pizza

Dhanush, 'King' Nagarjuna, Sekhar Kammula Kubera Crucial & Lengthy Shooting Schedule Begins In Mumbai
ధనుష్, 'కింగ్' నాగార్జున, శేఖర్ కమ్ముల, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ 'కుబేర' కీలక & లెన్తీ షూటింగ్ షెడ్యూల్ ముంబైలో ప్రారంభం

You are at idlebrain.com > news today >

25 April 2024
Hyderabad

The excitement for Sekhar Kammula's Kubera skyrocketed with the unveiling of the title along with the first look of Dhanush, last month. The National Award-winning actor was presented in a never-before-seen avatar, adding to the intrigue around the film. While the audiences were intently awaiting for the looks of the other cast members to be revealed, expectations were further heightened, when a sneak peek of King Nagarjuna Akkineni in a classy avatar, surfaced from the film's Bangkok schedule. Though Nagarjuna's look wasn’t revealed in the working still, it was a treat enough for fans who were pleased to see him in a stylish look.

National Award-winning director Sekhar Kammula who delivered two back-to-back hits is making Kubera in an ambitious manner, with the casting of Dhanush and Nagarjuna in the lead roles being the first step in this direction. The addition of Rashmika Mandanna as the female lead opposite Dhanush further solidified the stature of this crazy Pan India film produced by Suniel Narang and Puskur Ram Mohan Rao, with the blessings of Shri Narayan Das K Narang, under their banner Sree Venkateswara Cinemas LLP (A Unit Of Asian Group), in association with Amigos Creations Pvt Ltd. Sonali Narang presents the movie.

Considering the buzz surrounding the movie, Sekhar Kammula and team are crafting it with extra care. Sekhar Kammula is making the entertainer on a large canvas. The film's latest shooting schedule is currently underway in Mumbai. This massive schedule for the magnum opus is 12 days long and being shot in various locations across the city. This is a crucial and lengthy schedule where some important talkie portions involving Dhanush, Rashmika Mandanna, and others, are expected to be filmed along with a few action episodes. Some fresh, standout visuals are expected. The working still released by the team shows Dhanush standing on top of a water pipeline.

Kubera is one of the highest-budgeted movies among the Pan India films coming this year. Sekhar Kammula who earlier made sensible and concept-based movies is going to surprise the audience with new content, complete with commercial ingredients in the right proportions. Fans of Dhanush and Nagarjuna are excited to see their favorite stars together on screen, and Rashmika's role will have good importance along with Dhanush and Nagarjuna’s characters.

National award-winning composer Rockstar Devi Sri Prasad scores the music, while Niketh Bommi handles the cinematography.

Cast: Dhanush, Nagarjuna Akkineni, Rashmika Mandanna, Jim Sarbh and others

Technical Crew:
Director: Sekhar Kammula
Presents: Sonali Narang
Banner: Sree Venkateswara Cinemas LLP, Amigos Creations Pvt Ltd
Producers: Suniel Narang and Puskur Ram Mohan Rao
Music Director: Devi Sri Prasad
Director of Photography: Niketh Bommi
Co-Writer: Chaithanya Pingali

ధనుష్, 'కింగ్' నాగార్జున, శేఖర్ కమ్ముల, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ 'కుబేర' కీలక & లెన్తీ షూటింగ్ షెడ్యూల్ ముంబైలో ప్రారంభం

గత నెలలో ఫస్ట్‌లుక్‌ విడుదలైన తర్వాత 'కుబేర'పై ఎక్సయిట్మెంట్ రెట్టింపైంది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ ధనుష్ ఫస్ట్ లుక్‌లో ఊహించని అవతార్‌లో కనిపించారు. కింగ్ నాగార్జున అక్కినేని క్లాస్ అవతార్‌లో కనిపిస్తున్న బ్యాంకాక్ షెడ్యూల్ నుండి స్నీక్ పీక్ మరొక పెద్ద సర్ ప్రైజ్ ఇచ్చింది. వర్కింగ్ స్టిల్స్‌లో నాగ్ లుక్ రివీల్ కానప్పటికీ, అతనిని స్టైలిష్ లుక్‌లో చూసి అభిమానులు ఫిదా అయ్యారు.

రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్‌లను అందించిన నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ప్రతిష్టాత్మకంగా 'కుబేర' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ధనుష్, నాగార్జునలను లీడ్ పాత్రలకు ఎంపిక చేయడం ఈ చిత్రానికి మొదటి విజయం. అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP (ఏషియన్ గ్రూప్) బ్యానర్‌పై శ్రీ నారాయణ్ దాస్ కె నారంగ్ ఆశీస్సులతో సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్న ఈ క్రేజీ పాన్ ఇండియా చిత్రంలో ధనుష్ సరసన రష్మిక మందన్న కథానాయిక. సోనాలి నారంగ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

సినిమా చుట్టూ ఉన్న బజ్‌ని దృష్టిలో ఉంచుకుని, శేఖర్ కమ్ముల అండ్ టీమ్ చాలా జాగ్రత్తతో రూపొందిస్తున్నారు. ఈ సినిమా తాజా షూటింగ్ షెడ్యూల్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. మాగ్నమ్ ఓపస్ కోసం ఈ మ్యాసీవ్ షెడ్యూల్ 12 రోజుల పాటు నగరంలోని వివిధ ప్రదేశాలలో షూట్ చేస్తున్నారు. ఇది కీలకమైన, లెన్తీ షెడ్యూల్. ఈ షెడ్యూల్ లో ధనుష్, రష్మిక మందన్న, ఇతరులతో కూడిన కొన్ని ముఖ్యమైన టాకీ పార్ట్స్, కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్‌తో పాటు చిత్రీకరిస్తున్నారు. విజువల్స్ చాలా అద్భుతమైన ఉండబోతున్నాయి. టీమ్ విడుదల చేసిన వర్కింగ్ స్టిల్‌లో ధనుష్ వాటర్ పైప్‌లైన్ పైన నిలబడి ఉన్నట్లు ప్రజెంట్ చేస్తోంది.

ఈ ఏడాది వస్తున్న పాన్ ఇండియా చిత్రాలలో హై బడ్జెట్‌తో రూపొందిన సినిమాల్లో కుబేర ఒకటి. ఇంతకుముందు సెన్సిబుల్, కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ చేసిన శేఖర్ కమ్ముల అన్ని కమర్షియల్ హంగులను సరైన నిష్పత్తిలో కలిగి ఉండే కొత్త కంటెంట్‌తో ప్రేక్షకులను ఆశ్చర్యపరచబోతున్నారు. ధనుష్, నాగార్జున అభిమానులు తమ అభిమాన స్టార్స్ ని కలిసి తెరపై చూడాలని క్యురియాసిటీతో ఉన్నారు. ధనుష్, నాగార్జున పాత్రలతో పాటు రష్మిక పాత్రకు కూడా మంచి ప్రాధాన్యత ఉంటుంది.

నేషనల్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చగా, నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.

తారాగణం: ధనుష్, నాగార్జున అక్కినేని, రష్మిక మందన, జిమ్ సర్భ్ తదితరులు

సాంకేతిక విభాగం:
దర్శకత్వం: శేఖర్ కమ్ముల
సమర్పణ: సోనాలి నారంగ్
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్
నిర్మాతలు: సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: నికేత్ బొమ్మి
సహ రచయిత: చైతన్య పింగళి

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved