pizza

‘Laggam’ – A Telugu Family Entertainer Now Streaming on OTT
Laggam on aha OTT
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు ఫ్యామిలీ ఎంటర్టైనర్.. ‘లగ్గం’

You are at idlebrain.com > news today >

22 November 2024
Hyderabad

The recently released film Laggam has garnered widespread appreciation from audiences. Set against the backdrop of a rural wedding, the movie beautifully captures the essence of village traditions and festivities. Revolving around the lives of two families, the storyline, enriched by the Telangana dialect and culture, has struck a chord with viewers. The film features veteran actors like Rajendra Prasad, LB Sriram, and Rohini in pivotal roles, all of whom have delivered commendable performances. Following a successful theatrical release, the movie has now made its way to OTT platforms.

Laggam is currently streaming on both Amazon Prime Video and Aha. With high production values, the movie showcases Rajendra Prasad in the role of a software engineer’s father-in-law, a character brought to life with his remarkable acting prowess. Rohini delivers one of the best performances of her career, while LB Sriram and Raghu Babu impress with their stellar portrayals.

Written and directed by Ramesh Cheppala, the film features a soulful background score by Mani Sharma, music by Charan Arjun, and cinematography by Ball Reddy, with editing by Bonthala Nageswara Reddy. Produced by Venu Gopal Reddy under the Subishi Entertainments banner, Laggam is a perfect family entertainer that is expected to achieve significant success on OTT platforms, as per industry buzz.

ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు ఫ్యామిలీ ఎంటర్టైనర్.. ‘లగ్గం’

ఇటీవల విడుదలైన లగ్గం చిత్రం ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంది. పల్లెటూరిలో జరిగే పెళ్లితంతును ఎంతో అందంగా చూపించిన సినిమా ఇది. సరికొత్త నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాకు అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలంగాణ యాస.. సాంప్రదాయాలు, పెళ్లితంతును ఆకట్టుకునేలా రెండు కుటుంబాల చుట్టూ తిరిగే కథే ఇది. ఇందులో విలక్షణ నటుడు రాజేంద్ర ప్రసాద్, ఎల్బీ శ్రీరామ్, రోహిణి వంటి సీనియర్ నటీనటులు కీలకపాత్రలు పోషించారు. థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి వచ్చింది. లగ్గం సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ మరియు ఆహా ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది.

ఈ సినిమా ప్రస్తుతం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. మంచి నిర్మాణ విలువలతో వచ్చిన ఈ సినిమాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అల్లుడిగా రావాలని కలలు కనే పాత్రలో రాజేంద్రప్రసాద్ నటన ఆకట్టుకుంది. రోహిణి తన కెరియర్ లో చేసిన బెస్ట్ క్యారెక్టర్. ఎల్బీ శ్రీరామ్ గారు, రఘు బాబు అందరూ అద్భుతంగా నటించారు.

ఈ చిత్రానికి రమేశ్ చెప్పాల రచన-దర్శకత్వం వహించగా... మణిశర్మ నేపధ్య సంగీతం అందించారు, చరణ్ అర్జున్ పాటలు, బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందించిన ఈ సినిమాకు బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటర్. సుబిషి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వేణుగోపాల్ రెడ్డి నిర్మించారు. కుటుంబమంతా కలిసి చూడాల్సిన లగ్గం సినిమా ఓటీటీలో పెద్ద హిట్ అవుతుందని సినీ వర్గాల టాక్.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved