pizza

I Hope Kalinga achieves substantial success, Says BJP MP Raghunandan Rao at Pre-Release Event
‘కళింగ’ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు

You are at idlebrain.com > news today >

11 September 2024
Hyderabad

Dhruva Vaayu, who earned acclaim with Kerosene, is directing the upcoming film Kalinga, besides acting as hero in it. Produced by Deepthi Kondaveeti and Pruthvi Yadav under the Big Hit Productions banner, the movie has already generated significant buzz with the teaser, posters, glimpses, and songs that captivated audiences. The pre-release event for the film, scheduled to hit theaters on September 13, was held on Tuesday and it was graced by BJP leader and MP Raghunandan Rao as the chief guest.

*Speaking at the event, BJP MP Raghunandan Rao remarked,* "Regardless of how busy one might be, watching movies is a part of our culture that helps relieve the fatigue of daily life. After the pandemic, everyone got accustomed to OTT platforms. The Telugu film industry is now witnessing a surge in experimental films, with smaller movies achieving great success. The teaser and trailer of this film are quite gripping. I hope Kalinga also achieves substantial success, and I wish the best for Dhruva and the producers."

*Dhruva Vaayu shared his thoughts, saying,* "I want to thank BJP leader Raghunandan Rao and my friend Thiruveer for attending our event. For the story I wrote, Yakub provided excellent dialogues. Cameraman Akshay worked tirelessly day and night with me. Editor Naresh has transformed the film beautifully. The visuals are impressive, and the background score by Vishva Shekhar has elevated the film to another level. Thanks to all the lyricists for the great songs. Preethi Sundar has played her dream role in this film. The support of my direction team made this film possible. Sanjay's performance will leave everyone stunned, and he will be seen as both a villain and a hero in big films in the future. Pragya Nayan has perfectly embodied her role, and I anticipate many big offers coming her way after this film. Many people have been asking if this film will be another Kantara or Virupaksha, but it is a completely new concept. Watch the film on September 13th for a new experience."

*Thiruveer commented,* "Writing the story, directing, and acting is no small feat. During the making of Ghazi, Dhruva and I discussed many things. He has written and directed Kerosene and brought profits to the producer. The teaser of Kalinga was quite intimidating. Dhruva has charted his own path. The movie is set to release in over five hundred theaters. Dhruva is an inspiration to all of us. I hope this film brings him more fame and success."

*Producer Deepthi Kondaveeti said,* "The film Kalinga has turned out wonderfully. People are talking about the songs and music, and the magic of the background score must be experienced in theaters. Akshay's visuals are stunning, and Sanju appears as a handsome villain in this film. We wanted Arya from Kerosene to be part of this project as well. We are delighted to have Thiruveer at our event. Yakub has written superb dialogues, and Pragya shines in her role. Her performance is exceptional, and she looks fantastic on screen. Thanks to Dhruva's dedication and passion that we are here today. Pruthvi has worked tirelessly for this film. Kalinga will be released on September 13. Everyone should watch it."

*Producer Pruthvi Yadav stated,* "Thanks to everyone who worked on Kalinga. The film has reached another level with Vishnu Shekhar's background score. Akshay's visuals are outstanding, and Pragya Nayan has been very cooperative. Dhruva Vaayu is the main pillar of this film. Please watch our movie on September 13."

*Pragya Nayan expressed,* "I am eagerly waiting for the release of Kalinga. We have received a great response to the teaser and trailer, with many people praising it. I expect similar positive feedback after the film is released. It has been a pleasure working with such a talented team. Dhruva Vaayu has been very supportive. Our film is set to release on September 13th. Please make sure to watch it."

*Preethi Sundar said,* "It has been a pleasure working with Dhruva Vaayu. This is my second film with Sanjay. Dhruva put in a lot of effort for Kerosene, and he has worked very hard on this film as well. I hope Kalinga becomes a big hit and brings profits and recognition to the director and producers."

*Balagam Sanjay said,* "Kalinga has turned out superbly. Dhruva has brought technicians from all over India. Experience this movie in theaters. We request the media to support our film. Kalinga is releasing on September 13, so please make sure to watch it."

‘కళింగ’ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు

కిరోసిన్ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న ధృవ వాయు ఇప్పుడు ‘కళింగ’తో హీరో మరియు దర్శకుడిగా రాబోతున్నారు. బిగ్ హిట్ ప్రొడక్షన్స్ పతాకంపై దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మించిన ఈ సినిమాపై ఇప్పటికే మంచి బజ్ ఏర్పడింది. టీజర్, పోస్టర్‌లు, గ్లింప్స్, సాంగ్స్ అన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. సెప్టెంబర్ 13న విడుదల కాబోతోన్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ నేత, ఎంపీ రఘునందన్ రావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో..

*బీజేపీ నేత, ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ..* ‘ఎవరు ఎంత బిజీగా ఉన్నా.. రోజంతా ఉన్న అలసటను తీర్చుకోవడానికి సినిమాలు చూడటం అనేది మన కల్చర్‌లో భాగం. కరోనా తరువాత అందరూ ఓటీటీకి అలవాటు పడ్డారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఎక్కువగా ప్రయోగాలు వస్తున్నాయి. చిన్న చిత్రాలు పెద్ద విజయాన్ని సాధిస్తున్నాయి. టీజర్, ట్రైలర్ చూస్తే భయపెట్టించేలా ఉన్నాయి. ఈ మూవీ కూడా భారీ విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాను తీసిన ధృవ, నిర్మాతలకు మంచి లాభాలను రావాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

*ధృవ వాయు మాట్లాడుతూ..* ‘మా కార్యక్రమానికి వచ్చిన బీజేపీ నేత రఘునందన్ రావు, నా ఫ్రెండ్ తిరువీర్‌కు థాంక్స్. నేను రాసిన కథకు.. యాకూబ్ గారు మంచి డైలాగ్స్ ఇచ్చారు. కెమెరామెన్ అక్షయ్ పగలూ రాత్రి అన్న తేడా లేకుండా నాతో పాటు పని చేశారు. ఎడిటర్ నరేష్ సినిమాను అద్భుతంగా మలిచాడు. విజువల్స్ బాగా వచ్చాయి.. వాటికి తగ్గ ఆర్ఆర్ కావాలి. విశ్వ శేఖర ఆర్ఆర్‌తో సినిమా మరో స్థాయికి వెళ్లింది. మంచి పాటలు ఇచ్చిన లిరిసిస్ట్‌కు థాంక్స్. ప్రీతి సుందర్ ఇందులో తన డ్రీమ్ రోల్ పోషించారు. నా డైరెక్షన్ టీం సపోర్ట్ వల్లే ఈ సినిమాను ఇంత బాగా తీయగలిగాను. సంజయ్ నటనను చూసి అంతా షాక్ అవుతారు. ఇకపై పెద్ద చిత్రాల్లో విలన్‌గా, హీరోగా కనిపిస్తాడు. ప్రగ్యా నయన్ తన పాత్రకు పర్‌ఫెక్ట్‌గా సెట్ అయింది. ఈ చిత్రం తరువాత చాలా పెద్ద ఆఫర్లు వస్తాయి. ఈ మూవీ టీజర్, ట్రైలర్ చూసిన చాలా మంది కాంతారనా, విరూపాక్షనా?.. మంగళవారంలా ఉంటుందా? అని అడుగుతున్నారు. కానీ ఇదొక కొత్త కాన్సెప్ట్. సెప్టెంబర్ 13న ఈ చిత్రం చూడండి. చాలా కొత్త ఎక్స్‌పీరియెన్స్ వస్తుంది’ అని అన్నారు.

*తిరువీర్ మాట్లాడుతూ..* ‘కథ రాసి.. డైరెక్టర్ చేసి.. నటించడం అంటే మామూలు విషయం కాదు. ఘాజి సినిమా చేసినప్పుడు మేం ఇద్దరం చాలా విషయాలు మాట్లాడుకునేవాళ్లం. కిరోసిన్ కథను రాసి, దర్శకత్వం చేసి నిర్మాతకు లాభాల్ని తీసుకొచ్చి పెట్టాడు. కళింగ టీజర్ చూసి భయపడ్డాను. తన బాటను తానే నిర్మించుకున్నాడు. కళింగ మూవీని ఐదు వందలకు పైగా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. మా అందరికీ ధృవ స్పూర్తి. సెప్టెంబర్ 13న ఈ చిత్రం రాబోతోంది. ఈ సినిమాతో మా వాడికి మరింత పేరు, డబ్బులు రావాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

*నిర్మాత దీప్తి కొండవీటి మాట్లాడుతూ..* ‘కళింగ సినిమా అద్భుతంగా వచ్చింది. పాటలు, మ్యూజిక్ గురించి అంతా మాట్లాడుకుంటారు. ఆర్ఆర్ మ్యాజిక్‌ను థియేటర్లో చూడాల్సిందే. అక్షయ్ విజువల్స్ అద్భుతంగా ఇచ్చారు. సంజు ఈ చిత్రంలో హ్యాండ్సమ్ విలన్‌గా కనిపిస్తాడు. కిరోసిన్ చేసిన ఆర్యనే ఈ చిత్రానికి కూడా ఉండాలని అనుకున్నాం. మా ఈవెంట్‌కు తిరువీర్ గారు రావడం ఆనందంగా ఉంది. యాకూబ్ గారు అద్భుతంగా డైలాగ్స్ రాశారు. ప్రగ్యా ఈ చిత్రంలో ఎక్సలెంట్‌గా అనిపిస్తుంది. ఆమె కళ్లతోనే నటించింది. లుక్స్ పరంగానూ తెరపై అద్భుతంగా కనిపిస్తుంది. ధృవ గారి డెడికేషన్, ప్యాషన్ వల్లే మేం ఈ రోజు ఇక్కడ ఉన్నాం. పృథ్వీ గారు ఈ చిత్రం కోసం ప్రాణం పెట్టి పని చేశారు. సెప్టెంబర్ 13న మా సినిమా రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

*నిర్మాత పృథ్వీ యాదవ్ మాట్లాడుతూ..* ‘కళింగ సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. విష్ణు శేఖర్ ఇచ్చిన ఆర్ఆర్‌తో సినిమా వేరే లెవెల్‌కు వెళ్లింది. అక్షయ్ విజువల్స్ అద్భుతంగా ఉంటాయి. ప్రగ్యా నయన్ మాకు ఎంతో సహకరించింది. ధృవ వాయు ఈ చిత్రానికి మెయిన్ పిల్లర్. సెప్టెంబర్ 13న రాబోతోన్న మా చిత్రాన్ని అందరూ చూడండి’ అని అన్నారు.

*ప్రగ్యా నయన్ మాట్లాడుతూ..* ‘కళింగ రిలీజ్ కోసం చాలా ఎదురుచూస్తున్నా.మా టీజర్, ట్రైలర్‌లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అందరూ ఫోన్ చేసి ప్రశంసించారు. సినిమా చూశాక కూడా అలాంటి కాల్స్ వస్తాయి. నా పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇంత మంచి టీంతో పని చేయడం ఆనందంగా ఉంది. ధృవ వాయు ఎంతో సపోర్టివ్‌గా ఉన్నారు. సెప్టెంబర్ 13న మా చిత్రం రాబోతోంది. అందరూ చూడండ’ అని అన్నారు.

*ప్రీతి సుందర్ మాట్లాడుతూ..* ‘ధృవ వాయుతో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. సంజయ్‌తో ఇది నాకు రెండో చిత్రం. కిరోసిన్‌కు ఎంత కష్టపడ్డాడో ధృవ వాయు ఈ చిత్రానికి చాలా కష్టపడ్డాడు. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి. దర్శక, నిర్మాతలకు ఈ చిత్రం లాభాలు చేకూర్చడంతో పాటు, మంచి పేరు కూడా రావాలి’ అని అన్నారు.

*బలగం సంజయ్ మాట్లాడుతూ..* ‘కళింగ అద్భుతంగా వచ్చింది. ధృవ గారు ఆల్ ఓవర్ ఇండియా నుంచి టెక్నీషియన్లను తీసుకొచ్చారు. ఈ మూవీని థియేటర్లో ఎక్స్‌పీరియెన్స్ చేయండి. మా సినిమాకు సపోర్ట్ చేయాలని మీడియాని కోరుతున్నా. సెప్టెంబర్ 13న మా చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved