pizza

'Ho Egire' lyrical video from 'Kalyanam Kamaneeyam' released
"కళ్యాణం కమనీయం" చిత్రం నుంచి "హో ఎగిరే" లిరికల్ సాంగ్ రిలీజ్

You are at idlebrain.com > news today >
Follow Us

29 December 2022
Hyderabad

Young hero Santosh Shoban is doing 'Kalyanam Kamaneeyam'. Kollywood star Priya Bhavani Shankar is its heroine. With this Sankranthi release, she is making a strong foray into Telugu cinema. UV Concepts is producing this awaited movie. An engaging and content-driven film dealing with marriage and associated issues, the film is directed by debutant Anil Kumar Aalla. The film will be released in theatres on January 14, 2023.

'Ho Egire', a song from the movie, was released today. Krishna Kantha has written it. Shravan Bharadwaj's composition is joined by Kapil Kapilan's singing.

Here is how the song unfolds:
'ఓ కాటుక కన్నే, కన్నే.. మీటెను నన్నే, కాటుక కన్నే కన్నే దాచెను నన్నే'

The film's title motion poster, first look received applause recently. The songs have been released one at a time. Going by the first song 'Oh Manasa' and now this song, the lyrics and music will click with the listeners. The film has been made as a complete famil entertainer.

"కళ్యాణం కమనీయం" చిత్రం నుంచి "హో ఎగిరే" లిరికల్ సాంగ్ రిలీజ్

యువ హీరో సంతోష్ శోభన్ నటిస్తున్న కొత్త సినిమా "కళ్యాణం కమనీయం". ఈ చిత్రంలో కోలీవుడ్ తార ప్రియ భవానీ శంకర్ నాయికగా నటిస్తోంది. ఈ చిత్రంతో ఆమె టాలీవుడ్ అరంగేట్రం చేస్తోంది. ఈ చిత్రాన్ని యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మిస్తోంది. పెళ్లి నేపథ్యంతో సాగే ఆహ్లాదకర కథతో నూతన దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల రూపొందిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

తాజాగా కళ్యాణం కమనీయం సినిమా నుంచి "హో ఎగిరే" అనే లిరికల్ పాటను విడుదల చేశారు. ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించారు. శ్రావణ్ భరద్వాజ్ కంపోజ్ చేయగా కపిల్ కపిలన్ పాడారు. ఓ కాటుక కన్నే, కన్నే.. మీటెను నన్నే, కాటుక కన్నే కన్నే దాచెను నన్నే...అంటూ ఓ యువ జంట మధ్య ప్రేమను వ్యక్తపరుస్తూ సాగిందీ పాట

ఇటీవలే రిలీజైన ఈ చిత్ర టైటిల్ మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ కు మంచి స్పందన వస్తోంది. లిరికల్ సాంగ్స్ ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఈ పాటలు అందమైన సంగీత సాహిత్యాలతో ఆకట్టుకుంటున్నాయి. యూవీ కాన్సెప్ట్స్ నుంచి మరో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ రాబోతోంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2022 Idlebrain.com. All rights reserved