pizza

Red Giant Movies Brings Rajinikanth and Kamal Haasan Together After 47 Years for ‘KHxRK’
ఇండియన్ సినిమా లెజెండ్స్ రజనీకాంత్, కమల్ హాసన్ కాంబోలో నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో భారీ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్న రెడ్ జెయింట్ మూవీస్

You are at idlebrain.com > news today >

21 February 2026
Hyderabad

Indian cinema is set to witness a historic moment as two of its most iconic legends — Rajinikanth and Kamal Haasan — reunite after 47 years for a prestigious, once-in-a-lifetime cinematic collaboration, tentatively titled "KHxRK"

The two screen icons last worked together in the late 1970s, and their reunion marks one of the most significant events in contemporary Indian film history. Their coming together represents the convergence of two extraordinary legacies that have shaped generations of audiences across India and globally.

The project is being produced by Red Giant Movies, who have successfully brought these two cinematic giants together for this landmark collaboration. The production house has envisioned this film as a celebration of scale, legacy, and storytelling at its finest.

Sharing their thoughts, a spokesperson from Red Giant Movies said:

"Bringing together Rajinikanth sir and Kamal Haasan sir for this film is truly a dream come true for all of us at Red Giant Movies. We feel deeply honoured, grateful, and incredibly excited to facilitate this reunion after 47 years. This is a historic and emotional moment for Indian cinema, and we embark on this journey with immense gratitude and responsibility. We are committed to creating a cinematic experience that celebrates their legacy in the most powerful way."

The film will be helmed by acclaimed director Nelson Dilipkumar, who delivered the blockbuster success Jailer and has established himself as one of the most dynamic commercial filmmakers in the country. Music for the film will be composed by Anirudh Ravichander, whose powerful soundscapes have consistently elevated large-scale cinematic experiences.

Further details regarding the film remain under wraps and will be announced in due course.

ఇండియన్ సినిమా లెజెండ్స్ రజనీకాంత్, కమల్ హాసన్ కాంబోలో నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో భారీ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్న రెడ్ జెయింట్ మూవీస్

ఇండియన్ సినిమా లెజెండ్స్ గా కోట్లాది మంది ప్రేక్షకుల ప్రేమను సంపాదించుకున్నారు రజనీకాంత్, కమల్ హాసన్. వీరు కలిసి నటించే సినిమా కోసం అభిమానులు, సినీ ప్రియులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఆ మోస్ట్ అవేటెడ్ సినిమాను మన ముందుకు తీసుకురాబోతోంది ప్రెస్టీజియస్ బ్యానర్ రెడ్ జెయింట్ మూవీస్. 47 ఏళ్ల తర్వాత రజనీకాంత్, కమల్ హాసన్ కాంబోలో భారీ పాన్ వరల్డ్ మూవీని నిర్మిస్తోందీ సంస్థ. "KHxRK"వర్కింగ్ టైటిల్ తో ఈ అరుదైన చిత్రాన్ని రెడ్ జెయింట్ మూవీస్ అనౌన్స్ చేసింది. టాలెంటెడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు.

70వ దశకంలో రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి నటించారు. ఆ తర్వాత తమదైన పంథాలో వెళ్తూ భారతీయ సినీ చరిత్రలో సువర్ణాధ్యాయాలు లిఖించారు. తమ సుదీర్ఘ సినీ ప్రస్థానంలో దిగ్గజాలుగా ఎదిగారు. ఈ లెజెండ్స్ కలిసి నటించేందుకు ముందుకు రావడం ఒక చారిత్రక ఘట్టంగా చెప్పుకోవచ్చు. రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి నటించే చిత్రాన్ని రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో చిరకాలం గుర్తుండిపోయే గొప్ప కథతో నిర్మించేందుకు సన్నద్ధమవుతోంది.

ఈ సందర్భంగా రెడ్ జెయింట్ మూవీస్ ప్రతినిధి మాట్లాడుతూ - రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి ఇద్దరు లెజెండ్స్ తో సినిమా నిర్మించే అవకాశం రావడం మా సంస్థ కల నిజమైన అనుభూతి కలుగుతోంది. 47 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరు దిగ్గజాల కాంబినేషన్ లో సినిమా నిర్మించడం గర్వంగా, గౌరవంగా భావిస్తున్నాం. ఇండియన్ సినిమాకు ఇదొక హిస్టారిక్ మూవ్ మెంట్. ఈ ప్రతిష్టాత్మక సినిమా నిర్మాణాన్ని ఎంతో బాధ్యతగా తీసుకుంటున్నాం. "KHxRK" సినిమాతో ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇవ్వబోతున్నాం. అన్నారు.

జైలర్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించిన టాలెంటెడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ "KHxRK" సినిమాను రూపొందిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే మేకర్స్ తెలియజేయనున్నారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved