Kanya Kumari trailer launch
కన్యా కుమారి ట్రైలర్ లో హిట్ వైబ్ కనిపించింది. కచ్చితంగా ఇది చాలా మంచి సినిమా అవుతుంది: ప్రీరిలీజ్& ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ
ప్రముఖ నటి మధు శాలిని ప్రెజెంటర్‌గా రూరల్ లవ్ స్టొరీ "కన్యా కుమారి" చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. రాడికల్ పిక్చర్స్ బ్యానర్‌పై సృజన్ అట్టాడ రచన, దర్శకత్వం, నిర్మాతగా రూపొందించిన ఈ చిత్రంలో గీత్ సైని, శ్రీచరణ్ రాచకొండ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం ఆగస్టు 27న వినాయక చవితి సందర్భంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ..అందరికీ గుడ్ ఈవెనింగ్. మధు ఎప్పటినుంచో నాకు తెలుసు. తను ఒక సినిమాని ప్రజెంట్ చేస్తుందంటే తప్పకుండా అందులో కంటెంట్ ఉంటుంది. టీజర్ చూసిన వెంటనే ఈవెంట్ కి రావాలని అనుకున్నాను. ఈ సినిమా టీజర్ చూడగానే రైటింగ్ ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. టీజర్ లో వైబ్ వుంది.కచ్చితంగా బాగుంటుందనే ఫీలింగ్ కలిగింది. టీజర్ చాలా ఆర్గానిక్ గా అనిపించింది. శ్రీ చరణ్, గీత్ పెర్ఫార్మన్స్ చాలా ఆర్గానిక్ గా ఉంది. క్యారెక్టర్స్ లో ఒదిగిపోయారు. టీజర్ ట్రైలర్ చాలా నచ్చాయి. కచ్చితంగా ఇది చాలా మంచి సినిమా అవుతుందని నమ్మకం కలిగింది. ఆగస్టు 27న అందరూ థియేటర్స్ కి వచ్చి సినిమాని ఎంకరేజ్ చేయాలి. టీమ్ అందరికీ కంగ్రాజులేషన్స్.
డైరెక్టర్ శశి కుమార్ తిక్క మాట్లాడుతూ.. శాలినితో గూడచారి సినిమాకి వర్క్ చేసాం. తన కాలికి గాయమైనప్పటికీ కూడా యాక్షన్ సీక్వెన్స్ చేసింది. నిజంగా తన ఒక ఫైటర్. ఎన్ని వచ్చినా జీవితంలో ఫైట్ చేయాలనేది ఆమె దగ్గర నేర్చుకున్నాను. ట్రైలర్ నాకు చాలా నచ్చింది. శ్రీ చరణ్ చాలా అద్భుతంగా నటించాడు. గీత్ ఫైర్ బ్రాండ్ తన పాత్రలో అత్యద్భుతంగా పెర్ఫార్మన్స్ చేసింది. పర్ఫెక్ట్ మీటర్లు పెర్ఫార్మన్స్ ఉంది. ట్రైలర్ చూడగానే ఈ సినిమా ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తుందనిపిచింది. చాలా హానెస్ట్ గా ఉంది. ఎక్కడ కల్మషం కనిపించలేదు. చాలా ఆర్గానిక్ గా ఉంది. ఈ సినిమాని థియేటర్ కి వెళ్లి టికెట్ కొని చూస్తాను. ఇది నా ప్రామిస్. టీమ్ అందరు కూడా అద్భుతంగా వర్క్ చేశారు ఆగస్టు 27న థియేటర్స్ లో కలుద్దాం
మూవీ ప్రజెంటర్ మధు శాలిని మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. సిద్దు జొన్నలగడ్డ, శశి గారికి థాంక్యూ సో మచ్. వారి సపోర్ట్ ని మర్చిపోలేను. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. శ్రీ చరణ్ గీత్ వాళ్ళిద్దరు కూడా అక్కడే పుట్టి పెరిగినట్టు యాక్ట్ చేశారు. ఈ సినిమాకి సపోర్ట్ చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు . బన్నీ వాసు గారు సపోర్ట్ తో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నాము. ఆగస్టు 27న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. సృజన్ గారు అద్భుతమైన సినిమాని మన ముందుకు తీసుకొచ్చారు. తప్పకుండా ఈ సినిమాని థియేటర్స్ లో చూసి ఆస్వాదించాలని కోరుకుంటున్నాను.
