బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మిస్టీరియస్ అకల్ట్ థ్రిల్లర్ 'కిష్కింధపురి' అలరించబోతున్నారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచింది. ఈ చిత్రం సెప్టెంబర్ 12న విడుదల కానుంది. ఈ రోజు మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు.
'ఊరికి ఉత్తరాన, దారికి దక్షిణాన పశ్చిమ దిక్కున ప్రేతాత్మలన్నీ పేరు వినగానే తూర్పుకు తిరిగే ప్రదేశం' అనే డైలాగులతో మొదలైన ట్రైలర్ ఆద్యంతం కట్టిపడేసింది. హీరో, హీరోయిన్ సహా కొంతమంది స్నేహితుల ఆత్మలని అన్వేషిస్తూ సువర్ణ మాయ ఇంటిలోకి వెళ్తారు. అక్కడ వారు ఊహించని భయంకరమైన పరిస్థితులు ఎదురుకావడం మైండ్ బ్లోయింగ్ థ్రిల్ ని అందించాయి.
దర్శకుడు కౌశిక్ పెగల్లపాటి ఒక యూనిక్ హారర్ థ్రిల్లర్ ని ప్రజెంట్ చేశారు. మిస్టరీ, టెర్రిఫిక్ విజువల్స్, ఉత్కంఠభరితమైన సన్నివేశాలు డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చాయి.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టారు. ట్రైలర్ క్లైమాక్స్‌లో అనుపమ పరమేశ్వరన్ కనిపించిన తీరు హైలెట్ గా నిలిచింది.
చిన్మయ్ సలాస్కర్ సినిమాటోగ్రఫీ, చైతన్య భరద్వాజ్ సంగీతం థ్రిల్ ని మరింతగా పెంచాయి. సెట్స్ గ్రాండ్ గా వున్నాయి. విజువల్స్ ఎఫెక్ట్స్ అద్భుతంగా వున్నాయి. నిరంజన్ దేవరమానే ఎడిటింగ్ షార్ఫ్ గా వుంది. ఈ చిత్రానికి జి. కనిష్క క్రియేటివ్ హెడ్, దరహాస్ పాలకొల్లు కోరైటర్. మొత్తంమీద ట్రైలర్ కిష్కింధపురిపై అంచనాలని మరింతగా పెంచింది.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మా సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఆడియన్స్ కి మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఉండాలని కిష్కింధపురి చేయడం జరిగింది. మంచి సినిమా వస్తే తప్పకుండా జనం థియేటర్స్ కి వస్తారు. అది నేను నమ్ముతున్నాను. మా కిష్కింధపురి అలాంటి సినిమానే. ఒక మంచి థియేటర్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నాం. మా డైరెక్టర్ గారు చాలా అద్భుతమైన కథ చేసుకున్నారు. మీకు ఒక ఎడ్జ్ ఆఫ్ సీట్ థ్రిల్లర్ లాగా అనిపిస్తుంది. ఈ సినిమా చూస్తున్నప్పుడు ఫోన్ కూడా చూసుకునే టైం ఉండదు. అంతా అంత థ్రిల్లింగ్ గా ఉంటుంది. అంత మంచి కథ తీసినందుకు డైరెక్టర్ గారికి థాంక్యూ. మా మ్యూజిక్ డైరెక్టర్ చైతన్ భరద్వాజ్ గారు ఈ సినిమాతో నెక్స్ట్ లెవెల్ కి వెళ్తా.రు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమా వీఎఫ్ఎక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్స్ట్రార్డినరీ విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. చాలా నమ్మకంతో ఈ సినిమా చేశాం. మీ అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మా నిర్మాత సాహు గారి పాషన్ ప్రతి ఫ్రేంలో కనిపిస్తుంది. మా అందరికీ ఎంతగానో సపోర్ట్ చేశారు. ఆయనలాంటి ప్రొడ్యూసర్స్ సినిమా ఇండస్ట్రీకి మరింత మంది రావాలి. సెప్టెంబర్ 12న ఈ సినిమా థియేటర్స్ లో దద్దరిల్లిపోతుంది. సినిమానే మాట్లాడుతుంది. అందరికీ థాంక్యు.
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. మీ అందరికీ ట్రైలర్ నచ్చడం చాలా ఆనందంగా ఉంది. హారర్ నాకు ఇష్టమైన జానర్. డైరెక్టర్ కౌశిక్ ఈ సినిమా కథ చెప్పిన వెంటనే నాకు నచ్చింది. చాలా డిఫరెంట్ క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ కౌశిక్ కి థాంక్యూ.తను చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్. సాయి గారితో మరోసారి పనిచేయడం ఆనందంగా ఉంది. సాయితో కలిసి చేసిన రాక్షసుడు మాకు వెరీ మెమొరబుల్ ఫిలిం. మళ్లీ చాలా రోజుల తర్వాత సాయితో ఇలాంటి డిఫరెంట్ సినిమా చేయడం ఆనందాన్ని ఇచ్చింది. సినిమాలో పనిచేస్తున్న అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. సెప్టెంబర్ 12న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది అందరూ థియేటర్స్ కి వచ్చి చూడాలని కోరుకుంటున్నాను.
డైరెక్టర్ కౌశిక్ మాట్లాడుతూ... అందరికీ నమస్కారం. సాహు గారికి ఈ కథ చెప్పగానే సింగిల్ సిట్టింగ్లో ఓకే చెప్పారు. అలాగే సాయి గారికి కథ చెప్పిన వెంటనే నచ్చింది. సాయి గారు అనుపమ గారు కలిసి చేసిన రాక్షసుడు సినిమా చాలా పెద్ద హిట్ అయింది. ఈ సినిమా కూడా మీ అంచనాలకు మించి ఉంటుంది. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. నాకు సపోర్ట్ చేసిన మా టెక్నికల్ టీం అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. సినిమాలో ఫెంటాస్టిక్ విజువల్స్ ఉంటాయి. చైతన్ అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్ చేశారు. టెక్నికల్ గా సినిమా చాలా ఉన్నతంగా ఉంటుంది. మమ్మల్ని బిలివ్ చేసిన నిర్మాత సాహు గారికి థాంక్ యూ. సెప్టెంబర్ 12న సినిమా రిలీజ్ అవుతుంది. అందరూ థియేటర్స్ లో చూడండి. కచ్చితంగా మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది.
ప్రొడ్యూసర్ సాహు గారపాటి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ట్రైలర్ కి ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది. మేము ఎలాగైతే ఎక్సైట్ అయ్యామో ఆడియన్స్ కూడా అదే రకంగా ఎక్సైట్ అయ్యారు. ఈ సినిమా మీ అంచనాలకు తగ్గకుండా ఉంటుంది. సినిమా మీద చాలా నమ్మకంగా ఉన్నాం. ఖచ్చితంగా ఆడియన్స్ కి సినిమా నచ్చుతుంది. మా హీరో హీరోయిన్ టీమ్ అందరూ చాలా కష్టపడి పని చేశారు. వారి కష్టానికి మంచి గుర్తింపు తెచ్చే సినిమా అవుతుంది. సెప్టెంబర్ 12న ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను.
మ్యూజిక్ డైరెక్టర్ చైతన్ భరద్వాజ్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. చాలా కొత్తగా చేసిన సినిమా ఇది. ఇలాంటి అవకాశాన్ని ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. మన నిర్మాత సాహు గారు చాలా ప్యాషన్ తో చాలా బిగ్ స్కేల్ లో ఈ సినిమా చేశారు. మా మ్యూజిక్ టీమ్ అందరికీ థాంక్యు. సినిమాలో చాలా హై మూమెంట్స్ ఉన్నాయి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేసినప్పుడు చాలా ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. సెప్టెంబర్ 12 సినిమా వస్తుంది. ఖచ్చితంగా థియేటర్స్ లో చూడండి. మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది.
తారాగణం: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్, హైపర్ ఆది, నెల్లూరు సుదర్శన్ సాంకేతిక సిబ్బంది:
రచన & దర్శకత్వం - కౌశిక్ పెగళ్లపాటి
నిర్మాత - సాహు గారపాటి
బ్యానర్ - షైన్ స్క్రీన్స్
సమర్పణ - శ్రీమతి. అర్చన
సంగీతం - చైతన్ భరద్వాజ్
DOP - చిన్మయ్ సలాస్కర్
ప్రొడక్షన్ డిజైన్ - మనీషా ఎ దత్
ఆర్ట్ డైరెక్టర్ - డి శివ కామేష్
ఎడిటర్ - నిరంజన్ దేవరమానే
సహ రచయిత - దరహాస్ పాలకొల్లు
స్క్రిప్ట్ అసోసియేట్: కె బాల గణేష్
స్టంట్స్ - రామ్ క్రిషన్, నటరాజ్, జాషువా
కో-డైరెక్టర్ - లక్ష్మణ్ ముసులూరి
క్రియేటివ్ హెడ్ - కనిష్క.జి
ప్రొడక్షన్ కంట్రోలర్- సుబ్రహ్మణ్యం ఉప్పలపాటి
కాస్ట్యూమ్ డిజైనర్- లంకా సంతోషి
Vfx-DTM
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - టి సందీప్
#Kishkindapuri trailer packs a punch with its eerie and spine-chilling vibe! ☠️
Set in a dilapidated mansion, the story follows a ghost walking tour gone wrong. The haunting voiceover and unsettling background score promise a uniquely spooky experience.