pizza

Kaantha - Bhagyashri Borse look
స్పిరిట్ మీడియా & వేఫేరర్ ఫిల్మ్స్, రానా దబ్బుబాటి, దుల్కర్ సల్మాన్ & సెల్వమణి సెల్వరాజ్ మల్టీలింగ్వల్ ఫిల్మ్ 'కాంత'- భాగ్యశ్రీ బోర్సే మెస్మరైజింగ్ ఫస్ట్ లుక్

You are at idlebrain.com > news today >

14 February 2025
Hyderabad

స్టన్నింగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే అప్ కమింగ్ మల్టీలింగ్వల్ ఫిల్మ్ 'కాంత'లో తన మెస్మరైజింగ్ ప్రజెన్స్ తో అలరించడానికి సిద్ధంగా ఉంది, ఇందులో ఆమె దుల్కర్ సల్మాన్ సరసన నటించింది. ప్రేమికుల దినోత్సవం కానుకగా చిత్రనిర్మాతలు ఈ చిత్రం నుండి ఆమె ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు.

ఫస్ట్ లుక్ పోస్టర్‌లో భాగ్యశ్రీ బోర్సే అద్భుతమైన సాంప్రదాయ గులాబీ రంగు చీరలో, క్లాసిక్ బ్యూటీగా కనిపించింది. ఆమె బంగారు ఆభరణాలతో అలంకరించుకోవడం రాయల్ ఎట్రాక్షన్ ని యాడ్ చేసింది. మంత్రముగ్ధమైన చిరునవ్వుతో ఆకట్టుకుంది. ఈ ఫస్ట్ లుక్ లో ఆమె ఒక క్లాసికల్ హీరోయిన్ ఎసెన్స్ ని ప్రజెంట్ చేస్తోంది.

దుల్కర్ సల్మాన్ వేఫేరర్ ఫిల్మ్స్, ప్రఖ్యాత సురేష్ ప్రొడక్షన్స్ సహకారంతో రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా నిర్మాణంలో సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో కాంత రూపొందుతోంది. ఈ చిత్రంలో సముద్రఖని కీలక పాత్ర పోషిస్తున్నారు.

1950ల మద్రాస్ నేపథ్యంలో తెరకెక్కిన "కాంత" ఆ ఎరాలో మానవ సంబంధాలు, సామాజిక, సంక్లిష్టతలను ప్రజెంట్ చేస్తోంది.

ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కాంతా గొప్ప కథ, నటీనటులు, టెక్నికల్ టీంతో మస్ట వాచ్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని అందించబోతోంది.

తారాగణం: దుల్కర్ సల్మాన్, సముద్రఖని, భాగ్యశ్రీ బోర్సే
సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం: సెల్వమణి సెల్వరాజ్
బ్యానర్లు: స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, వేఫేరర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్
నిర్మాతలు: రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - సాయికృష్ణ గద్వాల్
లైన్ ప్రొడ్యూసర్ - శ్రవణ్ పాలపర్తి
DOP - డాని శాంచెజ్ లోపెజ్
ఆర్ట్ డైరెక్టర్ - రామలింగం
రచయిత - తమిళ్ ప్రభ
సంగీతం- జాను
ఎడిటర్ - లెవెల్లిన్ ఆంథోనీ గోన్సాల్వేస్
కాస్ట్యూమ్ డిజైనింగ్: పూజిత తాడికొండ, సంజన శ్రీనివాస్

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved