pizza

Introducing Preity Mukhundhan As Nemali From The Highly-anticipated Pan India Film Kannappa
కన్నప్ప నుంచి హిరోయిన్ ప్రీతి ముఖుంధన్ పోస్టర్ రిలీజ్.. క్యూరియాసిటీ పెంచేసిన టీం..

You are at idlebrain.com > news today >

30 December 2024
Hyderabad

Building on the positive Monday sentiment, the makers of the highly anticipated Pan-India film Kannappa, starring the dynamic Vishnu Manchu, have unveiled Preity Mukundhan as Nemali.

A character full of grace and beauty, Nemali is also defined by her bold courage, extraordinary capacity for love, and unwavering devotion. She is the heart and soul of Kannappa, embodying the strength of a young queen, whose profound loyalty and compassion shine through. The first-look poster showcases Preity Mukhundhan in all her glamorous glory, leaving audiences eager to see more of this captivating character.

With a star-studded cast featuring Mohan Babu, Prabhas, Akshay Kumar, Mohanlal, Sarath Kumar, Arpit Ranka, and Kajal Aggarwal, Kannappa is based on a true and inspiring story that is sure to resonate with audiences.

Directed by Mukesh Kumar Singh, the film promises to deliver an action-packed experience with breathtaking VFX. Scheduled for a grand release on April 25, 2025, Kannappa is poised to be the biggest summer blockbuster of the year.

కన్నప్ప నుంచి హిరోయిన్ ప్రీతి ముఖుంధన్ పోస్టర్ రిలీజ్.. క్యూరియాసిటీ పెంచేసిన టీం..

డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ నుంచి ప్రతీ సోమవారం ఒక అప్డేట్ వస్తుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. చెప్పినట్టుగానే ఈ భారీ ప్రాజెక్టు నుంచి ప్రతీ సోమవారం ఓ కీలక అప్డేట్‌ వదులుతున్నారు. సినిమాలోని విభిన్న పాత్రలను పోషించిన దిగ్గజ నటీనటుల పోస్టర్‌లను రిలీజ్ చేస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి మోహన్ బాబు, మోహన్ లాల్, మధుబాల, శరత్ కుమార్, దేవరాజ్ వంటి వారు పోషించిన పాత్రల పోస్టర్స్ రిలీజ్ చేసి అంచనాలు పెంచిన కన్నప్ప టీం.. తాజాగా మరో బ్యూటిఫుల్ పోస్టర్ వదిలింది.

ఈ సినిమాలో హీరోయిన్ ప్రీతి ముఖుంధన్ రోల్ ఎలా ఉండబోతుందో తెలుపుతూ తాజాగా బ్యూటిఫుల్ పోస్టర్ రిలీజ్ చేశారు. కన్నప్పలో ఆమె నెమలిగా కనిపించబోతుంది. అందంలో సహజం, తెగింపులో సాహసం, ప్రేమలో అసాధారణం, భక్తిలో పారవశ్యం, కన్నప్పను సర్వస్వం, చెంచు యువరాణి నెమలి అంటూ తాజాగా వదిలిన ఈ పోస్టర్ పై రాసిన పదాలు ఈ క్యారెక్టర్ పట్ల క్యూరియాసిటీ పెంచుతున్నాయి. విడుదల చేసిన కాసేపట్లోనే ఈ పోస్టర్ వైరల్ గా మారింది.

కన్నప్ప చిత్రంలో డా.మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్, బ్రహ్మానందం, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ లాంటి భారీ తారాగణం నటిస్తుంది. ఎంతో అంకితభావంతో విష్ణు మంచు కన్నప్ప పాత్రను పోషిస్తున్నారు. మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నారు. "కన్నప్ప" సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చే విజువల్ వండర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ధైర్యవంతుడైన యోధుడు శివుని భక్తుడైన కన్నప్ప కథను అద్భుతంగా మలుస్తున్న చిత్ర యూనిట్.. ఏప్రిల్ 25, 2025న ఈ సినిమాను రిలీజ్ చేయబోతోంది.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved