"Oka chinnadi unnadi kanyakala.. adi kanipistundi naakokala..
Aa kannaku anni ekkuvara.. naa kannulake adi makkuvara.."
This fun-filled track from the upcoming film Kothapallilo Okapudu was released today, and much like the film's title, the song stands out with its fresh and playful tone. Once again, Mani Sharma’s musical magic shines through, bringing life to the lyrics with his signature touch.
Lyricist Chaitanya Prasad truly steals the spotlight with his creative wordplay. His clever and witty use of language adds a unique flavor, while singer Dhanunjay Seepana’s expressive vocals elevate the song with extra charm. Mani Sharma proves once again why he is a master at composing such imaginative melodies.
The song unfolds with the hero following the heroine, singing "Ranga Nayaki Ranga Nayaki", praising her beauty in a whimsically poetic manner. Lines like
“Kannyaku aidu pikkalura... ee kannyaku aaru kuchamulura,”
“Kannyaku nalugu kanubommalu... ee kannyaku edu kannulura”
may sound curious and puzzling at first, but they compel the listener to wait till the end for a delightful payoff. Chaitanya Prasad ensures that the mystery and curiosity are sustained till the final lines, making the comparisons all the more entertaining.
Director Praveena Paruchuri, despite residing abroad, displays a strong affection for the Telugu language – clearly evident in the way the song is written and conceptualized. The lyrical video reflects rustic village beauty and traditional charm, hinting that the film will be a visual treat that celebrates rural life and language with heart and humor.
'కొత్తపల్లిలో ఒకప్పుడు' నుండి గమ్మత్తైన పదజాలంతో 'రంగనాయకీ' పాట!
"ఒక చిన్నది ఉన్నది కన్యకలా.. అది కనిపిస్తున్నది నాకొకలా..
ఆ కన్నెకు అన్నీ ఎక్కువరా.. నా కన్నులకే అది మక్కువరా.." అంటూ సాగే ఈ పాట 'కొత్తపల్లిలో ఒకప్పుడు' సినిమా నుండి ఈరోజే బయటకు వచ్చింది. సినిమా పేరు మాదిరే పాట తీరు కూడా కొత్తగా ఉంది. మరోమారు మణిశర్మ మేజిక్ ఈపాటలో మళ్ళీ కనిపించింది. ముఖ్యంగా లిరిసిస్ట్ చైతన్య ప్రసాద్ ఈ పాటలో అతని పద ప్రయోగం ఆకట్టుకునేలా ఉంది. సింగర్ ధనుంజయ్ సీపాన గాత్రం కూడా ఈ పాటకు అదనపు హంగులను అద్దిందనే చెప్పుకోవచ్చు. ఇలాంటి మెలికలున్న పాటలను మలచడంలో మణిశర్మ ఎంతటి సిద్ధహస్తుడో అన్న సంగతి మనకర్ధమవుతుంది.
రంగ నాయకీ రంగ నాయకీ అంటూ హీరోయిన్ వెంట పడుతూ హీరో పాడుతున్న ఈ పాటలో ప్రియుడు తన ప్రేయసి అందాన్ని వర్ణిస్తూ వివరించిన విధానం ఆకట్టుకునేలా అనిపిస్తుంది. "కన్యకు అయిదు పిక్కలురా.. ఈ కన్యకు ఆరు కుచములురా", "కన్యకు నాల్గు కనుబొమ్మలు.. ఈ కన్యకు ఏడు కన్నులురా" అంటూ వచ్చే చరణాలు వినడానికి భలే వింతగా అనిపించినా వాటి అర్ధం తెలియాలంటే ఆ పాట పూర్తయ్యేవరకూ ఎదురు చూసేలా రాసారు రచయిత చైతన్య ప్రసాద్. ప్రియురాలి అందాన్ని వేటితో పోల్చాడన్న విషయం పాట చివరకొచ్చే వరకూ చూస్తున్న ప్రేక్షకులకు తట్టకుండా, అంతలా బిగువున పట్టు జారకుండా రాయగలిగాడు రచయిత. దర్శకురాలు ప్రవీణ పరుచూరి విదేశాల్లో ఉంటున్నా కూడా తెలుగు భాషపై ఆమెకున్న మక్కువ ఈ పాటలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. పల్లెటూరి అందాలు, అక్కడి ఊసులతో ఈ సినిమా కన్నుల విందుగా ఉన్నట్టుగానే చిత్రీకరణ జరిగినట్టు ఈ పాట లిరికల్ వీడియో చూస్తే అర్ధం అవుతుంది.
Mani Sharma’s vintage-style composition enhances the vibe, while lyricist Chaitanya Prasad’s creative use of numbers in Kanya’s portions stands out… pic.twitter.com/7PdefE0VxG