pizza

Kothapallilo Okappudu teaser promises a rooted situational comedy
'కొత్తపల్లిలో ఒకప్పుడు' టీజర్ నిత్యం జరిగే పల్లెటూళ్ల సందడిని చూపిస్తోంది..

You are at idlebrain.com > news today >

04 July 2025
Hyderabad

The teaser of Kothapallilo Okappudu, which marks the directorial debut of producer Praveena Paruchuri who produced acclaimed films like C/o Kancharapalem and Uma Maheswara Ugra Roopasya was dropped by film’s presenter Rana Daggubati on Friday on X and it promises a delightful satire.

Roughly one minute in length, the teaser opens with a village sarpanch played by Benerjee visibly upset at the commotion outside his house. As he sits down and tries to get a hang of the new problem he is confronted with, the clip flashbacks to Ramakrishna (played by Manoj Chandra) who is envy with the success of a recording troupe. He instantly decides to set up his own outfit and begins his search for dancers in his village. He sets his eyes on a woman and as he desperately tries to convince her, some villagers notice him tracking her. Soon he lands in a soup and eventually ends up at the panchayat, leading to a lot of confusion, chaos and moments of laughter. To know more, we have to wait until July 18th when the film opens.

Summing up, the teaser gives away the premise of the film and prepares the viewers to expect a laugh riot deriving its humour from the hinterland of Telugu states with quirky characters thrown into the mix. In fact, the characters look like they are plucked out from real life, while the actors keep the proceedings real starting from a senior like Benerjee to a youngster like Manoj, with colloquial lines helping their cause more. Praveena makes a confident debut as a director with complete control over the story and from this brief glimpse, its certain that she has a winner in hand.

Also featuring Ravindra Vijay, Bongu Satti, Phani and Premsagar, Praveena has also produced the film under her Paruchuri Vijaya Praveena Arts, with Mani Sharma scoring music for the songs, while Varun Unni is composing the background score.

'కొత్తపల్లిలో ఒకప్పుడు' టీజర్ నిత్యం జరిగే పల్లెటూళ్ల సందడిని చూపిస్తోంది..

'C/O కంచరపాలెం', 'ఉమ మహేశ్వర ఉగ్ర రూపస్య' వంటి ప్రేక్షకుల ప్రశంసలు పొందిన చిత్రాలను నిర్మించిన ప్రవీణా పరుచూరి దర్శకురాలిగా పరిచయమవుతోన్న “కొత్తపల్లిలో ఒకప్పుడు” టీజర్ శుక్రవారం రానా దగ్గుబాటి చేతుల మీదుగా X లో విడుదల అయ్యింది. ఇది ఒక చక్కటి గ్రామీణ రాజకీయ నేపథ్యంలో జరిగే సున్నితమైన హాస్యాన్నిచూపిస్తోంది.

సుమారుగా ఒక నిమిషం నిడివి ఉన్న ఈ టీజర్ ఒక గ్రామ సర్పంచ్ (బెనర్జీ) తన ఇంటి బయట జరుగుతున్న ఒక పంచాయితీలో అక్కడున్న వాళ్లపై చిరాకు వ్యక్తం చేస్తూ మొదలవుతుంది. ఆయన కూర్చొని ఈ కొత్త సమస్య ఏమిటో తెలుసుకోవాలని ప్రయత్నిస్తుండగా, ఈ టీజర్ లో రామకృష్ణ (మనోజ్ చంద్ర ) ఆందోళన పడుతూ, అతను ఒక రికార్డింగ్ ట్రూప్ విజయం చూసి రగిలిపోతూ ఉంటాడు. వెంటనే తన స్వంత ట్రూప్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకొని, తన గ్రామంలో డాన్సర్స్ కోసం వెతకడం మొదలుపెడతాడు. ఈ క్రమంలో ఒక అమ్మాయిని చూసి ఆమెను ఒప్పించడానికి ప్రయత్నిస్తుండగా, కొంతమంది గ్రామస్తులు అతను ఆమెను గమనిస్తున్నట్లు చూస్తారు. ఇలా అతను సమస్యలో చిక్కుకుని చివరికి పంచాయితీకి చేరుకుంటాడు, దాంతో గ్రామంలో గందరగోళం, కామెడీ మొదలవుతాయి. మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే జూలై 18న సినిమా విడుదలయ్యే వరకు ఆగాల్సి ఉంటుంది.

ఒక మాటలో చెప్పాలంటే, ఈ టీజర్ సినిమా మూల కథను వివరిస్తూ, తెలుగు గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే స్థానికమైన హాస్యాన్ని చమత్కారం నిండిన పాత్రలతో కలిపి ప్రేక్షకులను నవ్వించడానికి సిద్ధం చేస్తోంది. వాస్తవానికి, ఈ పాత్రలు నిజ జీవితంలో నుండి తీసినట్టు అనిపించగా, బెనర్జీ లాంటి సీనియర్ నుండి మనోజ్ లాంటి యువ నటుడి వరకు అందరూ ఆ ఆ పాత్రల్లో ఒదిగిపోయి , స్థానిక గ్రామీణ సంభాషణలతో మరింత చక్కగా నటించారు. దర్శకురాలిగా ప్రవీణ పరుచూరి తనది మొదటి సినిమాయే అయినా, ఎంతో అనుభవం ఉన్నట్టే చిత్రీకరించినట్టుగా ఈ చిన్న గ్లిమ్ప్స్ ద్వారా అనిపిస్తోంది.. ఈ సినిమాతో ఆమె హిట్ కొట్టేట్టు కనిపిస్తుంది.

రవీంద్ర విజయ్, బొంగు సత్తి, ఫణి, ప్రేమ్‌సాగర్ ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా, ప్రవీణ తన 'పరుచూరి విజయ ప్రవీణ ఆర్ట్స్' పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించారు. మణిశర్మ పాటలకు సంగీతం అందిస్తుండగా, వెరున్ ఉన్ని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved