pizza

Killer Will Impress Every Audience as a Unique Sci-Fi Thriller with a Multi-Layered Screenplay – Director Sukku Poorvaaj at Teaser Launch Event
మల్టీ లేయర్ స్క్రీన్ ప్లేతో సరికొత్త సైఫై థ్రిల్లర్ గా ప్రతి ప్రేక్షకుడినీ "కిల్లర్" సినిమా ఆకట్టుకుంటుంది - టీజర్ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ సుకు పూర్వాజ్

You are at idlebrain.com > news today >

22 February 2026
Hyderabad

Killer, starring Jyoti Poorvaj and Poorvaj in lead roles, also features Manish Gilada, Chandrakant Kollu, Vishal Raj, Archana Ananth, and Gautham Chakradhar Koppishetty in important roles. The film is being produced by Poorvaj and Padmanabha Reddy A under the banners Think Cinema and AU & I Studios, with the blessings of Dhyanam Nannagaru, while Urvish Poorvaj presents the project. Directed by Poorvaj, the film is gearing up for a grand theatrical release soon. The teaser was officially launched today at an event held in Hyderabad.

Speaking at the event, Line Producer Sitarama Rao said ,"The entire team worked very hard on Killer and expressed confidence that audiences would enjoy the film and extend the same support they showed for the teaser".

Line Producer Dasarath Madhav said, "that the film carries strong content blended with an emotional brother-sister sentiment and said that despite being a small film, Killer will achieve big success".

Actor Manish Gilada, who plays the antagonist, thanked director Sukku Poorvaaj for presenting him as a powerful villain and said the team worked collectively to deliver a memorable film, expressing confidence that it would create a new milestone at the box office.

Actor Gautham Chakradhar said audiences would be impressed by Jyoti Poorvaj’s action performance and transformation, adding that the film has been crafted with high technical quality.

Actor Vishal Raj mentioned that the teaser itself reflects the film’s technical standards and praised Jyoti Poorvaj’s surprising transformation from her television image. Actor Srinivas described Killer as a technical wonder and one of the rare films emerging from Telugu cinema.

Actor Chandrakanth said, "that his character remains a suspense element throughout the story and was intentionally not revealed in the teaser. Actor Kalicharan thanked director Anil Ravipudi for launching the teaser and said the film deserves to become a big success, adding that Jyoti Poorvaj appears stunning on screen and audiences should experience the film in theatres."

Heroine Jyoti Poorvaj said,"that she wanted to move away from routine television roles and appreciated director Sukku Poorvaaj for presenting her in a completely new avatar. She revealed that she plays multiple characters in the film, calling it a dream opportunity for any actor. She also performed action sequences, fulfilling her long-time dream of doing action roles similar to Vijayashanti. She added that the team made the film beyond their limitations, not merely for profits but to build a strong foundation as filmmakers and provide opportunities for many people through cinema."

Director Sukku Poorvaaj said," the script was conceived five to six years ago and that the teaser reveals only about 40 percent of the film’s content, while the upcoming trailer will showcase nearly 80 percent. He explained that the film blends artificial intelligence, emotional drama, brother-sister bonding, revenge, and subconscious identity into a sci-fi thriller with a multi-layered screenplay that remains easy for audiences to follow. Calling it a women-centric film, he revealed multiple intriguing character shades played by Jyoti Poorvaj, including Rakthika (a vampire), Raniya (a terrorist), Riya (a spy), and Rai (a poisonous woman), along with another unrevealed character. He thanked the technical team and director Anil Ravipudi for supporting the teaser launch."

Cast: Jyoti Poorvaj, Poorvaj, Manish Gilada, Chandrakant Kollu, Vishal Raj, Archana Ananth, Gautham Chakradhar Koppishetty, and others.

Technical Crew:
Writer, Editor & Director: Poorvaaj
Presenter: Urvish Poorvaj
Producers: Poorvaaj, Padmanabha Reddy A
DOP: Jagadeesh Bommishetty
Screenplay Editor: Poorvaaj
Music: Aashirvad, Suman Jeeva
Chief Editor: B. Manoj Kumar
Master Chief Editor: Shiva Sharvani
Costume Designer: Udayasri Poorvaaj
Art Director: Mani
Action Choreography: Raj Kumar Gangaputra
Line Producers: Dasarath Madhav, Sitarama Rao
Executive Producer: DS Basha
DI: Mayasabha Studios

మల్టీ లేయర్ స్క్రీన్ ప్లేతో సరికొత్త సైఫై థ్రిల్లర్ గా ప్రతి ప్రేక్షకుడినీ "కిల్లర్" సినిమా ఆకట్టుకుంటుంది - టీజర్ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ సుకు పూర్వాజ్

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్, లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా "కిల్లర్". మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను ధ్యానం నాన్నగారు ఆశీస్సులతో థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్స్ పై పూర్వాజ్ , పద్మనాభ రెడ్డి.ఎ. నిర్మిస్తున్నారు. ఉర్వీశ్ పూర్వజ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. పూర్వాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో ఈ మూవీ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు హైదరాబాద్ లో ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో

లైన్ ప్రొడ్యూసర్ సీతారామరావు మాట్లాడుతూ- "కిల్లర్" చిత్రం కోసం మేమంతా చాలా కష్టపడ్డాం. సినిమా మీ అందరికీ నచ్చేలా ఉంటుంది. టీజర్ లాగే సినిమాకు కూడా మీ సపోర్ట్ అందిస్తారని కోరుకుంటున్నాం. అన్నారు.

లైన్ ప్రొడ్యూసర్ దశరథ మాధవ్ మాట్లాడుతూ - మంచి కంటెంట్ ఉన్న చిత్రమిది. బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ తో ఆకట్టుకునేలా మూవీ ఉంటుంది. ఈ చిత్రంలో నేను బ్రదర్ రోల్ లో నటించాను. చిన్న సినిమా అయినా "కిల్లర్" పెద్ద విజయం సాధిస్తుంది. అన్నారు.

యాక్టర్ మనీష్ గిలాడ మాట్లాడుతూ - ఈ చిత్రంలో నేను విలన్ క్యారెక్టర్ లో నటించాను. నన్ను ఒక పవర్ ఫుల్ విలన్ గా చూపించిన డైరెక్టర్ సుకు పూర్వాజ్ గారికి థ్యాంక్స్. ఈ సినిమాకు మేమంతా టీమ్ వర్క్ చేశాం. ఈ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద ఒక కొత్త హిస్టరీ క్రియేట్ చేయబోతున్నాం. అన్నారు.

యాక్టర్ గౌతమ్ చక్రధర్ మాట్లాడుతూ - "కిల్లర్" సినిమాలో జ్యోతి పూర్వజ్ గారి యాక్షన్, ఆమె ట్రాన్సఫర్మేషన్ మీ అందరినీ ఆకట్టుకుంటుంది. నేను కూడా కొన్ని యాక్షన్ సీక్వెన్సులు పర్ ఫార్మ్ చేశాను. ఈ సినిమా టెక్నికల్ గా మంచి క్వాలిటీతో మా డైరెక్టర్ రూపొందించారు. ఇది టీజర్ మాత్రమే సినిమాతో పెద్ద సక్సెస్ అందుకుంటామనే నమ్మకం ఉంది.అన్నారు.

యాక్టర్ విశాల్ రాజ్ మాట్లాడుతూ - మా సినిమా టీజర్ చూస్తేనే టెక్నికల్ గా మూవీ ఎంత క్వాలిటీగా ఉండబోతుందో మీ అందరికీ అర్థమై ఉంటుంది. జ్యోతి గారిని మనం సీరియల్స్ లో చూశాం. ఇప్పుడీ మూవీలో ఆమె పర్ ఫార్మ్ చేసిన విధానం సర్ ప్రైజ్ చేస్తోంది. డైరెక్టర్ పూర్వాజ్ నాకు మంచి ఫ్రెండ్. ఈ చిత్రంలో ఒక కీ రోల్ చేసే అవకాశం కల్పించారు. ఈ సినిమా మా టీమ్ అందరికీ మంచి గుర్తింపు తీసుకొస్తుందని ఆశిస్తున్నాం. అన్నారు.

యాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ - జ్యోతి పూర్వజ్ గారిని కొత్తగా ఈ చిత్రంలో స్క్రీన్ మీద చూడబోతున్నాం. టెక్నికల్ వండర్ గా ఈ సినిమా ఉంటుంది. తెలుగు నుంచి వస్తున్న అరుదైన సినిమాల్లో ఒకటిగా కిల్లర్ పేరు తెచ్చుకుంటుంది. అన్నారు.

యాక్టర్ చందు మాట్లాడుతూ - కిల్లర్ మూవీలో నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్న సుకు గారికి థ్యాంక్స్. ఈ సినిమాలో నా క్యారెక్టర్ ఏంటనేది సస్పెన్స్. అందుకే టీజర్ లో కూడా రివీల్ చేయలేదు. కథలో ఆద్యంతం నా క్యారెక్టర్ ట్రావెల్ అవుతూనే ఉంటుంది. ఈ చిత్రంతో నాకు నటుడిగా మంచి గుర్తింపు వస్తుంది. అన్నారు.

యాక్టర్ కాళీచరణ్ మాట్లాడుతూ - మా సినిమా టీజర్ రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి గారికి థ్యాంక్స్. నేను నటించిన ఓం బీమ్ భుష్ చిత్రంలాగే ఈ సినిమా కూడా పెద్ద విజయం సాధించాలి. జ్యోతి గారు యంగ్ ఐశ్వర్య రాయ్ లా కనిపిస్తున్నారు. ఇలాంటి హై క్వాలిటీ మూవీని థియేటర్స్ లోనే మీరంతా చూడాలి. అన్నారు.

హీరోయిన్ జ్యోతి పూర్వజ్ మాట్లాడుతూ - నేను సీరియల్స్ లో రొటీన్ క్యారెక్టర్స్ చేస్తూ విసిగిపోయి ఉన్న టైమ్ లో డైరెక్టర్ సుకు పూర్వజ్ నన్ను స్క్రీన్ మీద కొత్తగా చూపించేందుకు ముందుకొచ్చారు. నేను ఆరేడు క్యారెక్టర్స్ ఉన్న ఇలాంటి మూవీ చేస్తానని అనుకోలేదు. ఎవరైనా డ్యూయల్ రోల్ చేస్తారు కానీ ఆరేడు క్యారెక్టర్స్ లో పర్ ఫార్మ్ చేసే అవకాశం రావడం ఏ యాక్టర్ కైనా డ్రీమ్ అనుకోవచ్చు. ఈ సినిమాలో నాతో యాక్షన్ కూడా చేయించాడు డైరెక్టర్. విజయశాంతి గారిలా యాక్షన్ చేయాలని నాకూ డ్రీమ్ ఉండేది. అలాంటి అవకాశం "కిల్లర్" చిత్రంతో దక్కింది. పూర్వజ్ ఇచ్చిన సపోర్ట్ తోనే నేను ఈ సినిమా చేయగలిగాను. ఈ మూవీ కోసం డైరెక్టర్ పూర్వజ్ చాలా కష్టపడ్డాడు. పెళ్లయ్యాక చాలా మంది పర్సనల్ వెకేషన్ కు వెళ్తారు. కానీ మనం సినిమా చేద్దామని పూర్వాజ్ నాతో అన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. సినిమా రూపొందించడం ద్వారా చాలా మందికి ఎంతో కొంత ఉపాధి కల్పించినవారం అవుతాం అనుకున్నాను. జ్యోతి అంటే మంచి పర్ ఫార్మర్ అని, పూర్వాజ్ అంటే మంచి డైరెక్టర్ టెక్నీషియన్ అని ఈ చిత్రంతో ప్రతి ఒక్కరికీ తెలుస్తుంది. పూర్వాజ్ లో అమేజింగ్ యాక్టర్ ఉన్నాడు. రీసెంట్ గా అనిల్ రావిపూడి గారు మా సినిమా టీజర్ రిలీజ్ చేసి పూర్వాజ్ లో మంచి యాక్టర్ ఉన్నాడని చెప్పారు. మాకున్న లిమిటేషన్స్ దాటి ఈ సినిమాను రూపొందించాం. ఈ చిత్రంతో డబ్బులు చేసుకుందామని కాదు మేకర్స్ గా ఒక ఫౌండేషన్ వేసుకోవాలనే ప్రయత్నిస్తున్నాం. మూవీని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. అన్నారు.

డైరెక్టర్ సుకు పూర్వాజ్ మాట్లాడుతూ - ఐదారేళ్ల కిందట అనుకున్న స్క్రిప్ట్ ఇది. మేము గతంలో గ్లింప్స్ ద్వారా చూపించింది చాలా తక్కువ అని చెప్పాను. ఇప్పుడు టీజర్ లో చాలా జాగ్రత్తగా కట్ చేసి మేము చూపించిన కంటెంట్ 40 పర్సెంట్ మాత్రమే. త్వరలో రాబోయే ట్రైలర్ లో 80 పర్సెంట్ చూపిస్తాం. థియేటర్ లో హండ్రెడ్ పర్సెంట్ సినిమా కథేంటి అనేది తెలుస్తుంది. మేము టీజర్ లో చెప్పినట్లు మీ మేధస్సును ఉపయోగించండి అనేది ఎందుకు చెప్పామో మూవీ చూస్తే తెలుస్తుంది. ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్, ఎమోషనల్ డ్రామా, బ్రదర్ సిస్టర్ బాండింగ్, రివేంజ్, సబ్ కాన్షియస్ ఐడెంటిటీ.. ఇలాంటి ఎలిమెంట్స్ తో సైఫై థ్రిల్లర్ గా కిల్లర్ సినిమాను రూపొందించాం. మల్టీలేయర్ స్క్రీన్ ప్లే ఉన్నా ప్రతి సెక్షన్ ఆడియెన్ కు మూవీ ఈజీగా అర్థమయ్యేలా ఉంటుంది. వుమెన్ సెంట్రిక్ చిత్రమిది. కిల్లర్ లో ఆర్ అక్షరం రక్తిక అనే వ్యాంపైర్, రనియా అనే టెర్రరిస్ట్, రియా అనే స్పై, రై అనే విషపూరిత వుమెన్..ఈ క్యారెక్టర్స్ తో పాటు మేము రివీల్ చేయని మరో క్యారెక్టర్ ఉంటుంది. త్వరలోనే ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తాం. అది ఇంకా హార్డ్ హిట్టింగ్ గా ఉంటుంది. మా టెక్నికల్ టీమ్ అందరికీ థ్యాంక్స్. అలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ టీజర్ రిలీజ్ చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి గారికి మా అందరి తరుపున థ్యాంక్స్ చెబుతున్నాం. అన్నారు.

నటీనటులు - జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ , మనీష్ గిలాడ, చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి, తదితరులు

టెక్నికల్ టీమ్

రచన, ఎడిటింగ్, దర్శకత్వం - పూర్వాజ్
సమర్పణ - ఉర్వీశ్ పూర్వజ్
ప్రొడ్యూసర్స్ - పూర్వాజ్, పద్మనాభరెడ్డి.ఎ.
డీవోపీ - జగదీశ్ బొమ్మిశెట్టి
స్క్రీన్ ప్లే ఎడిటర్ - పూర్వాజ్
మ్యూజిక్ - ఆశీర్వాద్, సుమన్ జీవ
చీఫ్ ఎడిటర్ - బి.మనోజ్ కుమార్
మాస్టర్ చీఫ్ ఎడిటర్ - శివ శర్వాణి
కాస్టూమ్ డిజైన్ - ఉదయశ్రీ పూర్వజ్
ఆర్ట్ డైరెక్షన్ - మణి
యాక్షన్ కొరియోగ్రఫీ - రాజ్ కుమార్ గంగపుత్ర
లైన్ ప్రొడ్యూసర్స్ - దశరథ మాధవ్, సీతారామారావు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - డీఎస్ బాష
డీఐ - మయసభ స్టూడియోస్

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved