pizza
Lakshmi Manchu is the brand ambassador of Swachch Bharat
You are at idlebrain.com > news today >
Follow Us

3 September 2015
Hyderabad

స్వ‌చ్ఛ భారత్ మిష‌న్ కు తెలంగాణ బ్రాండ్ అంబాసిడ‌ర్ గా మంచు ల‌క్ష్మి

ప్ర‌ధాని ఎంంతో ప్ర‌తిష్టాత్మకంగా చేపట్టిన స్వ‌చ్ఛ భారత్ మిష‌న్ కు ఎంతో అద్బుత స్పంద‌న వ‌చ్చింది. దేశంలోని ప‌లు ప్ర‌ముఖులు ఎంతో బాధ్య‌తగా తీసుకుని దేశాన్ని ప‌రిశుభ్రం చేయాల‌ని శ్ర‌మించారు. ఈ స్వ‌చ్ఛ భారత్ మిష‌న్ కార్య‌క్ర‌మానికి తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడ‌ర్ గా సినీ న‌టి, నిర్మాత ల‌క్ష్మి మంచు ఎంపికయింది. సెప్టెంబ‌ర్ 10న రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ లో ప‌లువురు ప్ర‌ముఖుల మ‌ధ్య‌లో రాష్ట్ర‌ప‌తి ఆమెను గౌరవించ‌నున్నారు.

ఈ సంద‌ర్భంగా ల‌క్ష్మిమంచు మాట్లాడుతూ.. "ప్రధాని న‌రేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు అందుకొని, నా స్థాయిలో నేను ఇప్ప‌టికే ఎన్నో కార్య‌క్ర‌మాలు చేశాను. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర స్వ‌చ్ఛ భార‌త్ మిష‌న్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేయ‌డం మ‌రింత బాధ్య‌త పెంచింది. ఈ నెల 10న ఢిల్లీలోని రాష్ర్ట‌ప‌తి కార్యాల‌యంలో రాష్ర్ట‌ప‌తి చేతుల మీదుగా గౌర‌వాన్ని అందుకోవ‌డం నా అదృష్టంగా భావిస్తున్నా. అలాగే తెలంగాణ రాష్ర్టాన్ని స్వ‌చ్చ తెలంగాణ‌గా మార్చ‌డానికి నా వంతు స‌హాయ స‌హ‌కారాలు అందిస్తాన‌న్నారు. ఇంత‌టి గౌర‌వాన్ని అందించిన ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు" చెప్పారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved