pizza

It is a great honour to be a part of 'Kalki 2898 AD'. Director Nag Ashwin has done a great job with his vision. This experience will be with me forever : Bollywood Megastar Amitabh Bachchan at Grand Pre release Event
'కల్కి 2898 AD’ లో పార్ట్ అవ్వడం గ్రేట్ హానర్. డైరెక్టర్ నాగ్ అశ్విన్ తన విజన్ తో మహా అద్భుతంగా తీశారు. కల్కి ఎక్స్ పీరియన్స్ ని ఎప్పటికీ మర్చిపోలేను: గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్

You are at idlebrain.com > news today >

19 June 2024
Hyderabad

Rebel Star Prabhas, Director Nag Ashwin’s highly much-awaited global project Kalki 2898 AD is nearing its release and the makers have already began the full fledged promotions across India.
With stellar responses for Introducing Bujji event, Bhairava x Bujji prelude, Trailer and the latest sensational Bhairava Anthem. The team has today organized the pre release event in Mumbai .

While, Rana Daggubati hosted the event, The main cast Amitabh Bachchan, Kamal Hassan, Prabhas along with Deepika Padukone attended the event and made it another successful event.

Speaking at the pre-release event, Bollywood megastar Amitabh Bachchan said: t is a great honor to be a part of Kalki 2898 AD. A truly wonderful experience. This is a new world. A film like this has never been made before. Congratulations to Nag Ashwin and all the team for imagining of such a film. I was very surprised when Nagi told me this story. He seemed to be able to solve such a story if he drank anything. The visuals in it are unbelievable. Taking on such a futuristic project is amazing. He presented his vision wonderfully on screen. I will never forget the Kalki experience’.

Ulaga Nayagan Kamal Haasan said: Nag Ashwin is an extraordinary man who looks ordinary like our teacher Balachander Garu. Nag Ashwin has a knack of presenting his idea brilliantly. I will be seen as a bad man in this and It's going to be fun. Nag Ashwin presented very differently. Everyone will be very surprised after seeing the movie, just like seeing my first look',

Rebel star Prabhas said.: Thank you to Dutt garu and Nagi for giving me the opportunity to work with the greatest legends. It's bigger than a dream. Amitabh is the first actor to reach the entire country. After watching Kamal Sir Sagara sangamam, I asked my mother to dress like Kamal Haasan. Also, I used to wraps a cloth around the stomach and acts like him by seeing indrudu chandrudu. Acting with such legends is unbelievable. Also, Deepika is a star who has reached the international level. Acting with Deepika was a beautiful experience. Thank you to everyone.

Heroine Deepika Padukone said.. Kalki is a wonderful experience. A complete new world. This is the magic created by director Nagi. It was a wonderful experience as an actor as a professional. Nagi is a genius. His vision is very clear. The film has been shot wonderfully’.

Producer Ashwini Dutt said: Amitabh Bachchan, Kamal Haasan, Prabhas and Deepika are all here and it is a great pleasure to celebrate this event in the presence of everyone. I want this film to be a great success’.

The ceremony was held in a grand manner with the participation of all the members of the 'Kalki 2898 AD' unit.

'కల్కి 2898 AD’ లో పార్ట్ అవ్వడం గ్రేట్ హానర్. డైరెక్టర్ నాగ్ అశ్విన్ తన విజన్ తో మహా అద్భుతంగా తీశారు. కల్కి ఎక్స్ పీరియన్స్ ని ఎప్పటికీ మర్చిపోలేను: గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్

మోస్ట్ ఎవైటెడ్ అప్ కమింగ్ సైన్స్ ఫిక్షన్ ఎపిక్ ‘కల్కి 2898 AD’, విజనరీ ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ విజువల్ వండర్ లో ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటానీ నటిస్తున్నారు. వైజయంతీ మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఫెంటాస్టిక్ ప్రమోషనల్ కంటెంట్ తో గ్లోబల్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్స్ కి గ్రౌండ్ బ్రేకింగ్ రెస్పాన్స్ వచ్చింది. 'భైరవ అంథమ్' ఇండియన్స్ బిగ్గెస్ట్ సాంగ్ అఫ్ ది ఇయర్ గా టాప్ చార్ట్ లో వుంది. ఈ మల్టీలింగ్వెల్, మైథాలజీ -ఇన్స్ స్పైర్డ్ సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో మేకర్స్ ముంబై లో గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో కల్కి టీంతో హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి ఇంటరాక్షన్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.

ప్రీరిలీజ్ ఈవెంట్ లో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ.. కల్కి 2898 AD’ లో పార్ట్ అవ్వడం గ్రేట్ హానర్. ట్రూలీ వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్. ఇది ఓ కొత్త ప్రపంచం. ఇలాంటి సినిమా గతంలో ఎప్పుడూ చేయలేదు. ఇలాంటి సినిమాని అలోచించిన నాగ్ అశ్విన్ కి, టీం అందరికీ అభినందనలు. నాగి ఈ కథ చెప్పినపుడు చాలా ఆశ్చర్యపోయాను. అసలు ఏం డ్రింక్ చేస్తే ఇలాంటి కథని అలోజించగలిగాడనిపించింది. ఇందులో వున్న విజువల్స్ అన్ బిలివబుల్. ఇలాంటి ఫ్యుచరిస్టిక్ ప్రాజెక్ట్ ని తీయడం మహా అద్భుతం. తను అనుకున్న విజన్ ని వండర్ ఫుల్ గా స్క్రీన్ పై ప్రజెంట్ చేశారు. కల్కి ఎక్స్ పీరియన్స్ ని ఎప్పటికీ మర్చిపోలేను' అన్నారు

ఉలగ నాయగన్ కమల్ హాసన్ మాట్లాడుతూ.. నాగ్ అశ్విన్ మా గురువు గారు బాలచందర్ గారిలా ఆర్డీనరిగా కనిపించే ఎక్స్ ట్రార్డినరీ మ్యాన్. తన ఐడియాని అద్భుతంగా ప్రజెంట్ చేసే నేర్పు నాగ్ అశ్విన్ కి వుంది. ఇందులో బ్యాడ్ మ్యాన్ గా ప్లే చేస్తా. ఇట్స్ గోయింగ్ టు బి ఫన్. నాగ్ అశ్విన్ చాలా డిఫరెంట్ గా ప్రజెంట్ చేశారు. నా ఫస్ట్ లుక్ చూసి సర్ ప్రైజ్ అయినట్లే సినిమా చూసి కూడా చాలా సర్ ప్రైజ్ అవుతారు' అన్నారు

రెబల్ స్టార్ ప్రభాస్ మాట్లాడుతూ.. గ్రేటెస్ట్ లెజెండ్స్ తో వర్క్ చేసే అవకాశం ఇచ్చిన దత్తు గారు, నాగీ గారికి థాంక్ యూ. ఇట్స్ బిగ్గర్ దెన్ డ్రీం. అమితాబ్ గారు కంట్రీ మొత్తం రీచ్ అయిన ఫస్ట్ యాక్టర్. కమల్ సార్ సాగరసంగమం చూసి కమల్ హాసన్ గారి లాంటి డ్రెస్ కావాలని మా అమ్మని అడిగాను. అలాగే ఇంద్రుడు చంద్రుడు చూసి కడుపులో క్లాత్ చుట్టుకొని ఆయనలానే యాక్ట్ చేసేవాడిని. అలాంటి లెజెండ్స్ తో యాక్ట్ చేయడం అన్ బిలివబుల్. అలాగే దీపిక ఇంటర్నేషనల్ లెవల్ కి రీచ్ అయిన స్టార్. దీపికతో నటించడం బ్యూటీఫుల్ ఎక్స్ పీరియన్స్. అందరికీ థాంక్ యూ' అన్నారు.

హీరోయిన్ దీపికా పదుకొనే మాట్లాడుతూ.. కల్కి వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్. కంప్లీట్ న్యూ వరల్డ్. డైరెక్టర్ నాగీ క్రియేట్ చేసిన మ్యాజిక్ ఇది. యాక్టర్ గా ప్రొఫెషనల్ గా ఇది అద్భుతమైన ఎక్స్ పీరియన్స్. నాగీ జీనియస్. తన విజన్ చాలా క్లియర్ గా వుంటుంది. సినిమాని అద్భుతంగా తీశారు' అన్నారు

ప్రొడ్యూసర్ అశ్విని దత్ మాట్లాడుతూ.. అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారు, ప్రభాస్, దీపిక నలుగురూ ఇక్కడ వుండటం, అందరి సమక్షంలో ఈ ఈవెంట్ జరుపుకోవడం చాలా ఆనందంగా వుంది. ఈ సినిమా గ్రేట్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను' అన్నారు. 'కల్కి 2898 AD’ యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved