Manoj Chandra about Kothapallilo Okappudu
'కొత్తపల్లిలో ఒకప్పుడు' అవుట్ అండ్ అవుట్ కామెడీ & ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఆడియెన్స్ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు: హీరో మనోజ్ చంద్ర
రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ప్రజెంట్ చేస్తున్న రూరల్ కామెడీ 'కొత్తపల్లిలో ఒకప్పుడు'. C/O కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలతో అనుబంధం కలిగిఉన్న నటి-చిత్రనిర్మాత ప్రవీణ పరుచూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పరుచూరి విజయ ప్రవీణ ఆర్ట్స్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది. మనోజ్ చంద్ర, మోనికా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఫస్ట్ లుక్, టీజర్ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ఈ నెల 18న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో మనోజ్ చంద్ర విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
మీ నేపధ్యం ఏమిటి ? సినిమా అవకాశం ఎలా వచ్చింది?
-మాది వైజాగ్. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదువుకోడానికి హైదరాబాద్ వచ్చాను. నాకు సినిమాలంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. 17 ఏళ్లప్పుడే ఒక సినిమాకి ఆడిషన్ కూడా ఇచ్చాను.
చదువు కొనసాగిస్తూనే ప్రయత్నాలు చేశాను. కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేశాం. అలాగే టీవీలో కొంతకాలం ఇంటర్వ్యూలు చేశాను. అక్కడ కొన్ని పరిచయాలు ఏర్పడ్డాయి. తర్వాత ఉద్యోగం కోసం వేరే వేరే దేశాలు తిరుగుతూ చివరికి అమెరికా వెళ్లాను. నాకు ఎప్పుడు కూడా సినిమాల్లోకి రావాలనే ఉండేది. చిన్న చిన్న పాత్రలు చేశాను కానీ అవి అంత గుర్తింపు తెచ్చేలా రాలేదు.
కేరాఫ్ కంచరపాలెం సినిమా చూసిన తర్వాత నాకు మళ్ళీ అసలు చిగురించాయి. ఆ తర్వాత స్టోరీ రైటింగ్ కంటెంట్ క్రియేషన్ మీద చాలా ఆసక్తి ఏర్పడింది. కోవిడ్ సమయంలో హాలీవుడ్ ఫిలిం క్లాసెస్ లో కొన్ని ఫిలిం క్లాసెస్ అటెండ్ అయ్యే వాడిని. అలా ఓ క్రిస్మస్ ఫిలింలో ఒక అవకాశం దొరికింది. ఆ సినిమాతో నైజీరియా వెళ్లే అవకాశం దొరికింది. అది ఒక మంచి ఎక్స్పీరియన్స్.
మెన్ ఇన్ బ్లూ అనే ఫిలిం లో ఛాన్స్ వచ్చింది. ఆ సినిమాకి అంతర్జాతీయంగా మంచి పేరు వచ్చింది. ఈ సినిమా తీసిన డైరెక్టర్ ఒక కథను రాసుకొని దానికి ప్రవీణ పరుచూరి గారు యాక్టర్ అయితే బాగుంటుంది అని నాతో చెప్పడం జరిగింది. నాకు అప్పటికే ప్రవీణ గారితో పరిచయం ఉంది. సరిగ్గా ఇదే సమయంలో ప్రవీణ గారు, రామకృష్ణ అనే క్యారెక్టర్ కోసం వెతుకుతున్నారు.
రామకృష్ణ క్యారెక్టర్ గురించి చెప్పి స్క్రిప్ట్ చదవమని ఇచ్చారు. అది నాకు చాలా నచ్చింది. ఈ సినిమాల్లో హీరో క్యారెక్టర్ లా అనిపించింది. ఎలాగైనా ఈ పాత్రని చేయాలని చాలా హోంవర్క్ చేసుకున్నాను. ఆడిషన్స్ ఇచ్చాను. ఫైనల్ గా ప్రవీణ్ గారికి నచ్చాయి. ఇంకా చాలా మార్పులు చేశారు. మొత్తానికి తను అనుకున్నట్లుగా క్యారెక్టర్ కి నేను న్యాయం చేయగలనని వారికి నమ్మకం కుదిరింది. అలా ఈ సినిమా చేసే అవకాశం దక్కింది.
ఈ సినిమా కాన్సెప్ట్ ఏమిటి? మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది?
-ఇది ఒక ఊరి కథ. నేను రామకృష్ణ అనే పాత్రలో కనిపిస్తా. అప్పన్న అనే ఒక వడ్డీ వ్యాపారి దగ్గర నేను పని చేస్తుంటాను. తను ఇచ్చిన అప్పులన్నీ నేను వసూలు చేస్తుంటాను. అప్పన్నకి జనాలకి మధ్య ఉన్న మీడియం నేను. నా పాత్ర కూడా ఒక అవకాశం అది పాత్ర. రామకృష్ణ కి ఒక రికార్డింగ్ డాన్స్ స్టూడియో ఉంటుంది. అప్పన్న నుంచి ఎంత త్వరగా బయటపడాలని తాపత్రయపడుతుంటాడు. అలాగే రామకృష్ణకి సావిత్రి అనే అమ్మాయి అంటే ఇష్టం. ఒకరోజు సావిత్రిని కలవడానికి ఒక గడ్డి వాము దగ్గరికి వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది కథ.
రామకృష్ణ క్యారెక్టర్ వెరీ చాలెంజింగ్. ఒక కొత్త యాక్టర్ గా నాపై నమ్మకం ఉంచడం నాకు మరింత బాధ్యతను పెంచింది. ఒక ఆర్టిస్ట్ గా నాకు చాలా ఫ్రీడం ఇచ్చారు. సినిమా ఛానల్ అద్భుతంగా వచ్చింది అన్ని జాగ్రత్తలు తీసుకుని సినిమా చేశాం. ఒక పెద్ద సినిమాలాగే చేశాం.
బెనర్జీ, రవీంద్ర విజయ్ గారితో నటించడం ఎలా అనిపించింది?
-సీనియర్ యాక్టర్స్ తో నటించడం ఒక అదృష్టం. అందరం కూడా ఒక ప్రొఫెషనల్ వేవ్ లెంత్ లో వర్క్ చేసాం. ప్రవీణ గారు అందరిని ఒక టీం గా అద్భుతంగా ముందుకు తీసుకువెళ్లారు.
ప్రవీణ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
-ప్రవీణ గారు ఒక పాషన్ తో వచ్చినప్పుడు డైరెక్టర్. ప్రొఫెషనల్ గా ముందుకు నడిపించారు. ఎన్ని కష్టాలు వచ్చినా సినిమాని ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తీశారు. చాలా అద్భుతమైన క్వాలిటీతో సినిమాలు తీసుకొచ్చారు.
రానా గారి గురించి?
-సినిమా పూర్తి చేసి రానా గారి దగ్గర తీసుకెళ్లాం. ఆయనకి సినిమా నచ్చింది. ఆయన సినిమాని ప్రజెంట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ప్రిమియర్స్ ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది?
-వైజాగ్ విజయవాడ వరంగల్ ఇలా కొన్నిచోట్ల ప్రివ్యూస్ వేయడం జరిగింది. అన్ని వర్గాల ప్రేక్షకులు బఫా గా రిసీవ్ చేసుకున్నారు. కడుపుబ్బా నవ్వుకున్నారు. ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు. అందరూ కూడా ఇది రియల్ గా మా ప్రాంతంలో జరిగిన కథలాగే అనిపిస్తుంది అని అన్నారు. చాలా నమ్మకంగా ఉన్నాము హానెస్ట్ గా సినిమా తీశాము. ఇది అవుట్ అండ్ అవుట్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్.
ఈ సినిమాకి ఫారెన్ డిఓపి పనిచేయడానికి కారణం?
-మనం అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ ప్రదేశాలన్నీ మనకు చాలా అందంగా కనిపిస్తాయి. అలాగే అమెరికన్ కూడా ఇండియా వస్తే ఆయన ఈ ప్రాంతాన్ని చూసే కోణం చాలా భిన్నంగా ఉంటుంది. ప్రవీణ గారి ఆలోచన కూడా ఇదే. అక్కడి వ్యక్తి మన ఊరు చూస్తే ఎంత అందంగా ఉంటుందో అలాంటి విజువల్స్ బ్యూటీ కోసం ఫారిన్ డిఓపి తో వర్క్ చేయడం జరిగింది. సినిమా విజువల్ గా చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది.
కొత్తగా ఏవైనా సినిమాలు ఒప్పుకున్నారా?
-కొత్తగా కొన్ని అవకాశాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే నేను ఈ క్షణం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూశాను. ప్రస్తుతం ప్రజెంట్ గురించే ఆలోచిస్తున్నాను. ఈ సినిమా విడుదల కోసం ఎంతో ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నాను.