Carrying forward the legacy of the Manchu family, young Avram Manchu is making his debut as Jr Thinnadu in the highly anticipated pan-India epic, Kannappa. This film, the dream project of Vishnu Manchu, recently unveiled its trailer to an overwhelmingly positive response from audiences and critics alike. The trailer opens with the glimpses of Thinnadu’s childhood, showcasing Avram’s performance, which has already won many hearts.
To further build anticipation, the makers released a making video, offering a behind-the-scenes look at Avram’s journey into the character. From his physical transformation and training sessions to his on-set performances, the video gives a touching insight into his dedication and discipline at such a young age. What stood out most was Avram’s display of humility and respect, values clearly instilled in him by his family. He is seen seeking blessings from the film’s director, the action choreographer, and notably his grandfather, actor-producer Mohan Babu.
A particularly heartwarming moment captures Vishnu Manchu personally dressing his son in costume, with his wife, Viranica Manchu, standing by in support. The video ends with Avram's innocent antics, like playfully handling a bow, reminding viewers of his endearing childlike spirit amid the grandeur of the epic. He indeed amazes with his energy.
Shot primarily in the breathtaking landscapes of New Zealand, the behind-the-scenes footage also highlights the film’s ambitious scale and visual richness.
Vishnu Manchu’s daughters, Ariaana and Viviana, also play roles in the film. The star-studded cast includes powerhouses such as Mohan Babu, Prabhas, Akshay Kumar, Mohanlal, Preity Mukundan, Kajal Aggarwal, Sarathkumar, and Arpit Ranka.
Directed by Mukesh Kumar Singh and produced by Mohan Babu under the banners of AVA Entertainment and 24 Frames Factory, Kannappa is slated for a grand theatrical release on June 27.
విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో విడుదల
డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ జూన్ 27న విడుదల కాబోతోంది. ఇప్పటికే ఉవ్వెత్తున విష్ణు మంచు ప్రచార కార్యక్రమాల్ని చేపట్టారు. ‘కన్నప్ప’ని దేశ వ్యాప్తంగా ప్రచారం చేస్తూ విష్ణు మంచు ఎంతో బిజీగా ఉన్నారు. ఇలాంటి సమయంలో విష్ణు ఓ ఎమోషనల్ ట్వీట్ వేశారు. తన తనయుడు అవ్రామ్ మంచు తెరంగేట్రం గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ‘కన్నప్ప’ చిత్రంలో మోహన్ బాబు, విష్ణు మంచు, విష్ణు మంచు కొడుకు అవ్రావ్, కుమార్తెలు అరియానా -వివియానా నటించడం ఓ రేర్ ఫీట్. ఇలా మూడు తరాలు కలిసి నటించిన అతి కొద్ది ప్రముఖ చిత్రాల్లో ‘కన్నప్ప’ నిలిచింది.
అవ్రామ్ ‘కన్నప్ప’ చిత్రంలో తిన్నడు చిన్నప్పటి పాత్రలో కనిపిస్తారు. ట్రైలర్లోనూ అవ్రామ్కు సంబంధించిన సీన్లు ఉన్నాయి. ఇక ఈ పాత్రకు సంబంధించిన మేకింగ్ వీడియోని విష్ణు మంచు షేర్ చేశారు. ‘‘కన్నప్ప’తో నా తనయుడు అవ్రామ్ తెరంగేట్రం చేస్తున్నారు. అవ్రామ్ సెట్లోకి అడుగు పెట్టడం, కెమెరా ఎదుట నిల్చోవడం, డైలాగ్స్ చెప్పడం.. ఇలా ప్రతీదీ నా జీవితంలో భావోద్వేగపూరితమైన క్షణాలు. ఓ తండ్రిగా, ఒకప్పుడు నేను కలలుగన్న అదే ప్రపంచంలోకి నా తనయుడు అడుగు పెట్టడం చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ క్షణంలో నేను అనుభవిస్తున్న ఆనందానికి ఏదీ సాటి రాదు.. ఇది అవ్రామ్ తెరంగేట్రం మాత్రమే కాదు.. నా జీవితాంతం గుర్తుండిపోయే ఓ మధుర జ్ఞాపకం. నాపై చూపించిన ప్రేమాభిమానాలే నా కుమారుడిపైనా చూపిస్తారని భావిస్తున్నాను. అవ్రామ్ ప్రయాణం ‘కన్నప్ప’తో మొదలైంది’ అని విష్ణు ట్వీట్ వేశారు.
అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద డా. ఎం. మోహన్ బాబు నిర్మాతగా ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో ‘కన్నప్ప’ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాలో అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు, ప్రభాస్, బ్రహ్మానందం వంటి దిగ్గజ నటులు ముఖ్య పాత్రల్ని పోషించారు. జూన్ 27న కన్నప్ప చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది.