pizza

Big hearted Vijay Deverakonda to share 1 crore to 100 families to share his Kushi
నా సక్సెస్ మీతో పంచుకునేందుకు నా ఖుషి సంపాదన నుంచి కోటి రూపాయలు నా ఫ్యామిలీ అయిన మీకు ఇస్తున్నా. త్వరలో వంద ఫ్యామిలీస్ ను సెలెక్ట్ చేసి ప్రతి ఫ్యామిలీకి లక్ష రూపాయల చెక్ నేను అందిస్తా. -ఖుషి వైజాగ్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ లో హీరో విజయ్ దేవరకొండ

You are at idlebrain.com > news today >
Follow Us

5 September 2023
Hyderabad

Vijay Devarakonda and Samantha starrer Kushi released in theatres on September 1st and got super hit talk from the audience. This movie was helmed by director Shiva Nirvana under Mythri Movie Makers banner.

The film became career biggest opener for Vijay Deverakonda and it is posting good numbers at box office. Today makers arranged a grand success celebration in Vizag. The bug hearted Vijay Deverakonda who always thinks a way to share his Kushi with fans announced a special gift for families.

The actor announced that he is going to share his Kushi by donating 1 crore rupees to 100 families. For the first time in Indian cinema, a hero sharing a part of remuneration to the audience. The poor families/necessity families will receive the Kushi from Vijay as #SpreadingKushi.

He said, "So, I am giving one crore rupees from my remuneration and from Kushi's earnings to you, my family, to share my happiness with you. Soon I will select one hundred families and give a check of one lakh rupees to each family. I will put a "Spreading Kushi" form on my social media. I am happy that the money I give helps you with rents and fees, says Vijay Deverakonda.

He also talked about the fake bms rating, YouTube reviews and videos. He said, "There are attacks on me and my film. They are doing fake BMS ratings and fake YouTube videos on our Kushi. Thousands of fake accounts are created and YouTube videos are circulated. Beyond all that, we are getting these numbers and success because of the love of fans and audience. You are the reason for this success."

నా సక్సెస్ మీతో పంచుకునేందుకు నా ఖుషి సంపాదన నుంచి కోటి రూపాయలు నా ఫ్యామిలీ అయిన మీకు ఇస్తున్నా. త్వరలో వంద ఫ్యామిలీస్ ను సెలెక్ట్ చేసి ప్రతి ఫ్యామిలీకి లక్ష రూపాయల చెక్ నేను అందిస్తా. - ఖుషి వైజాగ్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ లో హీరో విజయ్ దేవరకొండ

ఖుషి మీద మీరు చూపిస్తున్న ప్రేమ నాకు తెలుస్తోంది. నేను ఇంట్లో ఉన్నా ఆ ప్రేమను ఫీలవుతున్నా. నా మీద, నా సినిమా మీద అటాక్స్ జరుగుతున్నాయి. మా ఖుషి మీద ఫేక్ బీఎంఎస్ రేటింగ్స్, ఫేక్ యూట్యూబ్ వీడియోలు చేస్తున్నారు. వేలాది ఫేక్ అక్కౌంట్స్ క్రియేట్ చేసి, యూట్యూబ్ వీడియోలు సర్క్యులేట్ చేస్తున్నారు. ఇందుకు కొందరు డబ్బులు ఖర్చు చేయిస్తున్నారు.

అవన్నీ దాటుకుని అభిమానులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ నెంబర్స్, సక్సెస్ అందుకుంటున్నాం. మీరే ఈ విజయానికి కారణం.

మూడు రోజుల్నించి చూస్తున్నా మీ మొహల్లో సంతోషం చూసి నాకు చాలా తృప్తిగా ఉంది.

ఖుషి ఒక సింపుల్, క్యూట్ ఎమోషనల్ లవ్ స్టోరి. సినిమా చేసేప్పుడు శివ కూడా ఇదే మాట చెప్పాడు. విజయ్ బ్రో మనం ఒక క్యూట్ లవ్ స్టోరిని ఒక మంచి పాయింట్ చెబుతూ ఫ్యామిలీస్ హాయిగా చూసేలా చేద్దామని అనేవాడు.

ఇవాళ సినిమాకు మీరు అందిస్తున్న ప్రేమ చూస్తుంటే కృతజ్ఞతగా మీకు మేము చాలా చాలా చేయాలని అనిపిస్తోంది.

నేను డబ్బు సంపాదించాలి, అమ్మా నాన్నలను బాగా చూసుకోవాలి, సమాజంలో గౌరవంగా బతకాలి అనేది మాత్రమే ఆలోచించేవాడిని. ఇవాళ ఖుషికి మీరిస్తున్న ఆదరణ చూస్తుంటే నేనొక మంచి సినిమా చేస్తే చూసేందుకు మీరంతా ఎదురుచూస్తున్నారని అర్థమైంది.

నేను గెలవాలని, నా సినిమాలు విజయం సాధించాలని మీరంతా కోరుకుంటున్నారు. నా సినిమాలు ఫ్లాపైతే బాధపడుతున్నారు, నా సినిమా హిట్ అయితే సంతోషిస్తున్నారు.

ఈ వేదిక మీద నుంచి చెబుతున్నా. ఇప్పటి నుంచి నేను నా ఫ్యామిలీతో పాటు హండ్రెడ్ పర్సెంట్ మీ కోసం కూడా పనిచేస్తా. మీరెప్పుడూ నవ్వుతూ ఉండాలి

ఖుషిని మీ అందరితో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నా. మీ నవ్వులు చూద్దామని అనుకున్నా చూస్తున్నా. కానీ తృప్తి లేదు. కానీ ఏదో చేయాలని ఉంది. పర్సనల్ గా మీ అందరినీ కలవలేను. మీరు ఖుషిగా ఉన్నారు నేను ఖుషిగా ఉన్నా.

నా ఖుషి మీతో పంచుకునేందుకు నా ఖుషి సంపాదన నుంచి కోటి రూపాయలు నా ఫ్యామిలీ అయిన మీకు ఇస్తున్నా. త్వరలో వంద ఫ్యామిలీస్ ను సెలెక్ట్ చేసి ప్రతి ఫ్యామిలీకి లక్ష రూపాయల చెక్ నేను అందిస్తా.

నా హ్యాపీనెస్ లాగే నా సంపాదన కూడా మీతో షేర్ చేసుకుంటా. మీరంతా దేవర ఫ్యామిలీ. నా సోషల్ మీడియాలో ఒక ఫామ్ పెడతా. స్ప్రెడింగ్ ఖుషి అని. నేనిచ్చే మనీ మీకు రెంట్స్, ఫీజు దేనికి హెల్ప్ అయినా నాకు సంతోషం.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2023 Idlebrain.com. All rights reserved