Actor Shraddha Das, who is not only known for beautiful screen presence as an amazing actress, is now also lending her vocals as a professional playback singer. We have seen Shraddha Das in movies such as Arya 2, PSV Garuda Vega among others. Now, audiences are getting to know her as a singer.
Debuting as a singer, Shraddha Das' voice can be heard in a cozy song giving her voice to a peppy number in the upcoming Pan India movie, Kanguva. Kanguva needs no introduction as it stars Suriya, Disha Patani, Bobby Deol and is ready for a world wide release on November 14, 2024. The period drama has already created much excitement and anticipation among the audience.
Meanwhile, the song Yolo’s has further increased the anticipation presenting Suriya and Disha Patani in a refreshing look accompanied by the catchy tunes from the Rockstar Devi Sri Prasad.
The song which has already raked millions of views on YouTube is also gaining fans appreciation for its fresh composition and vocals. The song was sung by Devi Sri Prasad, Shraddha Das, Sagar, while the lyrics were composed by Rakendu Mouli.
Shraddha Das’s beautiful voice is already gaining hearts. Appreciating Shraddha and other singers, one of the fans commented, “Shraddhadas + DSP + Sagar’s combination is equal to love.”
Meanwhile, in a recent concert held in Hyderabad’s Gachibowli, Shraddha Das has also captivated the audience by singing more than four to five songs along with the Rockstar Devi Sri Prasad and wowed the audience.
సూర్య ‘కంగువా’ చిత్రంలో పాట పాడిన హీరోయిన్ శ్రద్దా దాస్
నటిగా శ్రద్దా దాస్‌కి మంచి పేరు ఉంది. ఇక ఇప్పుడు ఆమె ప్రొఫెషనల్ ప్లేబ్యాక్ సింగర్‌గా మారిపోయారు. ఇప్పుడు ఆమెను గాయనిగా ప్రేక్షకులకు దేవీ శ్రీ ప్రసాద్ పరిచయం చేస్తున్నారు. సూర్య నటించిన పాన్ ఇండియా చిత్రం కంగువాలో శ్రద్దా దాస్ ఓ పెప్పీ సాంగ్‌ను ఆలపించారు. సూర్య, దిశా పటాని, బాబీ డియోల్ వంటి భారీ తారాగణంతో తెరకెక్కించిన ఈ చిత్రం నవంబర్ 14న రిలీజ్ కాబోతోన్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే కంగువా చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. కంగువా నుంచి వచ్చిన యోలో పాట అందరినీ అలరించింది. యూట్యూబ్‌లో ఇప్పటికే మిలియన్ల వ్యూస్ సాధించింది. దేవి శ్రీ ప్రసాద్, శ్రద్ధా దాస్, సాగర్ గాత్రం ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రాకేందు మౌళి సాహిత్యం అందరినీ ఆకట్టుకుంది.
యోలో పాటలోని శ్రద్ధా దాస్ గాత్రం అందరినీ ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉంటే, ఇటీవల హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో జరిగిన మ్యూజికల్ ఈవెంట్‌లో రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్‌తో కలిసి శ్రద్ధాదాస్ పాటలను పాడి ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.