హీరోయిన్ గీత్ సైని మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. సిద్దు గారికి శశి గారికి మధు గారికి థాంక్యూ సో మచ్. బన్నీ వాసు గారు మధుగారు లేకపోతే ఈ సినిమా థియేటర్స్ కి వచ్చేది కాదు. డైరెక్టర్ సుజన్ గారు ఈ సినిమా కోసం అహర్నిశలు కష్టపడ్డారు. ఇన్ని సవాళ్లు ఎదుర్కొని ఇంత అద్భుతమైన సినిమా తీశారు. నిజంగా ఆయన మాకు ఇన్స్పిరేషన్. తప్పకుండా ఆయన కష్టానికి ఫలితం దక్కుతుంది. తప్పకుండా అయిన ఇండియన్ సినిమాలో గ్రేటెస్ట్ డైరెక్టర్ అవుతారు. తప్పకుండా ఆగస్టు 27న ఈ సినిమా థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను.
డైరెక్టర్ సృజన్ మాట్లాడుతూ.. సినిమా నిర్మించడం కూడా ఒక గుడి కట్టడం లాంటిదే. కన్యాకుమారిని అలానే నిర్మించాను. ప్రేక్షకులు సినిమా చూసి గొప్ప ఆనందాన్ని పొందాలని మంచి ఉద్దేశంతో ఈ సినిమా చేశాను. అందుకే ఈ సినిమాకి ఆర్గానిక్ ప్రేమ కథ ని పెట్టాను. ఇందులో పాత్రలన్నీ కూడా రియల్ లైఫ్ నుంచి వచ్చినవే. ఈ సినిమా పాత్రలోనే చాలా మంచి డ్రామా ఉంది. ఈ సినిమాకి సపోర్ట్ చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమా చూసి మీకు నచ్చితే ఆ క్రెడిట్ బన్నీ వాసు గారికి దక్కుతుంది. బన్నీ వాసు లేకపోతే ఈ సినిమా థియేటర్స్ లోకి రాదు. ఆగస్టు 27న సినిమా చూడాలనుకుంటే మా కన్యాకుమారి కూడా ఉందని కన్సిడర్ చేయండి.
శ్రీ చరణ్ మాట్లాడుతూ...అందరికీ నమస్కారం. సిద్దు గారికి థాంక్యూ సో మచ్. ఇది నాకు డ్రీమ్ కం ట్రూ మూమెంట్. నన్ను ఈ క్యారెక్టర్ లో బిలీవ్ చేసి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి థాంక్యూ సో మచ్. ఈ సినిమా కోసం చాలా గ్రౌండ్ వర్క్ చేశాను. ఈ సినిమా కథ కథనాలు క్యారెక్టర్స్ అన్నీ చాలా బాగుంటాయి .ఎమోషన్స్ కూడా చాలా డైనమిక్ గా ఉంటాయి. సినిమా చాలా బ్యూటిఫుల్ గా నేచురల్ గా ఉంటుంది. ఆగస్ట్ 27న తప్పకుండా అందరూ థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను.
తారాగణం: గీత్ సైనీ, శ్రీచరణ్ రాచకొండ సాంకేతిక సిబ్బంది:
ప్రొడక్షన్ - రాడికల్ పిక్చర్స్
సమర్పణ - మధు షాలిని
రచన, దర్శకత్వం & నిర్మాత - సృజన్ అట్టాడ
డిఓపి - శివ గాజుల, హరి చరణ్ కె
సంగీతం - రవి నిడమర్తి
ఎడిటింగ్ - నరేష్ అడుప
సహ నిర్మాతలు – సతీష్ రెడ్డి చింత, వరేనియా మామిడి, అప్పల నాయుడు అట్టాడ, సిద్ధార్థ్ ఎ.
సౌండ్ డిజైనర్ - నాగార్జున తాళ్లపల్లి
సౌండ్ మిక్సింగ్ - వంశీప్రియ రాసినేని (సౌండ్‌రూఫ్ స్టూడియోస్)