Kantara Chapter 1 joins ₹500 crores club in just one week.
బాక్సాఫీస్ దగ్గర ప్రకంపనలు సృష్టిస్తున్న 'కాంతార చాప్టర్ 1'.. వారం లోనే 500 కోట్లకు పైగా వసూళ్లు
The film, which opened to highly positive talk right from day one, is racing ahead with massive collections. Directed and acted by Rishab Shetty himself, Kantara Chapter 1 is produced by Hombale Films, with music composed by Ajaneesh Loknath. Actress Rukmini Vasanth, who played the female lead, has added great strength to the film with her performance.
The production house officially released the film’s box office report — revealing that within just a week of release, Kantara Chapter 1 grossed over ₹509 crores worldwide. The film is performing exceptionally well overseas too, grossing an impressive $3.2 million in North America alone.
బాక్సాఫీస్ దగ్గర ప్రకంపనలు సృష్టిస్తున్న 'కాంతార చాప్టర్ 1'.. వారం లోనే 500 కోట్లకు పైగా వసూళ్లు
బాక్సాఫీస్ దగ్గర 'కాంతార చాప్టర్1' ప్రకంపనలు సృష్టిస్తోంది. విడుదలైన రోజు నుండే పాజిటివ్ టాక్ రావడంతో భారీ కలక్షన్ల దిశగా ఈ సినిమా దూసుకుపోతుంది. స్వీయ దర్శకత్వంలో రిషబ్ శెట్టి నటించిన 'కాంతార చాప్టర్ 1' సినిమాను 'హోంబాలే ఫిలిమ్స్' సంస్థ నిర్మించగా, ఈ సినిమాకు అజనీష్ లోక్ నాథ్ సంగీతాన్ని అందించడం జరిగింది. ఈ సినిమాలో కథానాయికగా నటించిన రుక్మిణీ వసంత్ తన అభినయంతో ఈ సినిమాకు అదనపు బలమయ్యారనే చెప్పుకోవచ్చు. తాజాగా ఈ చిత్ర నిర్మాణ సంస్థ 'కాంతార చాప్టర్ 1' కలక్షన్ల వివరాలను అధికారికంగా విడుదల చేసింది. విడుదలైన వారం రోజుల్లోనే ఈ చిత్రం 509 కోట్లకు పైగా గ్రాస్ సాధించినట్టు ఆ సంస్థ తెలిపింది. విదేశాల్లో సైతం ఈ చిత్రం అదిరిపోయే కలక్షన్లు రాబట్టుకుంటుంది. ఒక్క నార్త్ అమెరికాలోనే ఈ చిత్రం 3.2 మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించడం గమనార్హం.