pizza

Audience and families thoroughly enjoying Kushi: Kushi team at success meet
"ఖుషి" మూవీని సకుటుంబంగా ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు - సక్సెస్ మీట్ లో మూవీ టీమ్

You are at idlebrain.com > news today >
Follow Us

1 September 2023
Hyderabad

Vijay Devarakonda and Samantha starrer Kushi released in theatres today and got super hit talk from the audience. This movie was helmed by director Shiva Nirvana under Mythri Movie Makers banner. Kushi is unanimously loved by the audience as a love and family entertainer, and the team held a success meet today. On this occasion,

Producer Naveen Yerneni said - Kushi movie was unanimous positive response from the audience. We are getting calls from early morning from US. It is said that the movie was a great success. Family and youth audience are all enjoying Kushi movie. This is the biggest openings in Vijay's career. In the morning we went to IMAX, RTC X Roads Theatres and audience response was great. Distributors are calling continuously. Show by show collections are reported to be increasing. We will tell you in a few days how much more Kushi will go. It is a very clean movie. A movie like this has not come out in recent times. As it is a good movie, there is also a chance for awards. We can get awards for director Shiva Garu, music director Hesham, hero Vijay, heroine Samantha, production house. Thanks to Shiva for giving such a good super hit to our organization. Also thanks to Vijay, Samantha, music director Hesham and our whole team

Producer Y Ravi Shankar said - What we believed when we heard Kushi's story became true. Box office numbers are increasing show by show.. Kushi will have a long run in theaters as the musical and family entertainer. Extraordinary reports are coming from every place where the movie has been released. Vijay gave a superb performance. Also Samantha's acting is very good. Audience enjoying Hesham music. The audience comes to an estimate by looking at the promotional content we do for each hero film. I think the movie will be like this. That's why every movie gets its correct result from the first show. Our movie has an overall positive response. We are thanking our director Shiva Garu for making a film that everyone will like.

Director Shiva Nirvana said - I am happy to see the response of the audience for our movie Kushi. Appreciations are coming from media persons saying that the movie is good. I believe that the media will judge the film correctly. It is nice to get a positive report from media. God, Beliefs and Karma theory has existed in our country for hundreds of years. With this background, I wrote Kushi's story back in two years ago, wanting to tell a beautiful love story to the present society. The audiences are connecting to that point. Morning show starts with youth and from matinee couples are going. Total families are going for the first show. Vijay has shown good timing and emotion in his performance. Also Samantha's performance is very good. It is said that the first half is good with fun and love, and the family elements and emotion in the second half are said to be good. The climax at the end is said to have been handled well. Appreciation is coming that a difficult point has been shown in a very simple way to reach everyone. As a director I have risen to another level in the minds of the audience. Every middle class family has a hero. Instead of his image as a star, Vijay acted naturally by understanding the revolutionary character. He thinks that we as humans should achieve anything with our own strength. I made a love story because there is such a new point. In the last half hour, we had planned to take the audience into an emotional mood. I am happy that it worked out well and reached the audience. Ideologies and sciences may be different but we have said in this movie that we should be with people who love us no matter what they believe. The ending would not have been well received if the characters were not sustained until the climax. If you watch the emotion climax for that long, you will feel connected with the movie right there. There is no good or bad climax in the history of cinema. Audience are coming out of the theatre with the feeling of watching a good movie. Special thanks to music director Hesham. They are enjoying the songs in the theatre. Congratulations to all our producers and the rest of the team.

Music director Hesham Abdul Wahab said - We are happy that you liked the efforts we put in the movie Kushi. The movie is getting good response from all the audience. Thanks to director Siva, producers Naveen and Ravi Shankar for giving me the opportunity to work on this film.

Cinematographer G. Murali said - Thanks to Mythri and Shiva garu for giving an opportunity to work fot Kushi. Visuals are added only if the script is good. Because of the beautiful story, I was able to give good visuals. I watched the movie in Sandhya theater among the audience. They are all enjoying it fully. I am happy that the movie is a big hit.

Mythri distributor Shashi said - I watched the movie Kushi with my family. Everyone in our house liked the movie. Collections are increasing every show. It will be a big hit in Vijay's career.

"ఖుషి" మూవీని సకుటుంబంగా ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు - సక్సెస్ మీట్ లో మూవీ టీమ్

విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఖుషి సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై దర్శకుడు శివ నిర్వాణ రూపొందించారు. లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ప్రేమను ఏకగ్రీవంగా పొందుతున్న ఖుషి సక్సెస్ మీట్ ను చిత్ర నిర్మాణ సంస్థ ఆఫీస్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ - ఖుషి సినిమాను ప్రేక్షకులు యూనానమస్ గా సూపర్ హిట్ చేశారు. ఎర్లీ మార్నింగ్ నుంచి యూఎస్ కాల్స్ వస్తున్నాయి. సినిమా ఘన విజయం అందుకుందని చెబుతున్నారు. ఫ్యామిలీ, యూత్ ఆడియెన్స్ అందరూ ఖుషి మూవీని ఎంజాయ్ చేస్తున్నారు. విజయ్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి. మేము మార్నింగ్ ఐమాక్స్, క్రాస్ రోడ్స్ థియేటర్స్ కు వెళ్లాం. ఆడియెన్స్ రెస్పాన్స్ చాలా బాగుంది. డిస్ట్రిబ్యూటర్స్ కంటిన్యూస్ గా కాల్స్ చేస్తున్నారు. షో బై షో కలెక్షన్స్ పెరుగుతున్నాయని రిపోర్ట్ ఇస్తున్నారు. ఖుషి ఇంకా ఎంత పెద్ద రేంజ్ కు వెళ్లుందో మరికొద్ది రోజుల్లో చెబుతాం. వెరీ క్లీన్ మూవీ ఇది. ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమా రాలేదు. మంచి మూవీ కాబట్టి అవార్డ్స్ కు కూడా అవకాశం ఉంది. డైరెక్టర్ శివ గారు, మ్యూజిక్ డైరెెక్టర్ హేషమ్, హీరో విజయ్, హీరోయిన్ సమంత, ప్రొడక్షన్ హౌస్ గా మాకు అవార్డ్స్ రావొచ్చు. మా సంస్థకు ఇంత మంచి సూపర్ హిట్ ఇచ్చినందుకు శివ గారికి థాంక్స్. అలాగే విజయ్, సమంత, మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ ఇతర టీమ్ అందరికీ థ్యాంక్స్. అన్నారు.

నిర్మాత వై రవి శంకర్ మాట్లాడుతూ - మేము ఖుషి కథ విన్నప్పుడు ఎలాంటి నమ్మకం పెట్టుకున్నామో..ఆ నమ్మకాన్ని నిజం చేసేలా రిజల్ట్ వచ్చింది. బాక్సాఫీస్ నెంబర్స్ షో బై షో పెరుగుతూ ఉన్నాయి.. మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కాబట్టి ఖుషికి థియేటర్స్ లో లాంగ్ రన్ ఉంటుంది. సినిమా విడుదలైన ప్రతి చోట నుంచి ఎక్స్ ట్రార్డినరీ రిపోర్ట్ వస్తోంది. విజయ్ సూపర్బ్ పర్మార్మెన్స్ చేశాడు. అలాగే సమంత నటన ఎంతో బాగుంది. హేషమ్ మ్యూజిక్ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతి హీరో సినిమాకు మనం చేసే ప్రమోషనల్ కంటెంట్ చూసి ప్రేక్షకులు ఒక అంచనాకు వస్తారు. సినిమా ఇలా ఉంటుందేమో అనుకుంటారు. అందుకే ప్రతి సినిమాకు ఫస్ట్ షో వరకు దాని కరెక్ట్ రిజల్ట్ వస్తుంది. మా మూవీకి ఓవరాల్ పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. అందరికీ నచ్చే సినిమా చేసిన మా దర్శకుడు శివ గారికి థాంక్స్ చెబుతున్నాం.అన్నారు.

దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ - ఖుషి సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే సంతోషంగా ఉంది. సినిమా బాగుందంటూ మీడియా పర్సన్స్ నుంచి అప్రిషియేషన్స్ వస్తున్నాయి. సినిమాను మీడియా కరెక్ట్ గా జడ్జ్ చేస్తుందని నమ్ముతాను. అలాంటి మీడియా నుంచి పాజిటివ్ రిపోర్ట్ రావడం ఆనందంగా ఉంది. దేవుడు, నమ్మకాలు, కర్మ సిద్ధాంతం అనేది మన దేశంలో వందల ఏళ్ల క్రితం నుంచి ఉంది. ఈ నేపథ్యంతో బ్యూటిఫుల్ లవ్ స్టోరీని ఇప్పుడున్న సొసైటీకి చెప్పాలనుకుని రెండేళ్ల కిందట ఖుషి కథ రాసుకున్నాను. ఆ పాయింట్ కు ప్రేక్షకులు కనెక్ట్ అవుతున్నారు. ఉదయం షో యూత్ తో మొదలై మ్యాట్నీ కపుల్స్ వెళ్తున్నారు. ఫస్ట్ షో కు ఫ్యామిలీస్ వస్తున్నారు. ఇలా మరి కొన్ని వారాల పాటు మా ఖుషి థియేటర్స్ లో ఫ్యామిలీస్ తో కళకళలాడాలని కోరుకుంటున్నా. ఫన్ అండ్ ఎమోషన్ ను విజయ్ తన నటనలో అద్భుతంగా చూపించాడు. అలాగే సమంత గారి పర్ ఫార్మెన్స్ చాలా బాగుంది. ఫస్టాఫ్ ఫన్ , లవ్ తో బాగుందని, అలాగే సెకండాఫ్ లో ఫ్యామిలీ ఎలిమెంట్స్, ఎమోషన్ నచ్చాయని అంటున్నారు. చివరిలో క్లైమాక్స్ ను బాగా హ్యాండిల్ చేశానని చెబుతున్నారు. ఒక క్లిష్టమైన పాయింట్ ను చాలా సరళంగా అందరికీ రీచ్ అయ్యేలా చూపించామంటూ ప్రశంసలు వస్తున్నాయి. దర్శకుడిగా నేను ప్రేక్షకుల మనసుల్లో మరో మెట్టుకు పైకి ఎదిగాను. ప్రతి మధ్య తరగతి కుటుంబంలో ఒక హీరో ఉంటాడు. ఇందులో స్టార్ గా తన ఇమేజ్ కాకుండా విప్లవ్ క్యారెక్టర్ ను అర్థం చేసుకుని విజయ్ నేచురల్ గా నటించాడు. ఏదైనా మనం మనిషిగా మన శక్తితో సాధించాలని అనుకుంటాడు. ఇలాంటి కొత్త పాయింట్ ఉంది కాబట్టే నేను లవ్ స్టోరీ చేశాను. లాస్ట్ అరగంట ప్రేక్షకుల్ని ఒక ఎమోషనల్ మూడ్ లోకిి తీసుకెళ్లాలని ముందే అనుకున్నాము. అది బాగా వర్కవుట్ అయి ప్రేక్షకులకు రీచ్ ‌అవడం సంతోషంగా ఉంది. సిద్ధాంతాలు, శాస్త్రాలు వేరవచ్చు కానీ ఎవరు ఏది నమ్మినా నమ్మకున్నా ప్రేమించే మనుషులతో కలిసి ఉండాలని ఈ సినిమాలో చెప్పాము. క్లైమాక్స్ ముందు వరకు క్యారెక్టర్స్ ను సస్టెయిన్ చేయకపోతే ముగింపు అంత బాగా రిసీవ్ చేసుకునేవారు కాదు. అంత సేపు ఎమోషన్ క్లైమాక్స్ చూశారంటే మీరు అక్కడే సినిమాతో కనెక్ట్ అయినట్లుగా భావిస్తాను. క్లైమాక్స్ బాగుండి ఫెయిలైన సినిమా చరిత్రలో లేదు. ఖుషి చూసి బయటకు వచ్చేప్పుడు ఒక మంచి సినిమా చూసిన ఫీల్ తోనే వస్తారు. మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ కు స్పెషల్ థాంక్స్. థియేటర్ లో పాటలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా ప్రొడ్యూసర్స్, మిగతా టీమ్ అందరికీ కంగ్రాట్స్ చెబుతున్నా.అన్నారు.

సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహాబ్ మాట్లాడుతూ - ఖుషి సినిమాతో మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చినందుకు సంతోషంగా ఉంది. సినిమాకు ప్రేక్షకులందరి దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాకు పనిచేసే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ శివ, ప్రొడ్యూసర్స్ నవీన్, రవిశంకర్ గారికి థాంక్స్. అన్నారు.

సినిమాటోగ్రాఫర్ జి.మురళి మాట్లాడుతూ - ఖుషికి వర్క్ చేసే అవకాశం ఇచ్చిన మైత్రీ వారికి, శివ గారికి థాంక్స్. స్క్రిప్ట్ బాగుంటేనే అందులో విజువల్స్ యాడ్ అవుతాయి. బ్యూటిఫుల్ స్టోరీ కాబట్టి మంచి విజువల్స్ ఇవ్వగలిగాను. సంధ్య థియేటర్ లో మూవీని ఆడియెన్స్ మధ్య చూశాను. వాళ్లంతా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా బిగ్ హిట్ అవడం సంతోషంగా ఉంది. అన్నారు.

మైత్రీ డిస్ట్రిబ్యూటర్ శశి మాట్లాడుతూ - నేను మా ఫ్యామిలీతో ఖుషి సినిమా చూశాను. మా ఇంట్లో అందరికీ మూవీ నచ్చింది. ప్రతి షోకు కలెక్షన్స్ పెరుగుతున్నాయి. ఇది విజయ్ గారి కెరీర్ లో బిగ్ హిట్ అవుతుంది. అన్నారు.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2023 Idlebrain.com. All rights reserved