pizza

“I See Kishkindhapuri’s Success as an Industry-Wide Win” – Mega Supreme Hero Sai Dharam Tej at Kishkindhapuri Success Meet
కిష్కింధపురి సక్సెస్ ఇండస్ట్రీ సక్సెస్ గా భావిస్తున్నాను: కిష్కింధపురి సక్సెస్ మీట్ లో మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్

You are at idlebrain.com > news today >

18 September 2025
Hyderabad

Hero Bellamkonda Sai Sreenivas’s latest thrilling blockbuster Kishkindhapuri, starring Anupama Parameswaran and directed by Koushik Pegallapati, is produced by Sahu Garapati under Shine Screens banner. After an impressive run of premieres, the film was released worldwide on September 12th and is running to packed houses as a blockbuster. The makers held a grand success meet attended by Sai Dharam Tej, directors Anil Ravipudi, Bobby, Vasishta, and Anudeep as special guests.

Sai Dharam Tej said:
“Greetings to everyone. Thank you to the media for supporting good cinema. I share a long-standing bond with Sahu Garapati—his younger brother was my classmate in degree college. I’ve known Sai (Sreenivas) since our acting classes in Mumbai. It’s been a 15-year journey. Being here today feels like a reunion. My classmates Vasishta and Kanishka are here too. Composer Chetan Bhardwaj gave wonderful music. Anil garu is very close to me—I’m eagerly waiting for the film he’s doing with my uncle (Chiranjeevi). This event itself, filled with laughter, is a celebration. I truly feel like Kishkindhapuri’s success is a success for the whole industry. Telugu cinema is evolving. We need more stories that excite the audience. When those come, the audience will show up. Little Hearts, Mirai, Kishkindhapuri—all are doing great, and it's heartening to see good content getting such strong support. Congratulations to the entire team!”

Bellamkonda Sai Sreenivas said:
“Thanks to everyone who came to this event and supported us. I’m grateful to the audience for embracing this film and making it such a huge success. Sai and I are close friends. My thanks to Bobby garu, Anil Ravipudi garu, Vasishta garu, and Anudeep garu for being here—not as guests, but as family. September has been a great month for theatres, and seeing people return to celebrate cinema is a joy. Bobby anna gave a fantastic story for Alludu Seenu—our journey began there, and I thank him for always wishing me well. I have personal bonds with everyone on this stage, and seeing them here to bless us means a lot. Kishkindhapuri is a film that must be watched in theatres. I wholeheartedly request everyone to go watch it and spread the word if you like it. I share a long journey with Tej—from Bhairava to today, he has always supported me. I'm also thankful to media friends who backed us. I hope your continued support takes this film even further.”

Director Anil Ravipudi said:
“Congratulations to the team! Initially, when I was invited to the pre-release event, I said I wouldn’t come because I’m scared of horror films. But I made a promise to Sahu garu and watched the film—and yes, I was scared at multiple points! Some sequences shook the entire theatre. September has been a great month for Telugu cinema—Kotha Lokam, Mirai, Kishkindhapuri, Little Hearts—it's like a mini festival. I hope this momentum continues. Koushik did a brilliant job, and I’m sure he’ll keep the success going. Congrats to producer Sahu garu, Sai garu, and the entire team. Wishing Sreenivas garu continued success and back-to-back hits from here.”

Director Bobby said:
“Congratulations to the whole team. I’ve known Koushik since his first film, and it’s wonderful to see him deliver a blockbuster. Horror is a genre that demands precision—you need strong content to pull people to theatres. The message woven into the horror backdrop worked very well. Sai might not come from a film family, but he works extremely hard. I’m so happy to see him succeed with this film. Sahu garu has now added a blockbuster to his banner. I’ve seen portions of the Chiranjeevi–Anil Ravipudi Sankranthi film—it’s going to be a massive blockbuster. Congrats again to Sahu garu and the entire team.”

Director Vassishta said:
“Hearty congratulations to the team for delivering such a big blockbuster. Bellamkonda Sai garu has pulled off a hit in a new genre. Hats off to Sahu garu and everyone involved.”

Director Anudeep said:
“I watched the film just yesterday. This is truly a theatre-worthy film—don’t miss it! Congratulations to Sai garu, and I hope Sahu garu continues to produce many more such films. Looking forward to more exciting content from Koushik.”

Producer Sahu Garapati said:
“Thank you to all the esteemed guests—Sai Dharam Tej garu, Bobby garu, Anil Ravipudi garu, Vasishta garu, Anudeep garu. All of them called us after watching the film and shared their joy. We thought bringing everyone together here would be special. Koushik's vision came alive on screen at a Hollywood-level scale. The audience is feeling that thrill too. Sai Sreenivas took a bold step by doing something different. Anupama delivered a great performance, and everyone gave their best. That’s why the audience is responding so positively. As a producer, I’m overwhelmed. This hit has given me fresh energy to push even harder.”

Director Koushik Pegallapati said:
“A big thank you to all the guests—Sai Dharam Tej garu, Bobby garu, Anil Ravipudi garu, Vasishta garu, and Anudeep garu. When distributors and producers are happy—that’s true success. This film brought that happiness.
Huge thanks to Sahu garu for trusting me. In times when audiences hesitate to visit theatres, seeing houseful boards for Kishkindhapuri fills my heart. I thank my entire team for supporting me. I dedicate this success to all of them. People are asking when Kishkindhapuri Part 2 is coming—it’s definitely on the cards!”

Music Director Chetan Bharadwaj said:
“The film’s success is deeply fulfilling. It connected organically with audiences. Huge thanks to our music team, to producer Sahu garu for the opportunity, and to director Koushik for trusting me. I’m grateful for the overwhelming response.”

కిష్కింధపురి సక్సెస్ ఇండస్ట్రీ సక్సెస్ గా భావిస్తున్నాను: కిష్కింధపురి సక్సెస్ మీట్ లో మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ థ్రిల్లింగ్ బ్లాక్ బస్టర్ 'కిష్కింధపురి'. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. అద్భుతమైన ప్రిమియర్స్ తో మొదలైన ఈ చిత్రం సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు. హీరో సాయి దుర్గతేజ్, డైరెక్టర్ అనిల్ రావిపూడి, బాబీ, వశిష్ట, అనుదీప్ అతిధులు గా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

సక్సెస్ మీట్ లో హీరో సాయి దుర్గతేజ్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మంచి సినిమాని ముందుకు తీసుకెళుతున్న మీడియా వారికి థంక్ యు. సాహు గారితో నాకు మంచి ఒక అనుబంధం ఉంది. సాహు గారి తమ్ముడు డిగ్రీలో నా క్లాస్ మేట్. ఆ బాండ్ అప్పటినుంచి ఉంది. సాయి తో నాకు ముంబైలో యాక్టింగ్ క్లాస్ నుంచి పరిచయం ఉంది. 15 ఏళ్లుగా మా జర్నీ కొనసాగుతోంది. ఫిలింనగర్ అంతా రచ్చ లేపేసేవాళ్ళం. ఈ స్టేజ్ నాకు ఒక రియూనియన్ లాగా ఉంది. నా టెన్త్ క్లాసు మేట్ వశిష్ట, కనిష్క కూడా నా క్లాస్ మేట్. అందర్నీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. చేతన్ భరద్వాజ్ గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. అనిల్ గారు నాకు ఎంతో సన్నిహితులు. మా మావయ్య గారితో చేస్తున్న సినిమా కోసం ఎదురుచూస్తున్నాను. ఈ సక్సెస్ మీట్ లో అందరూ నవ్వుకోవడం కూడా ఒక పెద్ద సక్సెస్. ఈ మూమెంట్ ని ఎంతో ఎంజాయ్ చేస్తున్నాం. ఇది మొత్తం ఇండస్ట్రీ సక్సెస్ లాగా భావిస్తున్నాను. ఇండస్ట్రీ ఒక ఎవల్యూషన్ దశలో ఉంది. మంచి కథలు రావాలి. ఆడియన్స్ ని ఎక్సయిట్ చేసే కథలు రావాలి. అలా వస్తేనే ఆడియన్స్ కి వస్తారు. అలాంటి సినిమాలు ఇవ్వడం మనందరి బాధ్యత. లిటిల్ హార్ట్స్, మిరాయ్, కిస్కింధపురి.. ఇలా అన్ని సినిమాలు అద్భుతంగా ఆడుతున్నాయి. మంచి కంటెంట్ ని ఆడియన్స్ సపోర్ట్ చేస్తున్నారు. ఇంత మంచి హిట్ అందుకున్న కిస్కింధపురి టీమ్ అందరికీ కంగ్రాజులేషన్స్.

హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ ఈవెంట్ కి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. ప్రేక్షకులు ఈ సినిమాని గొప్పగా ఆదరించి ఇంత పెద్ద హిట్ చేసినందుకు కృతజ్ఞతలు. సాయి నేను మంచి ఫ్రెండ్స్. బాబి గారికి అనిల్ రావిపూడి గారికి వశిష్ట గారికి అనుదీప్ గారికి థాంక్యూ సో మచ్. ఇక్కడికి గెస్ట్ లుగా రాలేదు ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా వచ్చారు. ఈ సెప్టెంబర్ మంత్ థియేటర్స్ కి చాలా బావుంది. అందరూ థియేటర్స్ కి వచ్చి సెలబ్రేట్ చేసుకున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. బాబీ అన్న అల్లుడు శీను సినిమాకి చాలా మంచి కథ ఇచ్చారు. అప్పుడు నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. ఆయన మాకు బెస్ట్ విషెస్ అందించడానికి అందించినందుకు చాలా థాంక్స్. అందరితో నాకు ఒక పర్సనల్ అనుబంధం ఉంది. వారందరూ వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయడం చాలా ఆనందంగా ఉంది. కిస్కింధపురి థియేటర్స్ లో చూడాల్సిన సినిమా. అందరూ థియేటర్స్ కి వచ్చి సినిమాను చూసి సపోర్ట్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా ఖచ్చితంగా చూడండి. మీకు నచ్చితే ఇంకో పది మందికి చెప్పండి. ఇది మీ అందరిని అలరించే సినిమా. తేజ్ తో నాది వెరీ లాంగ్ జర్నీ. ఆయన భైరవం సినిమా కూడా సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఈ వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉంది. మమ్మల్ని సపోర్ట్ చేసిన మీడియా మిత్రులు అందరికీ థాంక్యూ. మరింత సపోర్ట్ చేసే సినిమాని గొప్ప స్థాయికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను.

డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. టీమ్ అందరికి కంగ్రాజులేషన్స్. ప్రీ రిలీజ్ ఈవెంట్ పిలిచినప్పుడు హారర్ సినిమా అంటే నాకు భయం. చూడలేను అని చెప్పాను. నిజంగా నాకు భయం. సాహు గారికి మాట ఇచ్చినట్టు ఈ సినిమా చూశాను. చాలా చోట్ల భయపడ్డాను. కొన్ని సీక్వెన్స్ లో థియేటర్స్ మొత్తం షేక్ అయింది. అందరూ భయపడ్డారు. ఈ సెప్టెంబర్ ఒక సక్సెస్ఫుల్ సెప్టెంబర్ అయింది. కొత్తలోక, మిరాయి కిష్కిందపురి లిటిల్ హార్ట్స్ సినిమాలతో థియేటర్స్ కళకళలాడుతున్నాయి. థియేటర్స్ లో ఒక చిన్న ఫెస్టివల్ లా ఉంది. ఈ మూమెంట్ ఇలాగే కంటిన్యూ అవ్వాలి. కౌశిక్ అద్భుతంగా ఈ సినిమాను తీశాడు. ఇక్కడ నుంచి తను సక్సెస్ ని కంటిన్యూ చేస్తాడని కోరుకుంటున్నాను. తన నమ్మి అవకాశం ఇచ్చిన నిర్మాత సాహు గారికి, సాయి గారికి కంగ్రాజులేషన్స్. ఈ సినిమాతో మళ్లీ సక్సెస్ జర్నీ స్టార్ట్ చేసిన హీరో శ్రీనివాస్ గారు ఇదే కంటిన్యూ చేస్తూబ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకోవాలని కోరుకుంటున్నాను. టీమ్ అందరికీ కంగ్రాజులేషన్స్.

డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ .. అందరికి నమస్కారం. టీమ్ అందరికీ కంగ్రాజులేషన్స్. కౌశిక్ నాకు ఫస్ట్ సినిమా నుంచి తెలుసు. తన సినిమా బ్లాక్ బస్టర్ అవడం చాలా ఆనందంగా ఉంది. హీరో నిర్మాతల నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు .హారర్ ఫిలిమ్స్ చాలా జాగ్రత్తగా తీయాలి. చాలా చాలా స్ట్రాంగ్ కంటెంట్ ఉంటేనే జనం థియేటర్స్ కి వస్తారు. హారర్ తో పాటు మంచి మెసేజ్ని పెట్టడం చాలా బాగా అనిపించింది. సాయి ఏ బ్యాగ్రౌండ్ లేనట్టుగానే చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. తన ఈ సినిమాతో విజయాన్ని అందుకోవడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. సాహు గారు ఈ సినిమాతో ఒక బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నారు. సంక్రాంతికి రాబోతున్న చిరంజీవి గారు అనిల్ గారు సినిమాలో కొన్ని పార్ట్స్ చూశాను. సినిమా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ కాబోతోంది. సాహూ గారికి కంగ్రాట్యులేషన్స్. టీమ్ అందరికీ కంగ్రాచ్యులేషన్స్.

డైరెక్టర్ వశిష్ట మాట్లాడుతూ.. మంచి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న టీమ్ అందరికీ కంగ్రాచ్యులేషన్స్. బెల్లంకొండ సాయి గారు కొత్త జొనర్ లో బ్లాక్ బస్టర్ కొట్టారు. సాహు గారికి, టీమ్ అందరికీ కంగ్రాజులేషన్స్.

డైరెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ... అందరికి నమస్కారం. నిన్ననే సినిమా చూశాను. ఇది అందరూ థియేటర్స్ లో చూడాల్సిన సినిమా. అందరూ మిస్ కాకుండా చూడండి. సాయి గారికి కంగ్రాజులేషన్స్. సాహు గారు ఇలాంటి సినిమాలు మరెన్నో చేయాలని కోరుకుంటున్నాను. కౌశిక్ నుంచి ఇలాంటి మరిన్ని సినిమాలు రావాలని కోరుకుంటున్నాను.

నిర్మాత సాహూ గారపాటి మాట్లాడుతూ... అందరికి నమస్కారం. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా వచ్చిన సాయి దుర్గతేజ్ గారికి, బాబి గారికి. అనిల్ రావిపూడి గారికి. వశిష్ట గారికి. అనుదీప్ గారికి థాంక్యూ సో మచ్. అక్కడికి వచ్చిన గెస్ట్ లందరూ కూడా సినిమా చూసి మాకు ఫోన్ చేసి వాళ్ళ ఆనందాన్ని మాతో పంచుకున్నారు. వాళ్ళందరిని పిలిస్తే ఒక స్పెషల్ గా ఉంటుందని ఈ వేడుక నిర్వహించాము. కౌశిక్ అనుకున్న కథ స్క్రీన్ మీదకి ఒక హాలీవుడ్ సినిమా స్థాయిలో వచ్చింది. ఆడియన్స్ కూడా అదే థ్రిల్ ఫీల్ అవుతున్నారు. సాయి శ్రీనివాస్ గారు తన చేస్తున్న సినిమాలకి ఒక డిఫరెంట్ జానర్ చేయాలని ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చారు. అనుపమ గారు అద్భుతంగా పెర్ఫాం చేశారు. అందరూ కూడా తమ పాత్రలో అద్భుతమైన నటన కనబరిచారు. అందుకే ఆడియన్స్ నుంచి అంత మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆడియన్స్ సూపర్ హిట్ చేశారు. అందరికీ నచ్చింది కాబట్టి సినిమా అద్భుతంగా ఆడుతోంది. ఇది ఒక నిర్మాతగా చాలా ఆనందాన్నిస్తోంది. ఈ హిట్ మరింత ఉత్సాహంగా పనిచేయడానికి ఎనర్జీ ఇచ్చింది.

డైరెక్టర్ కౌశిక్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా వచ్చిన సాయి ధరంతేజ్ గారికి బాబి గారికి అనిల్ రావిపూడి గారికి వశిష్ట గారికి అనుదీప్ గారికి థాంక్యూ సో మచ్. డిస్ట్రిబ్యూటర్స్ నిర్మాతలు హ్యాపీగా ఉండటమే రియల్ సక్సెస్. ఈ సినిమా అలాంటి ఆనందాన్ని ఇచ్చింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత సాహూ గారికి థాంక్యూ. అడియన్స్ థియేటర్స్ కి రావడం తగ్గిపోయిన రోజుల్లో ఈ సినిమాకి హౌస్ ఫుల్ బోర్డ్స్ చూస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది. నాకు సపోర్ట్ చేసిన టీమ్ అందరికీ థాంక్యూ. ఈ సక్సెస్ మా టీమ్ అందరికి డెడికేట్ చేస్తున్నాను. మీరందరూ కానీ నాకు ఈ సక్సెస్ డెడికేట్ చేశారు. కిస్కింధపురి పార్ట్ 2 ఎప్పుడు అని అడుగుతున్నారు. ఐడియా వుంది డెఫినెట్ గా వస్తుంది.

మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. సినిమా సక్సెస్ చాలా ఆనందాన్నిచ్చింది. సినిమా ఆర్గానిక్ గా ఆడియన్స్ కి కనెక్ట్ అయింది. మా మ్యూజిక్ టీమ్ అందరికీ థాంక్యు. అవకాశం నాకు ఇచ్చిన నిర్మాత సాహూ గారికి థాంక్యూ. నన్ను బిలీవ్ చేసిన డైరెక్టర్ కౌశిక్ కి థాంక్యూ. సినిమాకి ఇంత అద్భుతమైన రెస్పాన్స్ రావడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. మూవీ టీం అంతా ఈ వేడుకలో పాల్గొన్నారు.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved