pizza

Thrilling ‘Kishkindhapuri’ Teaser…!!
ఉత్కంఠభరితంగా 'కిష్కింధపురి' టీజర్...!!

You are at idlebrain.com > news today >

15 August 2025
Hyderabad

A teaser plays a crucial role in presenting a film. The audience’s journey from the teaser to the movie begins right there. If a film has to reach the audience, it needs to release a strong teaser. Just a short while ago, one such teaser was unveiled. Though its release happened quietly, the impact it created afterward was enough to jolt viewers. While watching, it gives you chills on one side and sparks curiosity on the other. That’s the ‘Kishkindhapuri’ teaser…

“Namaskaram… today is Friday, 09/08/1989, the doors of Akashavani have opened, and rebroadcasts begin today” — as a woman’s fear-inducing voice delivers these lines, the visuals in the teaser hint at an old building where unexpected, terrifying events unfold.

Bellamkonda Srinivas and Anupama Parameswaran play the lead roles in this film. Produced by Sahu Garapati and directed by Kaushik Pegallapati, Kishkindhapuri is set to release on 12 September 2025.

ఉత్కంఠభరితంగా 'కిష్కింధపురి' టీజర్...!!

సినిమాను చెప్పడంలో టీజర్ పాత్ర కీలకం. టీజర్ నుండే ఆ సినిమా వరకూ ప్రేక్షకుడి ప్రయాణం మొదలవుతుంది. సినిమా ప్రేక్షకులకు చేరువ కావాలంటే అంత బలమైన టీజర్ ను బయటకు వదలగలగాలి. కొద్దిసేపటి క్రితమే ఒక టీజర్ బయటకు వచ్చింది. టీజర్ బయటకు రావడం నిశ్శబ్దంగానే వచ్చినా, తరువాత శబ్దం మాత్రం ఉలిక్కిపడేలా చేస్తుంది. చూస్తున్నప్పుడు ఒక వైపు ఒళ్లు గగుర్పొడిచేలా అనిపించినా మరోవైపు ఆసక్తిరేపేలా కూడా ఉంది. అదే 'కిష్కింధపురి' సినిమా టీజర్...

"నమస్కారం.. ఈరోజు శుక్రవారం, 09/08/1989, ఆకాశవాణి తలుపులు తెరవబడ్డాయి, పునః ప్రసారాలు నేటితో మొదలు" అంటూ ఓ స్త్రీ భయాన్ని సృష్టించే గొంతుతో వస్తున్న డైలాగ్స్ వింటుంటే, టీజర్ లో సన్నివేశాలు చూస్తుంటే ఓ పాత భవనం చుట్టూ ఏవో ఊహించని భయానక సంఘటనలు జరిగే కథలాగే అనిపిస్తుంది. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ మరియు అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను సాహు గారపాటి నిర్మించగా, కౌశిక్ పెగల్లపాటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా 12/09/2025 న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved