pizza

Laksh Chadalavada, Shekkhar Suri’s Laksh08 Under STTV Films Announced
లక్ష్ చదలవాడ, శేఖర్ సూరి ప్రాజెక్ట్‌ కాన్సెప్ట్ పోస్టర్ విడుదల

You are at idlebrain.com > news today >
Follow Us

10 October 2023
Hyderabad

The very talented hero Laksh Chadalavada who shot to fame with the gripping thriller Valayam is awaiting the release of his ongoing film Dheera. On the occasion of Laksh’s birthday, his new movie was announced. Laksh for his 8th movie will be joining forces with director Shekkhar Suri of A Film By Aravind fame.

This intriguing and exciting thriller in this thrilling combination was announced through this captivating poster. While the lead pair walk alone on the deserted road, there is a blast in front of them and it is shown like a brain. This shows the mastery of Shekkhar Suri who also penned the story and screenplay of the movie.

Sri Tirumala Tirupati Venkateswara Films will produce the movie, while Chadalavada Brothers will present it. The movie will have some well-known actors and top-notch technicians associated with it.

The shoot of #Laksh08 will commence soon. More details are awaited.

లక్ష్ చదలవాడ, శేఖర్ సూరి ప్రాజెక్ట్‌ కాన్సెప్ట్ పోస్టర్ విడుదల

టాలీవుడ్ యంగ్ హీరో లక్ష్ చదలవాడ ప్రస్తుతం ఫుల్ స్పీడు మీదున్నారు. వరుసగా సినిమాలు చేస్తూ ఉన్నారు. వలయం, గ్యాంగ్‌స్టర్ గంగరాజు వంటి హిట్ సినిమాల్లో లక్ష్ తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. ఇప్పుడు ధీర అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. లక్ష్ బర్త్ డే సందర్భంగా ధీర నుంచి అదిరిపోయే గ్లింప్స్‌ను మేకర్లు రిలీజ్ చేశారు. ఈ సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది. మరో వైపు కొత్త ప్రాజెక్ట్‌కు లక్ష్ ఓకే చెప్పేశారు.

లక్ష్ 8వ చిత్రంగా రాబోతున్న ఈ ప్రాజెక్ట్ కాన్సెప్ట్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాకు 'ఏ ఫిల్మ్ బై అరవింద్' ఫేమ్ శేఖర్ సూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్‌ మీద పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ కాన్సెప్ట్ పోస్టర్ అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఈ కాన్సెప్ట్ పోస్టర్ చూస్తుంటే.. హీరో హీరోయిన్లు ఏదో ప్రమాదంలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. అలా రోడ్డు మీద వెళ్తున్నట్టుగా.. ఇక అగ్నిజ్వాలలు అలా చెలరేగి.. అది కాస్త మేఘాల్లా మారి.. మెదడు ఆకారంలోకి రావడం చూస్తుంటే.. ఈ సినిమా సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా అనిపిస్తోంది. మెదడుకు మేత పెట్టేలా సినిమా ఉంటుందనిపిస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను మేకర్లు ప్రకటించనున్నారు.

నటీనటులు: లక్ష్ చదలవాడ

సాంకేతిక బృందం
సమర్పణ : చదలవాడ బ్రదర్స్
బ్యానర్ : శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వ
నిర్మాత : పద్మావతి చదలవాడ
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : శేఖర్ సూరి

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2023 Idlebrain.com. All rights reserved