేదు. "క" , లక్కీ భాస్కర్ ఒకే డేట్ కు రావడం అనుకోకుండా జరిగిన విషయం. పండగ సీజన్ కాబట్టి అన్ని సినిమాలు సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.
డైరెక్టర్ సందీప్ మాట్లాడుతూ - మా "క" సినిమా ఈ నెల 31న రిలీజ్ కు వస్తుండటం హ్యాపీగా ఉంది. కథ విన్నప్పటి నుంచి మాకు కిరణ్ గారు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. ఏ విషయంలోనూ ఆయన ఇంటర్ ఫియర్ కాలేదు. మేము ఇమాజిన్ చేసుకున్నట్లు మూవీని రూపొందించాం. కథను తెరకెక్కించే క్రమంలో మేమంతా ఏం ఫీల్ అయ్యామో అదే థియేటర్ లో మీరు అనుభూతి చెందుతారు. యూనిక్ పాయింట్ తో కథ చేశాం. అయితే ఆ కథను సరికొత్త స్క్రీన్ ప్లేతో ప్రెజెంట్ చేయాలని ప్రయత్నించాం. అన్నారు.
డైరెక్టర్ సుజీత్ మాట్లాడుతూ - 70 దశకం నేపథ్యంలో "క" సినిమా సాగుతుంది. అప్పట్లో మనకు సమాచారం ఇచ్చేది పోస్ట్ మ్యాన్. ఆ కాలంలో అభినవ్ వాసుదేవ్ అనే ఓ పోస్ట్ మ్యాన్ జీవితంలో జరిగే కథ ఇది. ఒక ప్రత్యేకమైన హాబీ ఉన్న ఆ పోస్ట్ మ్యాన్ ఆ హ్యాబిట్ కోసం ఏం చేశాడు. ఆ ఊరికి ఎందుకు వెళ్లాల్సివచ్చింది. అక్కడ అతను ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి అనేది ఈ మూవీలో ఆసక్తికరంగా చూపించాం. స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ ఉంది. "క" సినిమా ఒక ప్రత్యేకమైన స్క్రీన్ ప్లేతో సాగుతుంది. మేము కథ చెప్పినప్పటి నుంచి కిరణ్ గారు ఈ క్యారెక్టర్ కోసం బాగా సన్నద్ధమయ్యారు. మీరు థియేటర్ లో సినిమా చూస్తున్నప్పుడు అభినయ వాసుదేవ్ మాత్రమే కనిపిస్తారు. కిరణ్ అబ్బవరం అని అనుకోరు. అంతగా క్యారెక్టర్ లోకి మారిపోయారు కిరణ్ గారు. అన్నారు.
ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి మాట్లాడుతూ - మా "క" సినిమాను ఈ నెల 31న రిలీజ్ చేస్తున్నాం. మూవీ కంటెంట్ మీద పూర్తి నమ్మకం ఉంది. తప్పకుండా "క" సినిమా ప్రేక్షకాదరణ పొందుతుంది. కంటెంట్ బాగున్న సినిమాను ఎంత కాంపిటేషన్ లో అయినా ప్రేక్షకులు చూస్తారు. ఈ నెల 30నే ప్రీమియర్స్ వేయబోతున్నాం. పండుగకు నాలుగు రోజులు సెలవులు వస్తుండటం అడ్వాంటేజ్ అనుకుంటున్నాం. ఈ సినిమా నేను తీసుకునేందుకు కారణం కిరణ్ అబ్బవరం. సినిమా డిస్ట్రిబ్యూషన్ కోసం ఎంతో పోటీ ఉన్నా, కిరణ్ నాకే రైట్స్ ఇప్పించాడు. "క" సినిమా కంటెంట్ చూశాక నేను ఇచ్చింది తక్కువేనని అనిపించింది. ఈ నెల 31న మిగతా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. వారి మూవీస్ కూడా హిట్ కావాలి. మా సినిమా కూడా విజయం సాధించాలి. మేమంతా ఒకటే సినిమా కుటుంబంగా భావిస్తా. అన్నారు.
హీరోయిన్ తన్వీ రామ్ మాట్లాడుతూ - "క" సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండటం హ్యాపీగా ఉంది. దర్శకులు కథ చెప్పినప్పుడు ముందు లైన్ గా చెప్పారు. ఆ తర్వాత ఫుల్ స్క్రిప్ట్ చెప్పినప్పుడు తర్వాత ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ కలిగింది. ఈ సినిమా గురించి అందరూ కంటెంట్ బాగుందని మాట్లాడుతున్నారు. మేము మొదటి నుంచి నమ్మింది కూడా కంటెంట్ నే. కొన్ని సీన్స్ నటించినప్పటి కంటే ఎడిటింగ్ అయ్యాక బీజీఎంతో చూస్తే చాలా బాగా అనిపించాయి. మలయాళంతో చూస్తే తెలుగులో సాంగ్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఈ సినిమాలో నేను చేసిన డ్యాన్సులు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. "క" సినిమా మా టీమ్ అందరికీ మంచి సక్సెస్ ఇస్తుందని ఆశిస్తున్నాం. అన్నారు.
కో ప్రొడ్యూసర్ చింతా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ - మా "క" సినిమాను ఈ నెల 31న పాన్ ఇండియా రిలీజ్ కు తీసుకొస్తున్నాం. మా మూవీకి వర్క్ చేసిన టీమ్ అందరికీ థ్యాంక్స్. ఒక కొత్త కంటెంట్ ను మా చిత్రంలో చూస్తారు. తెలుగులో రిలీజ్ చేస్తున్న వంశీ నందిపాటి గారికి థ్యాంక్స్. ఈ రోజు ఈవెంట్ కు మా నాన్నగారు రావాలి. ఆయన కొన్ని బిజీ వర్క్స్ వల్ల రాలేకపోయారు. మా టీమ్ అంతా "క" సినిమా సక్సెస్ మీద నమ్మకంతో ఉన్నాం. అన్నారు.
నటీనటులు - కిరణ్ అబ్బవరం, నయన్ సారిక, తన్వీ రామ్, తదితరులు
టెక్నికల్ టీమ్
ఎడిటర్ - శ్రీ వరప్రసాద్
డీవోపీస్ - విశ్వాస్ డానియేల్, సతీష్ రెడ్డి మాసం
మ్యూజిక్ - సామ్ సీఎస్
ప్రొడక్షన్ డిజైనర్ - సుధీర్ మాచర్ల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - చవాన్
క్రియేటివ్ ప్రొడ్యూసర్ - రితికేష్ గోరక్
లైన్ ప్రొడ్యూసర్ - కేఎల్ మదన్
సీయీవో - రహస్య గోరక్ (కేఏ ప్రొడక్షన్స్)
కాస్ట్యూమ్స్ - అనూష పుంజ్ల
మేకప్ - కొవ్వాడ రామకృష్ణ
ఫైట్స్ - రియల్ సతీష్, రామ్ కృష్ణన్, ఉయ్యాల శంకర్
కొరియోగ్రఫీ - పొలాకి విజయ్
వీఎఫ్ఎక్స్ ప్రొడ్యూసర్ -ఎంఎస్ కుమార్
వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ - ఫణిరాజా కస్తూరి
కో ప్రొడ్యూసర్స్ - చింతా వినీషా రెడ్డి, చింతా రాజశేఖర్ రెడ్డి
ప్రొడ్యూసర్ - చింతా గోపాలకృష్ణ రెడ్డి
పీఆర్ఓ - జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్)
రచన దర్శకత్వం - సుజీత్, సందీప్
|