A Go-to Love Song For All The Hearts That Feel Deeply- Breezy Love Number Kamsahamnida From Varun Tej, Ritika Naik’s Korean Kanakaraju Unveiled
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, రితికా నాయక్ 'కొరియన్ కనకరాజు' నుంచి బ్యూటిఫుల్ లవ్ సాంగ్ '‘కమ్సాహంనిదా' రిలీజ్
Mega Prince Varun Tej’s upcoming entertainer Korean Kanakaraju is progressing at a swift pace, with director Merlapaka Gandhi steering the project into its final shooting phase. Backed by UV Creations and First Frame Entertainment, the film promises a vibrant fusion of horror, humor, and cross-cultural flavour, unfolding across Indian and Korean landscapes. Varun Tej, who underwent a striking makeover for the role, is set to surprise audiences with a never-seen-before characterization. The team has now unveiled the film’s first single- Kamsahamnida.
The song scored by SS Thaman opens with Ritika Naik playfully uttering Kamsahamnida, prompting Varun Tej to curiously ask its meaning. Her reply, thank you in Korean, serves as a warm curtain-raiser to the romantic energy between them. The track is crafted with an airy, lively vibe, blending soft Korean touches with catchy mainstream elements. Kasarla Shyam’s writing brings out the innocence of new love, while Sid Sriram’s mellow yet expressive vocals elevate the emotion beautifully. Yash Master adds visual charm with choreography that mirrors the song’s cheerful tone.
Sporting a mass and rugged look, Varun Tej’s screen presence is vibrant and effortless, and his pairing with Ritika comes across as bright, lively, and refreshingly new. Their moments together, set against Thaman’s spirited beats, give the single an instant-repeat quality.
Kamsahamnida sets the right momentum for the film’s promotions, teasing both the tenderness and fun that the movie promises. Earlier, the title glimpse revealed on Varun Tej’s birthday ignited massive curiosity, instantly going viral for its stylish presentation and fun mood. The sneak peek offered a glimpse into the eccentric world of Korean Kanakaraju, hinting at a refreshing horror-comedy loaded with entertainment.
Th film features cinematography by Manoj Reddy Katasani, while editing is handled by Satyaa G.
With shooting nearly finished, the team is expected to reveal the release date soon, further boosting anticipation for this unique horror-comedy entertainer.
Cast: Varun Tej, Ritika Naik, Satya
Writer & Director: Merlapaka Gandhi
Producers: UV Creations, First Frame Entertainment
Music: S Thaman
DOP: Manoj Reddy Katasani
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, రితికా నాయక్ 'కొరియన్ కనకరాజు' నుంచి బ్యూటిఫుల్ లవ్ సాంగ్ '‘కమ్సాహంనిదా' రిలీజ్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు' వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది, మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను చివరి దశకు చేరుకుంది. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రం, భారతీయ, కొరియన్ నేపథ్యాలలో హారర్, కామెడీ,క్రాస్ కల్చర్ మేళవింపుతో పుల్ లెంత్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. ఈ క్యారెక్టర్ కోసం అద్భుతమైన మేకోవర్ అయిన వరుణ్ తేజ్, మునుపెన్నడూ చూడని పాత్రతో ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. చిత్ర బృందం ఇప్పుడు ఈ ఫస్ట్ మొదటి సింగిల్ 'కమ్సాహంనిదా'ను విడుదల చేసింది.
ఎస్.ఎస్. థమన్ సంగీతం అందించిన ఈ పాట రితికా నాయక్ సరదాగా 'కమ్సాహంనిదా' అని పలకడంతో ప్రారంభమవుతుంది. దానికి అర్థం ఏమిటని వరుణ్ తేజ్ ఆసక్తిగా అడుగుతాడు. కొరియన్ భాషలో 'ధన్యవాదాలు' అనే సమాధానం చెప్పడం, వారి మధ్య ఉన్న ప్రేమకు చక్కటి నాంది పలుకుతుంది. ఈ పాటను సున్నితమైన కొరియన్ టచ్స్, ఆకట్టుకునే మెయిన్‌స్ట్రీమ్ ఎలిమెంట్స్ తో మేళవించి అద్భుతంగా కంపోజ్ చేశారు. కాసర్ల శ్యామ్ రచన కొత్త ప్రేమలోని అమాయకత్వాన్ని ప్రజెంట్ చేయగా, సిద్ శ్రీరామ్ సాఫ్ట్ వోకల్స్ ఎమోషన్ ని మరోస్థాయికి తీసుకువెళ్తుంది. యాష్ మాస్టర్ రూపొందించిన కొరియోగ్రఫీ పాటలోని హ్యాపీ వైబ్‌ను ప్రజెంట్ చేస్తూ విజువల్‌గా ఆకట్టుకుంటుంది.
మాస్, రగ్డ్ లుక్‌లో కనిపించిన వరుణ్ తేజ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఎనర్జీతో కట్టిపడేశారు. రితికాతో ఆయన కెమిస్ట్రీ కొత్తగా, ఫ్రెష్‌గా అనిపిస్తుంది. థమన్ బీట్‌లకు తగ్గట్టు వీరి కాంబినేషన్ సాంగ్‌కు ఇన్‌స్టంట్ రీపీట్ ఫీల్‌ను ఇస్తుంది.
ఈ పాట సినిమా ప్రమోషన్స్‌కు సరైన జోష్ ఇచ్చింది. ఇందులో ప్రేమతో పాటు వినోదం కూడా ఉండబోతుందనే సంకేతాలు ఇస్తుంది. ఇప్పటికే వరుణ్ తేజ్ పుట్టినరోజున రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ వైరల్ అయింది. “కొరియన్ కనకరాజు” అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా హారర్-కామెడీగా అదిరిపోయే ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వబోతుంది.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ మనోజ్ రెడ్డి కటాసాని అందిస్తుండగా, ఎడిటింగ్ సత్యా జి నిర్వహిస్తున్నారు.
షూటింగ్ దాదాపు పూర్తికావడంతో మేకర్స్ త్వరలో రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.
తారాగణం: వరుణ్ తేజ్, రితికా నాయక్, సత్య
రచన, దర్శకత్వం: మేర్లపాక గాంధీ
నిర్మాతలు: యువి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్
సంగీతం: ఎస్ థమన్
DOP: మనోజ్ రెడ్డి కాటసాని