pizza

Introducing Ariaana and Viviana From Vishnu Manchu’s Kannappa
అరియానా, వివియానా పుట్టిన రోజు సందర్భంగా పాత్రలని పరిచయం చేసిన ‘కన్నప్ప’ టీం

You are at idlebrain.com > news today >

02 December 2024
Hyderabad

The highly anticipated crazy Pan-India project Kannappa, starring Vishnu Manchu in the titular role, is set to release on April 25, 2025. Directed by Mukesh Kumar Singh, the film features an ensemble cast and is backed by a team of seasoned technicians.

As part of their promotional strategy, the makers are unveiling first-look posters and other updates on Mondays. Today, they revealed the first look of Ariaana Manchu and Viviana Manchu from the movie. Coincidentally, today also marks the birthday of Vishnu Manchu’s twin daughters.

The new posters highlight the twin girls in tribal attire, enacting Lord Shiva’s iconic pose. The tagline "Whether it is singing or dancing, it is all for Lord Shiva," hints at the pivotal roles they play in the film, where they appear in a song that explores the story and significance of Sri Kalahasti and its legend.

Vishnu Manchu expressed his joy in sharing the first look of his daughters on their birthday, saying his heart swells with pride. "I can't wait for everyone to witness the magic my little mommies create on screen," he said.

The star-studded cast of Kannappa also includes Mohan Babu, Sarath Kumar, Arpit Ranka, Prabhas, Akshay Kumar, Mohanlal, and Kajal Aggarwal in significant roles.

అరియానా, వివియానా పుట్టిన రోజు సందర్భంగా పాత్రలని పరిచయం చేసిన ‘కన్నప్ప’ టీం

డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘కన్నప్ప’ చిత్రం నుంచి వస్తున్న ప్రతీ అప్డేట్ ఆడియెన్స్‌లో అంచనాలు పెంచేస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. అత్యంత భారీ క్రేజీ పాన్-ఇండియా ప్రాజెక్ట్ అయిన ఈ ‘కన్నప్ప’ ఏప్రిల్ 25, 2025న విడుదల కానుంది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సంబంధించిన మరో అప్డేట్‌ను సోమవారం నాడు రిలీజ్ చేశారు.

కన్నప్ప ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రతీ సోమవారం ఓ అప్డేట్ ఇస్తామని మేకర్లు ఇది వరకు ప్రకటించారు. ఇందులో భాగంగా విష్ణు మంచు పిల్లలు అరియానా మంచు, వివియానా మంచు ఫస్ట్ లుక్‌లను విడుదల చేశారు. అంతే కాకుండా ఈ రోజు విష్ణు మంచు కవల కుమార్తెల పుట్టినరోజులు కావడం కూడా విశేషం.

ఈ పోస్టర్‌లో పిల్లలిద్దరూ గిరిజన వేషధారణలో చాలా డిఫరెంట్‌గా కనిపిస్తున్నారు. శ్రీ కాళహస్తి పురాణ కథ ప్రాముఖ్యతను చాటి చెప్పే పాటలో కనిపించనున్నారు. ‘పాట పాడినా, నృత్యం చేసినా, ఇది శివుని కోసం’ అని ఈ పోస్టర్‌లో చూపించారు.

ఈ మేరకు విష్ణు మంచు పోస్ట్ చేస్తూ.. ‘పుట్టినరోజు సందర్భంగా నా కుమార్తెల ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. ఈ క్షణంలో నా హృదయం గర్వంతో ఉప్పొంగుతోంది. నా చిన్ని తల్లులు తెరపై సృష్టించే మ్యాజిక్‌ను చూసేందుకు నేను ఎంతగానో ఎదురుచూస్తున్నాను’ అని అన్నారు.

ఇది వరకు కన్నప్ప నుంచి అవ్రామ్ లుక్‌ను కూడా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మోహన్ బాబు, శరత్ కుమార్, అర్పిత్ రాంక, ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, బ్రహ్మానందం, ముఖేష్ రిషి, సప్తగిరి వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved